E-Paper
Advertisement

Apple Pay In India: ఇక గూగుల్ పే, ఫోన్ పేలకు చుక్కలే.. రంగంలోకి యాపిల్ పే, ట్యాప్ చేస్తే చాలు పేమెంట్ సక్సెస్!

Apple Pay In India: ఇక గూగుల్ పే, ఫోన్ పేలకు చుక్కలే.. రంగంలోకి యాపిల్ పే, ట్యాప్ చేస్తే చాలు పేమెంట్ సక్సెస్!
Advertisement

Apple Pay In India: డిజిటల్ పేమెంట్స్ రంగంలో భారతదేశం ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జేబులో కరెన్సీ నోటు లేకపోయినా పర్వాలేదు కానీ, చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. దేన్నైనా కొనేయొచ్చనే ధీమా మనలో ఉంది. కిరాణా కొట్టులో చాక్లెట్ కొన్నా, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ చేసి వేలల్లో బిల్లు కట్టినా.. అంతా UPI ద్వారానే చెల్లింపులు చేస్తున్నాం.

అయితే, భారతదేశంలో ఇప్పటివరకు Google Pay, Phone Pay హవా నడుస్తోంది. ఇక మున్నుందు ఈ రంగంలోకి అసలైన బాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అవును మీరు విన్నది నిజమే.. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ప్రతిష్టాత్మక ‘Apple Pay’ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

2026 చివరి నాటికి ఎంట్రీ..

Advertisement

తాజా సమాచారం ప్రకారం.. 2026 చివరి నాటికి యాపిల్ తన డిజిటల్ పేమెంట్స్ సేవలను మన దేశంలో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఈ సర్వీస్ భారత్‌లోకి వస్తుందన్న వార్త ఇప్పుడు టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మార్కెట్‌ను ఏలుతున్న Google Pay, Phone Pay వంటి యాప్స్‌కు Apple ఎంట్రీ గట్టి పోటీని ఇవ్వబోతోంది.

Also Read: బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు.. 50MP కెమెరాతో వస్తోన్న కొత్త శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఇదే!

బ్యాంకులతో సంప్రదింపులు..

Advertisement

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ సంస్థ ఇప్పటికే భారతీయ నియంత్రణ సంస్థలతో పాటు ప్రముఖ బ్యాంకులు, వీసా, మాస్టర్ కార్డ్ వంటి గ్లోబల్ నెట్‌వర్క్‌లతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఈ ప్రయాణం అనుకున్నంత సులభం కాదు. లావాదేవీల రుసుములు, వాణిజ్య ఒప్పందాల విషయంలో బ్యాంకర్లతో ఒక అవగాహనకు రావాల్సి ఉంది. అంతా సజావుగా జరిగితే.. వచ్చే ఏడాది చివరికల్లా iPhone యూజర్లు తమ ఫోన్ల ద్వారా డైరెక్ట్ పేమెంట్స్ చేసే వెసులుబాటు ఉంటుంది.

ట్యాప్ చేస్తే పేమెంట్ సక్సెస్..

Apple Pay భారత్‌లో అడుగుపెట్టినప్పుడు మొదట Card-on-File ఫీచర్‌పై దృష్టి పెట్టనుంది. అంటే.. మన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను యాపిల్ వాలెట్‌కు ఒక్కసారి అనుసంధానించుకుంటే చాలు. దుకాణాల్లో ఉండే పాయింట్ ఆఫ్ సేల్(POS) మెషీన్ల వద్ద ఫోన్‌ను లేదా యాపిల్ వాచ్‌ను జస్ట్ ట్యాప్ చేస్తే పేమెంట్ సక్సెస్ అయిపోతుంది. పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే.. చాలా సురక్షితంగా చెల్లింపులు పూర్తి చేసే ఈ Contactless విధానం ఐఫోన్ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.

Apple pay సేవలు ఎప్పట్నుంచి?

మన దేశంలో Apple Pay మొదట్లో యూపీఐ సేవలను నేరుగా అందించకపోవచ్చు. ప్రస్తుతానికి సంస్థ రెగ్యులేటరీ అనుమతులపైనే దృష్టి పెట్టింది. భవిష్యత్తులో NPCI నుండి అవసరమైన లైసెన్సులు పొందిన తర్వాతే యూపీఐని జోడించే అవకాశం ఉంది. ఒకవేళ యాపిల్ గనుక యూపీఐని కూడా సపోర్ట్ చేస్తే.. ఇక మార్కెట్లో పోటీ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

యాపిల్ వ్యూహం ఇదేనా?

ప్రస్తుతం ఇండియాలో ఐఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో Apple Pay రాక అనేది కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే అస్త్రంగా తెలుస్తోంది. ఇది కేవలం పేమెంట్స్ కోసమే కాకుండా.. ఆండ్రాయిడ్ వాడుతున్న వారిని కూడా ఐఓఎస్ వైపు తిప్పుకోవాలనేది యాపిల్ మాస్టర్ ప్లాన్. ఇప్పటికే శాంసంగ్‌కు చెందిన Samsung Wallet మార్కెట్‌లో ఉండగా, ఇప్పుడు యాపిల్ పే కూడా తోడైతే ప్రీమియం కస్టమర్లకు అసలైన మజా దొరుకుతుంది. 2026 చివరి నాటికి భారత డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Read Also: వందేళ్లకు ఒక్కసారే.. 6 నిమిషాలు సూర్యుడు మాయం, పట్టపగలు చీకటి.. ఎప్పుడంటే?

 

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×