E-Paper
Advertisement

రూ.1,399కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్..ఫ్రీగా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్!

రూ.1,399కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్..ఫ్రీగా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్!
Advertisement

Noise buds r1: ప్రస్తుత రోజుల్లో వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగి పోయింది. ప్రయాణాల్లో.. ఉన్నప్పుడు, జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు లేదా తీరిక సమయాల్లో పాటలు వినడానికి అందరూ ఇయర్‌ బడ్స్‌నే ఎక్కువగా వాడుతున్నారు. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ప్రముఖ ఆడియో బ్రాండ్ ‘నాయిస్’ ఎప్పటి కప్పుడు కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూనే.. ఉంది. తాజాగా.. మ్యూజిక్ లవర్స్‌ను మరింత ఆకట్టుకునేలా ‘నాయిస్ బడ్స్ R1 గానా ఎడిషన్’పేరుతో ఓ సరి కొత్త ఇయర్‌ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ డివైజ్ కేవలం బడ్జెట్ ధరలోనే కాకుండా..అదిరి పోయే కాంబో ఆఫర్‌తో వస్తుండటంతో టెక్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ధర, ఫ్రీ ఆఫర్:

ఈ కొత్త ఇయర్‌ బడ్స్ అసలు ధర కేవలం రూ.1,399 మాత్రమే. అయితే దీని ప్రత్యేకత ఏమిటంటే.. దీంతో.. పాటు రూ. 799 విలువైన ‘గానా ప్లస్’ వన్ ఇయర్ సబ్‌స్క్రిప్షన్..పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. అంటే..తక్కువ ధరకే అద్భుతమైన ఇయర్‌ బడ్స్ సొంతం చేసుకోవడంతో పాటు..ఎలాంటి యాడ్స్ లేని.. యాడ్-ఫ్రీ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను ఏడాది పాటు ఎంజాయ్ చేయెచ్చు.

నాయిస్ బడ్స్ R1 గానా ఎడిషన్ ప్రత్యేకతలు:

Advertisement

తక్కువ ధరలో లభించినప్పటికీ..ఇందులో బెస్ట్ పవర్-ప్యాక్డ్ ఫీచర్లను అందించారు.

సౌండ్ ,డ్రైవర్లు: ఈ ఇయర్‌బడ్స్‌లో పవర్ ఫుల్ 11mm డ్రైవర్లను వాడారు. ఇవి మంచి డీప్ బేస్ , క్లియర్ ఆడియోను అందిస్తాయి.

Advertisement

బ్యాటరీ లైఫ్: ఒక్క సారి ఛార్జ్ చేస్తే చాలు.. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 40 గంటల వరకు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ టైమింగ్‌ను ఇస్తుంది.

ఫాస్ట్ ఛార్జింగ్: ఇందులో.. ఇన్‌స్టాచార్జ్ టెక్నాలజీ ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే దాదాపు 120 నిమిషాల పాటు పాటలు వినొచ్చు.

కాల్స్ క్లారిటీ: క్వాడ్ మైక్ ఈఎన్‌సీ టెక్నాలజీ కారణంగా బయట తిరుగుతున్నప్పుడు మాట్లాడినప్పటికీ అవతలి వారికి మీ గొంతు స్పష్టంగా వినిపిస్తుంది.

Also Read: ఫిలిప్స్ పార్టీ స్పీకర్ లాంచ్..ఇక నుంచి ఇంట్లోనే డీజే మజా!

కనెక్టివిటీ, గేమింగ్: ఇది లేటెస్ట్ బ్లూటూత్ v5.3 సపోర్ట్‌తో వస్తుంది. అలాగే..గేమ్స్ ఆడే వారి కోసం 40ms అల్ట్రా-లో లేటెన్సీ ఫీచర్‌ను అందించారు. దీని వల్ల ఆడియో సింక్ సమస్యలు ఉండవు.

వాటర్ రెసిస్టెన్స్: ఇవి IPX5 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. కాబట్టి వర్షంలో లేదా వర్కౌట్ చేసే సమయంలో.. చెమట పడినా ఇయర్‌ బడ్స్‌కు ఎలాంటి డ్యామేజ్ కాదు.

తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, అదనంగా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కోరుకునే.. వారికి ఈ నాయిస్ బడ్స్ R1 గానా ఎడిషన్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. మీరు కూడా మ్యూజిక్ లవర్ అయితే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్‌ను వెంటనే ట్రై చేయండి!

Related News

రూ.15 వేల బడ్జెట్‌లో ఇంత మంచి ఫోన్స్ దొరుకుతాయా? ఈ ఐదు మోడల్స్‌లో ఏది బెస్ట్ అంటే?

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..గ్రూప్ చాట్ కోసం 4 కొత్త ఫీచర్లు విడుదల!

ఏఐ మోడల్స్‌లో తప్పులను గుర్తించేందుకు OpenAI కొత్త సేఫ్టీ సిస్టమ్.. 4 లేయర్లతో నిఘా!

ఇంటిని థియేటర్‌గా మార్చేయండి..మార్కెట్లో అడుగుపెట్టిన లేటెస్ట్ టీవీలివే!

TRAI దెబ్బకు దిగొచ్చిన టెలికాం కంపెనీలు.. Vi నుంచి రూ.179కే అన్లిమిటెడ్ కాల్స్ ప్లాన్స్!

కిచెన్‌కు రాయల్ లుక్..బెస్ట్ గ్లాస్ డోర్ ఫ్రిజ్‌లపై ఊహించని డిస్కౌంట్లు!

ఇస్రో మరో సంచలనం.. విజయవంతంగా నింగిలోకి GSLV ఎఫ్18.. ఎన్‌వీఎస్ 03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్!

Big Stories

Advertisement
×