E-Paper
Advertisement

ఇంటిని థియేటర్‌గా మార్చేయండి..మార్కెట్లో అడుగుపెట్టిన లేటెస్ట్ టీవీలివే!

ఇంటిని థియేటర్‌గా మార్చేయండి..మార్కెట్లో అడుగుపెట్టిన లేటెస్ట్ టీవీలివే!
Advertisement

Best smart tv: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎంటర్మైన్మెంట్ అంటే కేవలం మూవీ చూడటం మాత్రమే కాదు, ఆ ఫీల్ పూర్తి స్థాయిలో ఆస్వాదించడం. థియేటర్లలో కనిపించే పిక్చర్ క్లారిటీ, సౌండ్ ఎఫెక్ట్‌ను చాలా మంది ఇప్పుడు తమ ఇంట్లోనే కోరుకుంటున్నారు. అందుకే.. సాధారణ ఎల్ఈడీ టీవీల ట్రెండ్ పోయి, సరికొత్త ‘QLED’ టీవీల హవా నడుస్తోంది. క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో.. తయారయ్యే ఈ టీవీలు రంగులను అత్యంత సహజంగా.. ప్రకాశవంతంగా చూపించడంలో ముందుంటాయి. మీరు కూడా మీ సినిమా ఫీల్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలనుకుంటే.. మార్కెట్లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్-5 క్యూఎల్ఈడీ టీవీల గురించి తెలుసుకోవాల్సిందే!

టాప్-5 క్యూఎల్ఈడీ టీవీలు:

1.Samsung 55-Inch QLED 4K Smart TV:

టెక్నాలజీ రంగంలో సామ్సంగ్ బ్రాండ్ అందించే క్యూఎల్ఈడీ టీవీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని 4కే క్వాంటమ్ డాట్ డిస్‌ప్లే ప్రతి సీన్‌ను చాలా రిచ్‌గా చూపిస్తుంది. దీనిలో వివిధ ఓటీటీ యాప్స్‌ను చాలా స్మూత్‌గా రన్ చేసుకోవచ్చు. అద్భుతమైన కలర్ అక్యురెసీ, స్లీక్ డిజైన్, పవర్ ఫుల్ హెచ్డీఆర్ సపోర్ట్ దీని ప్రత్యేకతలు. దీని ధర సుమారు రూ. 62,000 నుంచి రూ.68,000 మధ్య ఉంటుంది.

2.TCL 55-Inch T89C QLED 4K Google TV:

Advertisement

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ బ్రాండ్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది హెచ్వీఏ ప్యానెల్‌తో వస్తుంది. ఇది సాధారణ టీవీల కంటే.. మెరుగైన కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది.గేమింగ్ లవర్స్ కోసం ఇందులో ప్రత్యేకంగా హై రిఫ్రెష్ రేట్ ఇవ్వడం విశేషం.గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్,2.1 ఛానల్ డాల్బీ ఆడియో, గేమింగ్ ఫ్రెండ్లీ ఫీచర్లు దీని ప్రత్యేకతలు. సుమారు రూ.39,000 నుంచి రూ. 42,000 మధ్య దీని ధర ఉంటుంది.

3. Hisense 55-Inch E75Q QLED 4K Smart TV:

తక్కువ ధరలో బిగ్ స్క్రీన్ కోరుకునేవారికిఈ బ్రాండ్ అద్భుతమైన ఆప్షన్. ఇది క్వాంటమ్ డాట్ కలర్ టెక్నాలజీతో.. పాటు బెస్ట్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీని స్పీకర్ల అవుట్‌ పుట్ చాలా బాగుంటుంది.కాబట్టి ప్రత్యేకంగా హోమ్ థియేటర్ అవసరం ఉండదు. డాబ్లే విజన్, క్వాంటమ్ కలర్స్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు.సుమారు రూ 35,000 నుంచి రూ. 38,000 మధ్య దీని ధర ఉంటుంది.

4. Toshiba 55-Inch 4K QLED Smart TV:

Advertisement

జాపనీస్ టెక్నాలజీతో తయారైన ఈ మోడల్ టీవీలు వాటి క్వాలిటీ, పిక్చర్ ప్రాసెసింగ్‌కు పేరుగాంచాయి. దీని రెగ్యులర్ వ్యూవింగ్ యాంగిల్స్ చాలా బాగుంటాయి. ఇంట్లోని ఏ మూల నుంచి చూసినా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. అడ్వాన్స్‌డ్ పిక్చర్ ఇంజిన్, అట్రాక్టివ్ బెజెల్‌లెస్ డిజైన్, స్మార్ట్ కనెక్టివిటీ దీని ప్రత్యేకలు. అంతే కాకుండా సుమారు రూ. 40,000 నుంచి రూ. 45,000 మధ్య దీని ధర ఉంటుంది.

Also Read: ఫిలిప్స్ పార్టీ స్పీకర్ లాంచ్..ఇక నుంచి ఇంట్లోనే డీజే మజా!

5. Xiaomi X Pro 55-Inch QLED 4K TV:

మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ క్యూఎల్ఈడీ టీవీ మిడిల్ క్లాస్ కుటుంబాలకు బెస్ట్ అని చెప్పొచ్చు.ఇది మెటాలిక్ బెజెల్‌లెస్ డిజైన్‌తో వస్తుంది కాబట్టి హాల్‌కు రాయల్ లుక్ ఇస్తుంది. PatchWall, Google TV ఫీచర్లు దీనిలో ఉంటాయి. వివిడ్ పిక్చర్ ఇంజిన్, డాల్బీ ఆడియో, మెటాలిక్ ఫినిషింగ్ దీని ప్రత్యేకతలు. సుమారు రూ. 42,000 నుంచి రూ. 45,000 మధ్య దీని ధర ఉంటుంది.

మొత్తంగా చూస్తే..క్యూఎల్ఈడీ టీవీలు సాధారణ ఎల్ఈడీల కంటే బెస్ట్ విజువల్ ఫీల్ ఇస్తాయి. మీ బడ్జెట్ , హాల్ సైజుకు సరిపోయే సరైన మోడల్‌ను ఎంచుకోవడం ద్వారా మీ ఇంటినే ఒక చిన్న సినిమా హాల్ లా మార్చుకోవచ్చు.

Related News

ఏఐ మోడల్స్‌లో తప్పులను గుర్తించేందుకు OpenAI కొత్త సేఫ్టీ సిస్టమ్.. 4 లేయర్లతో నిఘా!

TRAI దెబ్బకు దిగొచ్చిన టెలికాం కంపెనీలు.. Vi నుంచి రూ.179కే అన్లిమిటెడ్ కాల్స్ ప్లాన్స్!

కిచెన్‌కు రాయల్ లుక్..బెస్ట్ గ్లాస్ డోర్ ఫ్రిజ్‌లపై ఊహించని డిస్కౌంట్లు!

ఇస్రో మరో సంచలనం.. విజయవంతంగా నింగిలోకి GSLV ఎఫ్18.. ఎన్‌వీఎస్ 03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్!

GPS కు ఇక బైబై? నింగిలోకి ఇస్రో నావిక్ NVS-03.. అసలు దీని ప్రత్యేకత ఏంటి?

తుఫాన్‌లు ఎక్కువగా బంగాళాఖాతంలోనే ఎందుకు పుడతాయి? అరేబియా సముద్రంలో ఎందుకు తక్కువ?

యాపిల్ నుంచి మరో సంచలనం.. కేవలం 5.2 మిమీ మందంతో వస్తున్న iPhone Air 2!

Big Stories

Advertisement
×