Vi Voice Only Plans: మొబైల్ రీఛార్జ్‌లు రోజురోజుకూ భారమవుతున్న ఈ రోజుల్లో.. టెలికాం కంపెనీలు సామాన్య జనాలకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కేవలం కాల్స్ మాట్లాడుకునే వారి కోసం ఇప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్యాక్స్ అందుబాటులోకి వచ్చాయి. వొడాఫోన్ ఐడియా (Vi) కంపెనీ తాజాగా 4 కొత్త వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ ప్లాన్లను తీసుకొచ్చారు. గతంలో ఎయిర్టెల్ కూడా ఇలాంటి ప్లాన్లనే ప్రవేశపెట్టింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు, తక్కువ ఆదాయం ఉన్నవారు ఖరీదైన రీఛార్జ్‌లు చేయలేక ఇబ్బంది పడుతున్నారని ట్రాయ్ గుర్తించింది. ముఖ్యంగా ఫీచర్ ఫోన్లు వాడేవాళ్లకు తక్కువ రోజులు, తక్కువ ధరలో ఉండే ప్యాక్స్ కావాలని కోరింది. సెప్టెంబర్ 21న ట్రాయ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. టెలికాం కంపెనీలు కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక టారిఫ్ వోచర్లను తీసుకురావాల్సి వచ్చింది. దీంతో సామాన్యులపై ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు.
Also Read: యాపిల్ నుంచి మరో సంచలనం.. కేవలం 5.2 మిమీ మందంతో వస్తున్న iPhone Air 2!
Vi తీసుకువచ్చిన ఈ కొత్త ప్లాన్లలో రూ.179 రీఛార్జ్ ప్యాక్ చాలా చౌకైనది. దీని ద్వారా 25 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే 300 ఎస్ఎంఎస్లతో పాటు Vi మూవీస్ అండ్ టీవీ యాప్ ఫ్రీ యాక్సెస్ కూడా లభిస్తుంది. ఇక రూ.189 ప్యాక్ విషయానికి వస్తే.. ఇది 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లు వస్తాయి కానీ, ఇందులో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్ ఫ్రీగా రావు.
ఈ జాబితాలో రూ.203 ప్యాక్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో కూడా అన్లిమిటెడ్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు ఇస్తున్నారు. ఇక చివరిగా రూ.206 ధరతో మరో ప్యాక్ ఉంది. ఇది నెల రోజుల వాలిడిటీని ఇస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ యాప్ సబ్స్క్రిప్షన్లు ఉండవు. అచ్చం ఇలాంటి ప్లాన్లనే ఎయిర్టెల్ కంపెనీ కూడా కొద్ది రోజుల క్రితమే మార్కెట్లోకి తెచ్చింది.
Also Read: బుర్రలోని ఆలోచనలను టెక్స్ట్‌గా మార్చే విచిత్ర గ్యాడ్జెట్.. జొమాటో సీఈఓ కొత్త ప్రయోగం ఫలిస్తుందా?