E-Paper
Advertisement

ఫోన్ నెట్‌వర్క్ పదేపదే మారుతోందా?ఈ సమస్యకు పక్కా పరిష్కారం ఇదిగో!

ఫోన్ నెట్‌వర్క్ పదేపదే మారుతోందా?ఈ సమస్యకు పక్కా పరిష్కారం ఇదిగో!
Advertisement

4g to 5g shifting solution: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ ఫోన్ మన జీవితంలో.. ఒక ముఖ్యమైన భాగమైపోయింది.ముఖ్యంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం.. అందరూ 5G నెట్‌వర్క్‌ను విపరీతంగా వాడేస్తున్నారు.టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు దేశ వ్యాప్తంగా 5G సేవలను అందిస్తుండటంతో చాలా మంది తమ ఫోన్లను 5జికి అప్‌గ్రేడ్ చేసుకున్నారు. అయితే.. చాలామంది యూజర్లు ఒక సాధారణ సమస్యను ఎదుర్కొంటున్నారు. అదేంటంటే, ఇంట్లో లేదా బయట ఉన్నప్పుడు ఫోన్ నెట్‌వర్క్ తరచూ 4G , 5G మధ్య పదేపదే మారుతూ ఉంటుంది. దీని వల్ల వాట్సాప్ మెసేజ్‌లు లేట్‌గా రావడమే కాకుండా.. ఆన్‌లైన్ వీడియోలు చూసేటప్పుడు బఫరింగ్ అవుతుంది. అంతే కాకుండా దీని వల్ల ఫోన్ బ్యాటరీ కూడా వేగంగా అయిపోతుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు చూద్దాం!

1. నెట్‌వర్క్ మోడ్‌ను మార్చడం:

మీ ప్రాంతంలో 5G సిగ్నల్స్ సరిగ్గా లేనప్పుడు ఫోన్ ఆటోమేటిక్‌గా 4Gకి మారుతుంది. సిగ్నల్స్ రాగానే.. మళ్లీ 5Gకి వెళ్తుంది. ఈ రకమైన మార్పును నివారించడానికి మీ ఫోన్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లోని.. Settings ఓపెన్ చేయండి. తర్వాత Mobile Network లేదా Connections ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అందులో Preferred Network Typeలోకి వెళ్లండి. ఒకవేళ మీ ప్రాంతంలో 5G సిగ్నల్స్ బలహీనంగా ఉంటే..తాత్కాలికంగా LTE/4G మోడ్‌ను సెలెక్ట్ చేసుకుంటే నెట్‌వర్క్ మారకుండా ఉంటుంది.

2. నెట్‌వర్క్ రీసెట్ చేయడం:

Advertisement

కొన్ని సార్లు ఫోన్‌లోని సాఫ్ట్‌ వేర్ గ్లిచ్‌ల వల్ల కూడా నెట్‌వర్క్ సిగ్నల్ సరిగ్గా పట్టు కోదు. దీన్ని పరిష్కరించడానికి నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేయడం బెస్ట్ అని చెప్పొచ్చు.
ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి System లేదా General Management ఓపెన్ చేయండి. అందులో Reset ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. Reset Wi-Fi, Mobile & Bluetooth లేదా Reset Network Settings పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల వైఫై, బ్లూటూత్ తో పాటు మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

3. ఏరోప్లేన్ మోడ్ ట్రిక్:

మీ ఫోన్ నెట్‌వర్క్ సడన్‌గా ఆగిపోయినా లేదా 4G-5G మధ్య షిఫ్ట్ అవుతూ ఇబ్బంది పెట్టినా.. సింపుల్‌గా ఫోన్‌ను కొన్ని సెకన్ల పాటు Airplane Modeలోకి మార్చి, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ మోడ్‌కి తీసుకురండి. దీని వల్ల టవర్ సిగ్నల్స్ రిఫ్రెష్ అయ్యి దగ్గర్లోని బలమైన 5G లేదా 4G టవర్‌కు కనెక్ట్ అవుతుంది.

4. సిమ్ కార్డ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్:

Advertisement

కొన్నిసార్లు పాత సిమ్ కార్డ్ వల్ల కూడా 5G నెట్‌వర్క్ సరిగ్గా పని చేయదు. మీరు వాడుతున్నది చాలా పాత సిమ్ అయితే మాత్రం సంబంధిత టెలికాం ఆపరేటర్ స్టోర్‌కి వెళ్లి 5G సపోర్టెడ్ సిమ్‌కి అప్‌ గ్రేడ్ చేసుకోవడం మంచిది.అలాగే మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. కంపెనీలు బగ్‌లను ఫిక్స్ చేయడానికి ఎప్పటి కప్పుడు ప్యాచ్‌లను విడుదల చేస్తుంటాయి.

Also Read: రూ.1,399కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్..ఫ్రీగా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్!

నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించుకోవడానికి.. మీరు ప్రత్యేకంగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఫోన్లలో ఉండే.. ఇన్‌బిల్ట్ సెట్టింగ్సే కాబట్టి పూర్తిగా ఫ్రీ. ఒక వేళ మీ సిమ్ కార్డ్ మార్చాల్సి వస్తే.. ఆపరేటర్లను బట్టి సిమ్ రీప్లేస్‌మెంట్ కోసం నామమాత్రపు ఛార్జీలు (రూ.20-రూ.50లోపు) ఉండొచ్చు.

4G, 5G మధ్య నెట్‌వర్క్ పదే పదే మారడం వల్ల.. ఇంటర్నెట్ స్పీడ్ మందగించడమే కాకుండా.. మొబైల్ బ్యాటరీ కూడా త్వరగా అయిపోతుంది.పైన పేర్కొన్న చిన్న చిన్న సెట్టింగ్స్ మార్పుల ద్వారా ఈ సమస్యను ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఈ ట్రిప్స్ పాటించి మీ ఇంటర్నెట్ ఫీల్ మరింత స్మూత్‌గా మార్చుకోండి!

Related News

ఆపిల్ టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ ఇండియాలో విడుదల..ధర,ఫీచర్ల పూర్తి వివరాలు!

రూ.15 వేల బడ్జెట్‌లో ఇంత మంచి ఫోన్స్ దొరుకుతాయా? ఈ ఐదు మోడల్స్‌లో ఏది బెస్ట్ అంటే?

రూ.1,399కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్..ఫ్రీగా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్!

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..గ్రూప్ చాట్ కోసం 4 కొత్త ఫీచర్లు విడుదల!

ఏఐ మోడల్స్‌లో తప్పులను గుర్తించేందుకు OpenAI కొత్త సేఫ్టీ సిస్టమ్.. 4 లేయర్లతో నిఘా!

ఇంటిని థియేటర్‌గా మార్చేయండి..మార్కెట్లో అడుగుపెట్టిన లేటెస్ట్ టీవీలివే!

TRAI దెబ్బకు దిగొచ్చిన టెలికాం కంపెనీలు.. Vi నుంచి రూ.179కే అన్లిమిటెడ్ కాల్స్ ప్లాన్స్!

Big Stories

Advertisement
×