Female Fan Slams Shubman Gill: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నవంబర్ 4వ తేదీ నుంచి వన్డే సిరీస్ షురూ కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్ చేరుకున్న గిల్ సేన ప్రాక్టీస్ పైన ఫోకస్ చేసింది. అయితే న్యూజిలాండ్ లో టీమిండియా ప్లేయర్లు బయట కనిపిస్తే చాలు అక్కడ ఉన్న భారత అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. గిల్ తాజాగా న్యూజిలాండ్ లో ఓ షాపింగ్ మాల్ కు మెరిసాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అతడితో ఫోటోలు దిగారు.
ఈ క్రమంలో ఓ లేడీ అభిమానికి మాత్రం కెప్టెన్ గిల్ సెల్ఫీ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా గిల్ పై మండిపడుతూ ఎమోషనల్ అయింది. ఒకప్పుడు కెప్టెన్ గిల్ వికెట్ తీసి వివాదాస్పద సెలబ్రేషన్స్ చేసుకున్న అబ్రార్ అహ్మద్ పై తాను ఒంటరి పోరాటం చేశానని.. అలాంటి తనకే సెల్ఫీ ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది. దీంతో గిల్ తీరుపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.
వన్డే సిరీస్ నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వచ్చిన గిల్ ప్రాక్టీస్ పైన దృష్టి పెట్టాడు. అదే సమయంలో జాలిగా గడిపేందుకు ఓ ప్రముఖ షాపింగ్ మాల్ కు వెళ్ళాడు. ఈ సందర్భంగా ఓ లేడీ ఇండియన్ అభిమాని సెల్ఫీ అడిగితే, సారీ అని గిల్ ముఖం మీదే చెప్పేసాడట. దీంతో ఎమోషనల్ అయిన సదరు లేడీ… గిల్ ను తనను మోసం చేశాడని ఎమోషనల్ అయింది. గిల్ వికెట్ తీసిన అబ్రార్ అహ్మద్ అప్పట్లో వివాదాస్పద సెలబ్రేషన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే దానిపై అబ్రార్ అహ్మద్ ను సదరు లేడీ డైరెక్ట్ గానే కడిగిపారేసింది. గిల్ కోసం ఒంటరిగా పోరాడింది. ఆ వీడియోలు తాజాగా షేర్ చేస్తూ… గిల్ కోసం అంత పోరాటానికి దిగిన తనతో ఫోటో దిగేందుకు నిరాకరించాడని మండిపడింది. ఇదెక్కడి న్యాయమంటూ గిల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ గా మారాయి. దీంతో గిల్ పై సోషల్ మీడియాలో క్రికెట్ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డై హార్ట్ అభిమానులకు కచ్చితంగా టైం కేటాయించాలని చురకలు అంటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ప్రస్తుతం 5 టీ20ల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటికే ట్రోఫీ దక్కించుకున్న టీమిండియా, నవంబర్ 4వ తేదీ నుంచి 5 వన్డేలు ఆడనుంది.
?utm_source=ig_web_copy_link&cplk=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==