E-Paper
Advertisement

రూ.15 వేల బడ్జెట్‌లో ఇంత మంచి ఫోన్స్ దొరుకుతాయా? ఈ ఐదు మోడల్స్‌లో ఏది బెస్ట్ అంటే?

రూ.15 వేల బడ్జెట్‌లో ఇంత మంచి ఫోన్స్ దొరుకుతాయా? ఈ ఐదు మోడల్స్‌లో ఏది బెస్ట్ అంటే?
Advertisement

Best Budget Smartphones: మొబైల్ మార్కెట్లో ఇప్పుడు రూ.15 వేల బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే చిప్స్ ధరలు పెరుగుతుండటంతో కంపెనీలు అన్నీ ఫోన్ల రేట్లను పెంచేస్తున్నాయి. దీంతో ఈ ప్రైస్ రేంజ్‌లో మంచి ఫోన్ దొరుకుతుందా లేదా అని చాలామంది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ స్మార్ట్‌ఫోన్ కొనేవారికైతే ఏది బెస్ట్ అని వెతకడం కష్టంగా మారుతోంది. అయితే మీ బడ్జెట్ ఎక్కువ కాకూడదు, అలాగని ఫీచర్లు తగ్గకూడదు అనుకునేవారి కోసం కొన్ని మంచి ఆప్షన్లు మార్కెట్లో ఉన్నాయి. మంచి బ్యాటరీ బ్యాకప్, రోజువారీ వాడకానికి సరిపోయే స్పీడ్ ఉన్న ఆ ఐదు బెస్ట్ మొబైల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి..

Mivi One 5G

తక్కువ బడ్జెట్‌లోనే 5G ఫోన్ కొనాలనుకునేవారికి Mivi One 5G ఒక మంచి ఆప్షన్. ఇందులో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ ఉండటంతో రోజువారీ యాప్స్ వాడటం, సోషల్ మీడియాలో బ్రౌజ్ చేయడం, సాధారణ గేమ్స్ ఆడటం వంటి పనులను సులభంగా చేసుకోవచ్చు. ఫొటోల కోసం 50MP ప్రధాన కెమెరా ఇచ్చారు. ఇక 6,000mAh బ్యాటరీ ఎక్కువసేపు ఫోన్ వాడేవారికి ఉపయోగపడుతుంది. అయితే, బేస్ వేరియంట్‌లో 4GB RAM మాత్రమే ఉండటంతో ఒకేసారి ఎక్కువ యాప్స్ వాడేవారికి కొంత ఇబ్బంది ఎదురుకావచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13,999.

Poco M7 Pro

Advertisement

ఫోన్‌లో సినిమాలు చూడటం, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం ఇష్టపడేవారికి Poco M7 Pro మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇందులో 6.67 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. MediaTek Dimensity 7025 Ultra ప్రాసెసర్ రోజువారీ పనులతో పాటు సాధారణ గేమింగ్‌కు కూడా ఉపయోగపడుతుంది. స్టీరియో స్పీకర్లు, Dolby Atmos సపోర్ట్ ఉండటంతో వీడియోలు చూసేటప్పుడు మంచి ఆడియో అనుభవం లభిస్తుంది. 5,110mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. ఈ బడ్జెట్‌లో డిస్‌ప్లే, సౌండ్, ఛార్జింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ ఫోన్‌ను పరిశీలించవచ్చు.

Moto G64

డిజైన్‌తో పాటు కెమెరా ఫీచర్లు కూడా ముఖ్యమనుకునేవారికి Moto G64 నచ్చవచ్చు. ఇందులో 6.72 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. స్క్రీన్‌పై కంటెంట్ చూడటం, యాప్స్ ఉపయోగించడం స్మూత్‌గా ఉంటుంది. 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉండటం మరో ప్రత్యేకత. దీనివల్ల సాధారణ ఫొటోలతో పాటు ఎక్కువ ప్రాంతాన్ని ఒకే ఫ్రేమ్‌లో క్యాప్చర్ చేయవచ్చు. 5,000mAh బ్యాటరీ, స్టీరియో స్పీకర్లు, Dolby Atmos సపోర్ట్ కూడా ఉన్నాయి. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. అయితే, 18W ఛార్జింగ్ మాత్రమే ఉండటం గుర్తుంచుకోవాలి.

Advertisement

Also Read: ఏఐ మోడల్స్‌లో తప్పులను గుర్తించేందుకు OpenAI కొత్త సేఫ్టీ సిస్టమ్.. 4 లేయర్లతో నిఘా!

Realme C100i

రోజూ ఎక్కువసేపు ఫోన్ వాడుతూ, తరచుగా ఛార్జింగ్ పెట్టే ఇబ్బంది తగ్గించుకోవాలనుకునేవారికి Realme C100i ఉపయోగపడుతుంది. ఇందులో 6,500mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కూడా లభిస్తాయి. IP64 రేటింగ్ ఉండటంతో దుమ్ము, నీటి చినుకుల నుంచి కొంత రక్షణ ఉంటుంది. అయితే, ఇందులో 8MP వెనుక కెమెరా మాత్రమే ఉంది. అంతేకాకుండా, ఈ ఫోన్‌లో 5G సపోర్ట్ లేదు. 4GB RAM, 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.15,999. అంటే, దీని ధర రూ.15 వేల బడ్జెట్‌ను దాటుతోంది. కాబట్టి, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకునేవారు, 4Gతో సరిపెట్టుకోగలిగేవారు మాత్రమే దీన్ని పరిశీలించవచ్చు.

Moto G37

ఆకర్షణీయమైన డిజైన్, మంచి సౌండ్, రోజువారీ పనులకు సరిపోయే పనితీరు కోరుకునేవారికి Moto G37 మరో ఆప్షన్. ఇందులో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే, MediaTek Dimensity 6400 ప్రాసెసర్, 50MP ప్రధాన కెమెరా ఉన్నాయి. 5,200mAh బ్యాటరీతో సాధారణ వినియోగానికి సరిపడా బ్యాకప్ లభిస్తుంది. స్టీరియో స్పీకర్లు, Dolby Atmos సపోర్ట్‌తో వీడియోలు, పాటలు వినడం బాగుంటుంది. IP64 రేటింగ్, Gorilla Glass 7i రక్షణ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.14,499. అయితే, బాక్స్‌లో 10W ఛార్జర్ మాత్రమే వస్తుండటం మైనస్ పాయింట్.

మొత్తంగా చూస్తే.. ఈ ఐదు ఫోన్లలో మీ అవసరాలకు సరిపోయే మోడల్‌ను ఎంచుకోవడం ముఖ్యం. ఎక్కువ బ్యాటరీ కావాలంటే Mivi One 5G, ఎంటర్‌టైన్‌మెంట్‌కు Poco M7 Pro, కెమెరా ఫీచర్లకు Moto G64ను పరిశీలించవచ్చు. Realme C100i ధర బడ్జెట్‌ను దాటుతుండగా.. Moto G37లో ఛార్జింగ్ వేగం తక్కువగా ఉంది. కొనుగోలు చేసే ముందు తాజా ధరలు, అందుబాటులో ఉన్న ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లను చెక్ చేసుకోవడం మంచిది.

Also Read: TRAI దెబ్బకు దిగొచ్చిన టెలికాం కంపెనీలు.. Vi నుంచి రూ.179కే అన్లిమిటెడ్ కాల్స్ ప్లాన్స్!

Tags

Related News

రూ.1,399కే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్..ఫ్రీగా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్!

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్..గ్రూప్ చాట్ కోసం 4 కొత్త ఫీచర్లు విడుదల!

ఏఐ మోడల్స్‌లో తప్పులను గుర్తించేందుకు OpenAI కొత్త సేఫ్టీ సిస్టమ్.. 4 లేయర్లతో నిఘా!

ఇంటిని థియేటర్‌గా మార్చేయండి..మార్కెట్లో అడుగుపెట్టిన లేటెస్ట్ టీవీలివే!

TRAI దెబ్బకు దిగొచ్చిన టెలికాం కంపెనీలు.. Vi నుంచి రూ.179కే అన్లిమిటెడ్ కాల్స్ ప్లాన్స్!

కిచెన్‌కు రాయల్ లుక్..బెస్ట్ గ్లాస్ డోర్ ఫ్రిజ్‌లపై ఊహించని డిస్కౌంట్లు!

ఇస్రో మరో సంచలనం.. విజయవంతంగా నింగిలోకి GSLV ఎఫ్18.. ఎన్‌వీఎస్ 03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్!

Big Stories

Advertisement
×