BigTV English
Advertisement

Apple Security Camera : యాపిల్ సెక్యూరిటీ కెమెరా… ఫేస్ తో పాటు బాడీ క్షణాల్లోనే..!

Apple Security Camera : యాపిల్ సెక్యూరిటీ కెమెరా… ఫేస్ తో పాటు బాడీ క్షణాల్లోనే..!

Apple Security Camera : గ్రామాలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా భద్రత కోసం ప్రస్తుత కాలంలో సీసీటీవీ కెమెరాల నిఘా తప్పనిసరైంది. అందుకు తగ్గట్టే స్మార్ట్ హోమ్ కెమెరాలు సైతం అందుబాటులోకి వచ్చేశాయి. ఇందులో ఫీచర్స్ సైతం భద్రతను మరింత పెంచే విధంగా ఉన్నాయి. అయితే ఇప్పటికే పలు టెక్​ కంపెనీలు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సెక్యురిటీ కెమెరాలను తయారు చేశాయి. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో టెక్ దిగ్గజం యాపిల్ మరో ముందడుగు వేసింది.


సెక్యూరిటీ కెమెరాల తయారీ మార్కెట్​లోకి ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్‌ ఓ అడుగు ముందుకేసి, సరికొత్త టెక్నాలజీతో ఎంట్రీ ఇవ్వనుంది. కొత్త టెక్నాలజీతో అదిరే కెమెరాను తీసుకురానుంది. ఈ కొత్త టెక్నాలజీలో ఫేషియల్ రికగ్నిషన్‌ (ముఖ గుర్తింపు) తో పాటు బాడీ ప్రింట్​ అనే ఫీచర్​ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అంటే దీంతో కేవలం ముఖ గుర్తింపు ద్వారా మాత్రమే కాకుండా భౌతిక లక్షణాల ద్వారా కూడా ఓ వ్యక్తిని గుర్తు పడుతుంది.

ఇంకా చెప్పాలంటే కెమెరాలో ముఖం సరిగ్గా రికార్డు కాకపోయినా శరీర ఆకారం, రంగు, ధరించిన దుస్తులు సహా ఇతర భౌతిక లక్షణాల ఆధారంగా వ్యక్తిని క్యాప్చర్​ చేసి గుర్తు పడుతుంది. దీనికి సంబంధించి యాపిల్ తాజాగా పేటెంట్ రైట్స్​ను కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని యూఎస్ పేటెంట్​ అండ్ ట్రేడ్ మార్క్​ ఆఫీస్​(USPTO) తెలిపింది.


ఈ సెక్యూరిటీ కెమెరా తన పరిధిలోకి వచ్చిన ప్రతీ ఒక్కరినీ కంటిన్యూస్​గా క్యాప్చర్​ చేస్తూ వారికి సంబంధించిన ప్రతి చిన్న కదలికను, ధరించిన దుస్తులు, గ్యాడ్జెట్స్​తో సహా వారి భౌతిక లక్షణాల సమాచారాన్ని సేవ్ చేస్తుందని పేటెంట్ రిపోర్టల్​లో రాసి ఉన్నట్లు USPTO పేర్కొంది. ఈ కెమెరాను ఐఫోన్​, ఐప్యాడ్, యాపిల్ టీవీకి కూడా యాక్సిస్​ ఇవ్వొచ్చు.

స్మార్ట్ హోమ్ మార్కెట్ విస్తరణే లక్ష్యంగా యాపిల్​ ఈ అధునాతన ఫీచర్ కలిగిన సెక్యూరిటీ కెమెరాను తీసుకురానుంది. ఇందులో భాగంగానే ప్రైవసీ ఫోకస్డ్​ హోమ్​ కెమెరాతో సహా ఇతర స్మార్ట్ హోమ్ డివైసెస్​ను తయారు చేస్తున్నట్లు టెక్ వర్గాలు తెలిపాయి. వీటి ద్వారా యూజర్స్​ తమ ఇంటిని ఎంతో సులభంగా కంట్రోల్ చేయడంతో పాటు నిఘా వేసి ఉంచొచ్చని చెబుతున్నాయి. ఇక ఈ సెక్యూరిటీ కెమెరాలు వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఇక తాజాగా వెలువడిన బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ నివేదిక సైతం యాపిల్ కంపెనీ హోమ్ కెమెరాలతో పాటు ఇతర స్మార్ట్ హోమ్ పరికరాలను సైతం అభివృద్ధి చేయడానికి ముందడుగు వేస్తుందని తెలిపింది. ఇప్పటికే లేటెస్ట్ టెక్నాలజీతో పలు గ్యాడ్జెట్స్ ను తీసుకొచ్చిన యాపిల్.. వచ్చే ఏడాది ఐఫోన్ 17 సిరీస్, యాపిల్ ఎస్ఈ మెుబైల్స్ ను తీసుకురానుంది. యాపిల్.. మెటా కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రేబాన్ స్మార్ట్ గ్లాసెస్ ను పోలి ఉండే స్మార్ట్ గ్లాసెస్ ను త్వరలోనే తీసుకురానున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్  2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది.

ALSO READ : గూగుల్ జెమిని తోడుగా.. స్పాటిఫై ఇకపై స్మార్ట్‌గా..

Related News

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Big Stories

×