whatsapp features: ప్రస్తుత డిజిటల్ కాలంలో వాట్సాప్ వాడకం తప్పనిసరిగా మారింది.ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే .. వరకు ఆఫీస్ పనులు, ఫ్రెండ్స్ గ్రూప్స్, ఫ్యామిలీ చాటింగ్.. అంటూ ఎప్పుడూ వాట్సాప్‌లోనే గడుపుతుంటాము.ఈ నేపథ్యంలోనే యూజర్ల అవసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. మెటా సంస్థ వాట్సాప్‌కు అదిరి పోయే అప్‌డేట్లను ఇస్తూనే ఉంది. తాజాగా వాట్సాప్ గ్రూప్ చాట్ మేనేజ్‌మెంట్‌ను మరింత ఈజీ చేయడానికి ఏకంగా 4 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ కొత్త ఫీచర్ల విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం!
సాధారణంగా మనం వాట్సాప్‌లో ఏదైనా ముఖ్యమైన మెసేజ్‌ను గ్రూప్‌లో పిన్ చేస్తే..అది కొన్ని రోజులకు ఆటోమేటిక్‌గా అన్‌పిన్ అయిపోతుంది. కానీ.. యూజర్ల డిమాండ్ మేరకు వాట్సాప్ ఇప్పుడు సరి కొత్త మార్పు చేసింది. దీని ద్వారా గ్రూప్ అడ్మిన్లు.. లేదా మెంబర్లు ముఖ్యమైన మెసేజ్‌లను కేవలం 7 లేదా 30 రోజులే కాకుండా.. శాశ్వతంగా పిన్ చేసుకునే అవకాశం కల్పించారు.దీని వల్ల గ్రూప్‌లో కొత్తగా చేరిన సభ్యులకు కూడా పాత ముఖ్యమైన సమాచారం ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది.
కొత్తగా ఏదైనా ఫోన్‌కి మళ్లినప్పుడు.. లేదా గ్రూప్‌లోని పాత విషయాలను ఇతరులతో.. పంచుకోవాల్సి వచ్చినప్పుడు చాట్ హిస్టరీని షేర్ చేయడం ఇంతకు ముందు కాస్త కష్టంగా ఉండేది.కానీ ఈ కొత్త అప్‌డేట్‌తో గ్రూప్ లేదా పర్సనల్ చాట్ హిస్టరీని చాలా ఈజీగా, తక్కువ సమయంలో.. ఇతరులకు షేర్ చేసేలా టూల్స్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ఇది ముఖ్యంగా ఆఫీస్ గ్రూప్‌లలో పని చేసే వారికి ఎంతగానో ఉపయోగ పడుతుంది.
గ్రూప్‌లను మరింత క్రమబద్ధంగా ఉంచడానికి అడ్మిన్లకు మరిన్ని పవర్‌లను ఇచ్చారు. ఎవరు గ్రూప్‌లో పోస్ట్‌లు చేయెచ్చు. ఎవరికి అనుమతి ఉండాలి.. అనే విషయాలపై అడ్మిన్లు మరింత స్పష్టమైన నియంత్రణను కలిగి ఉంటారు. అలాగే గ్రూప్‌లో జరిగే అనవసరమైన స్పామ్ మెసేజ్‌లను అరి కట్టడానికి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది.
Also Read: ఫిలిప్స్ పార్టీ స్పీకర్ లాంచ్..ఇక నుంచి ఇంట్లోనే డీజే మజా!
గ్రూప్ చాటింగ్‌ను మరింత సరదాగా.. ఉత్సాహంగా మార్చడానికి పోల్స్ ఫీచర్‌ను మరింత అడ్వాన్స్‌డ్ చేశారు. ఒకే సారి ఎక్కువ మంది అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఇది ఉపయోగ పడుతుంది. అలాగే నోటిఫికేషన్ బార్ నుంచే నేరుగా రిప్లై ఇచ్చే ఫాస్ట్ రెస్పాన్స్ ఫీచర్‌ను మరింత ఆప్టిమైజ్ చేశారు.
వాట్సాప్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ పూర్తిగా ఉచితంగా లభించే యాప్. దీని లోని ఏ ఫీచర్‌ను ఉపయోగించడానికి కూడా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. ఈ లేటెస్ట్ ఫీచర్లన్నీ మీ ఫోన్‌లోని వాట్సాప్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. ఒకవే ళ రాక పోతే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌కి వెళ్లి వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే సరి పోతుంది.
మొత్తంగా చూస్తే.. వాట్సాప్ తెచ్చిన ఈ 4 కొత్త ఫీచర్లు గ్రూప్ చాట్ ఫీల్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా.. శాశ్వత పిన్నింగ్ ఫీచర్ యూజర్లకు ఎంతో ఊరటనిస్తుంది. మీరు కూడా వెంటనే మీ వాట్సాప్‌ను అప్ డేట్ చేసుకొని ఈ కొత్త ఫీచర్లను ట్రై చేయండి!