E-Paper
Advertisement

సామాన్యులకు గుడ్ న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు.. త్వరలోనే రూ.లక్ష దిగువకు పసిడి?

సామాన్యులకు గుడ్ న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు.. త్వరలోనే రూ.లక్ష దిగువకు పసిడి?
Advertisement

Gold Prices Crash: దేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకమైనది. పండుగలు, శుభకార్యాల సమయంలో బంగారాన్ని ధరించడాన్ని చాలా మంది గౌరవంగా భావిస్తారు. అయితే గోల్డ్ కేవలం అలంకారానికే కాకుండా.. కష్టకాలంలో ఆదుకునే ఆస్తిగా కూడా ఉపయోగపడుతుంది. అందుకే సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ దీనిపై ఇన్వెస్ట్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఏ పండుగ సీజన్ వచ్చిన గోల్డ్ కొనుగోలు దారుల్లో ఒకింత ఆందోళ ఉంటుంది. బంగారం ధరలకు రెక్కలు వచ్చేస్తాయని వారు ఫిక్స్ అయిపోతుంటారు. కానీ ఈ సారి గోల్డ్ మార్కెట్లలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు రోజు రోజుకు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో తులం బంగారం రూ.1 లక్ష దిగువకు వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదని నిపుణులు చెబుతున్నారు.

క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్.. గోల్డ్ లెక్కలు తారుమారు

సాధారణంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్ రాగానే డిమాండ్ పెరిగి బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు పసిడి ధరలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు బులియన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ అంతర్జాతీయ పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు వరుసగా పడిపోతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల వద్దకు చేరొచ్చన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఇవాళ ఒక్కరోజే భారీగా పతనం

Advertisement

నిపుణుల అంచనాలకు బలం చేకూరుస్తూ ఇవాళ (అక్టోబర్ 31) ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.3380 (24K), రూ. 3,100 (22K) తగ్గింది. వెండి ధర కిలోపై ఎవరూ ఊహించని స్థాయిలో రూ.10,000 పడిపోయింది. గత 12 నెలల కాలంలో బంగారం ధరలు ఒకే రోజు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 1,27,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 1,38,880 పలుకుతోంది. ఈ పతనం ఇలాగే మున్ముందుకూ సాగితే 22 క్యారెట్ల బంగారం ధర త్వరలోనే రూ.1,00,000 స్థాయికి దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: ఖైదీల పరారీ ఘటన.. సీఎం విజయ్ సీరియస్.. జైలు అధికారిపై వేటు!

పసిడి క్షీణతకు కారణాలు.. మరింత లోతుగా!

Advertisement

గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు (క్రూడ్ ఆయిల్) లభ్యత పెరగడం, పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గి ప్రశాంతత నెలకొనడం వల్ల గల్ఫ్ దేశాల నుండి ఎగుమతులు పుంజుకున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు దాదాపు 110 డాలర్ల స్థాయికి తగ్గి.. భారతీయ క్రూడ్ ఆయిల్ కొనుగోలు వ్యయం కూడా తగ్గింది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లలో కోత విధిస్తుందనే వార్తలతో డాలర్ విలువ పెరిగింది. డాలర్ బలపడటంతో మార్కెట్‌లో బంగారం, వెండి విక్రయాల ఒత్తిడి పెరిగింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పడిపోతాయనే భయంతో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న పసిడిని విక్రయిస్తున్నారు. ఫలితంగా దీపావళి నాటికి పసిడి ధరలు సామాన్యులకు మరింత అందుబాటులోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బిజినెస్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

Also Read: నోటీస్ ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తే.. కంపెనీపై కోర్టులో కేసు వేయవచ్చా?

Tags

Related News

నోటీస్ ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగిస్తే.. కంపెనీపై కోర్టులో కేసు వేయవచ్చా?

ఒకే చోట 500+ ప్రాజెక్ట్‌లు, స్పాట్ లోనే బ్యాంక్ లోన్లు.. హైటెక్స్‌లో నరెడ్కో ప్రాపర్టీ షో మిస్ కావద్దు

రూ.10 వేల జీతం తీసుకునే ఉద్యోగి.. కట్ చేస్తే ఖాతాలో రూ.10 వేల కోట్లు.. చివరికి ఏమైందంటే!

పెన్షనర్లు ఇక లైన్‌లో గంటలకొద్ది నిలబడాల్సిన పనిలేదు.. లైఫ్ సర్టిఫికెట్ ఇంటి నుంచే సమర్పించండి

తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ నుంచి 3 సూపర్ స్కీమ్స్.. పిల్లల భవిష్యత్తుకు కొండంత భరోసా!

భయాందోళన నేపథ్యంలో బంగారం-వెండి ధరలు పతనం, కొనుగోలు ఇదే సరైన సమయమా?

స్క్రాప్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి? ఎక్కడ కొనాలి, ఎవరికి అమ్మాలి? చెత్త నుంచి సూపర్ సంపాదన

Big Stories

Advertisement
×