E-Paper
Advertisement

ఆపిల్ టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ ఇండియాలో విడుదల..ధర,ఫీచర్ల పూర్తి వివరాలు!

ఆపిల్ టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ ఇండియాలో విడుదల..ధర,ఫీచర్ల పూర్తి వివరాలు!
Advertisement

Apple touchscreen laptop: ప్రపంచ టెక్ మార్కెట్‌లో.. ఎల్లప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టించే ఆపిల్ సంస్థ, మరో సారి టెక్ లవర్స్‌ను ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకు ల్యాప్‌టాప్‌ల విషయంలో.. టచ్‌ స్క్రీన్ ఫీచర్‌కు దూరంగా ఉన్న ఆపిల్, తన నిర్ణయాన్ని మార్చుకుంటూ.. ఎట్టకేలకు మొట్ట మొదటి టచ్‌ స్క్రీన్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి వదిలింది. సరి కొత్త ‘ప్రోలెడ్ ఎక్స్‌డీఆర్’డిస్‌ప్లేతో.. వస్తున్న ఈ మ్యాక్‌ బుక్ ప్రో ఇప్పుడు ఇండియాలోనూ అధికారికంగా విడుదలైంది. మార్కెట్‌లో ట్రెండ్ సృష్టిస్తున్న ఈ సరి కొత్త గాడ్జెట్ విశేషాలు ఇప్పుడు వివరంగా చూద్దాం!

ఆపిల్ నుంచి మొట్టమొదటి టచ్‌స్క్రీన్:

స్టీవ్ జాబ్స్ కాలం నుంచి ఆపిల్ ల్యాప్‌ టాప్‌లలో టచ్‌ స్క్రీన్ ఉండకూడదనే.. నిబంధన ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా..యూజర్ల అవసరాలను దృష్టిలో.. ఉంచుకొని ఆపిల్ ఈ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఐప్యాడ్ లాంటి టచ్ ఫీల్ ఇప్పుడు మ్యాక్‌ బుక్ స్క్రీన్‌పైనే.. పొందేలా దీన్ని డిజైన్ చేశారు.ఫోటో ఎడిటింగ్, వీడియో ప్రొడక్షన్ ,డిజిటల్ క్రియేటర్లకు ఈ టచ్‌స్క్రీన్ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రోలెడ్ ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ప్రత్యేకతలు:

Advertisement

ఈ ల్యాప్‌టాప్ మెయిన్ హైలైట్  దీని ‘ప్రోలెడ్ ఎక్స్‌డీఆర్’స్క్రీన్. ఇది అద్భుతమైన కలర్ అక్యురెసీ, డీప్ బ్లాక్స్, అత్యధిక బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.మనం చూసే.. ప్రతీ విజువల్ అత్యంత సహజంగా,సినిమా థియేటర్ ఫీల్ తలపించేలా కనిపిస్తుంది. హెచ్‌డీఆర్ కంటెంట్.. చూసేటప్పుడు లేదా గ్రాఫిక్స్ డిజైన్ చేసేటప్పుడు ఈ డిస్‌ప్లే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది.

ప్రాసెసర్, బ్యాటరీ లైఫ్:

ఆపిల్ సిరీస్ ఎం-చిప్ పవర్‌తో.. వస్తున్న ఈ ల్యాప్‌ టాప్ స్పీడ్ గురించి.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతటి భారీ సాఫ్ట్‌ వేర్‌లనైనా చిటికెలో.. రన్ చేస్తుంది.అలాగే ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. రోజంతా పని చేసేలా పవర్ ఫుల్ బ్యాటరీ లైఫ్‌ను ఇందులో అందించారు. మెటాలిక్ ఫినిషింగ్, స్లీక్ డిజైన్ దీనికి మరింత రాయల్ లుక్‌ను తెచ్చిపెట్టాయి.

Advertisement

Also Read: రూ.1,399కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్..ఫ్రీగా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్!

ధర వివరాలు:

ప్రీమియం ఫీచర్లు, ఆపిల్ బ్రాండ్ వాల్యూతో.. వస్తున్న ఈ కొత్త టచ్‌ స్క్రీన్ మ్యాక్‌ బుక్ ప్రో ధర కాస్త ఎక్కువే ఉంటుంది. భారత్‌లో దీని ప్రారంభ ధర సుమారు రూ.1,75,000 నుంచి ప్రారంభమై, వేరియంట్, స్టోరేజ్‌ను బట్టి రూ.2,50,000 పైగా ఉండే అవకాశం ఉంది. ఆపిల్ అధికారిక స్టోర్‌లు, ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ ఫారమ్‌లలో ఇది కొనడానికి అందుబాటులో ఉంది.

మొత్తంగా చూస్తే..ఆపిల్ లవర్స్, ప్రొఫెషనల్ క్రియేటర్లకు ఈ టచ్‌ స్క్రీన్ మ్యాక్‌ బుక్ ప్రో ఒక అద్భుతమైన గిఫ్ట్ అని చెప్పొచ్చు. ట్రెండీ లుక్, సూపర్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్, సరి కొత్త టచ్ టెక్నాలజీ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. మీరు కూడా మీ ప్రొఫెషనల్ లైఫ్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే.. ఈ ఆపిల్ లేటెస్ట్ ల్యాప్‌ టాప్‌ను ట్రై చేయండి.

Related News

ఫోన్ నెట్‌వర్క్ పదేపదే మారుతోందా?ఈ సమస్యకు పక్కా పరిష్కారం ఇదిగో!

రూ.15 వేల బడ్జెట్‌లో ఇంత మంచి ఫోన్స్ దొరుకుతాయా? ఈ ఐదు మోడల్స్‌లో ఏది బెస్ట్ అంటే?

రూ.1,399కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్..ఫ్రీగా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్!

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..గ్రూప్ చాట్ కోసం 4 కొత్త ఫీచర్లు విడుదల!

ఏఐ మోడల్స్‌లో తప్పులను గుర్తించేందుకు OpenAI కొత్త సేఫ్టీ సిస్టమ్.. 4 లేయర్లతో నిఘా!

ఇంటిని థియేటర్‌గా మార్చేయండి..మార్కెట్లో అడుగుపెట్టిన లేటెస్ట్ టీవీలివే!

TRAI దెబ్బకు దిగొచ్చిన టెలికాం కంపెనీలు.. Vi నుంచి రూ.179కే అన్లిమిటెడ్ కాల్స్ ప్లాన్స్!

Big Stories

Advertisement
×