BigTV English

Nagarjuna : ఖైరతాబాద్ ఆర్టిఏ ఆఫీస్ లో నాగార్జున… కొత్త కారు నెంబర్ ఏంటో తెలుసా?

Nagarjuna : ఖైరతాబాద్ ఆర్టిఏ ఆఫీస్ లో నాగార్జున… కొత్త కారు నెంబర్ ఏంటో తెలుసా?

Nagarjuna : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna) గత కొంతకాలంగా వరుసగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో దర్శనం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆర్టీఏ ఆఫీస్ ను ఆయన తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం సందర్శించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


నాగార్జున (Nagarjuna) ఈరోజు ఖైరతాబాద్ ఆర్టిఏ ఆఫీస్ కు టయోటా లెక్సస్ కార్ రిజిస్ట్రేషన్ కోసం వెళ్లారు. దీంతో ఆయనను ఒక్కసారిగా అక్కడ చూసిన అభిమానులు, కార్యాలయ సిబ్బంది నాగార్జునతో సెల్ఫీలు, ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ప్రక్రియలో భాగంగా అక్కడ ఫోటో కూడా దిగారు నాగార్జున. ఈ సందర్భంగా ఆర్డీఏ ఆఫీస్ అధికారి ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను నాగార్జునకు వివరించారు. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి కాగానే, నాగార్జున తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నాగార్జున కొన్న ఈ టయోటా లెక్సస్ వెహికల్ నెంబర్ TG9 GT/R4874.

ఇదిలా ఉండగా… మరోవైపు నాగార్జున (Nagarjuna) ఇంట పెళ్లి సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కినేని ఇంట వరుస వివాహ వేడుకలు జరుగనున్నాయి. ఇప్పటికే నాగర్జున పెద్ద కొడుకు. నాగచైతన్య వివాహం శోభిత ధూళిపాళ్లతో డిసెంబర్లో జరగబోతోంది. పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతుండగా, నాగార్జున చిన్న కొడుకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అఖిల్ ఎంగేజ్మెంట్ గురించి స్వయంగా నాగార్జున వెల్లడించారు. మంగళవారం అఖిల్ – జైనాబ్ (Akhil Akkineni – Jainab Ravjdee) ల నిశ్చితార్థం ఇరుకుటుంబ పెద్దల సమక్షంలో ఘనంగా జరిగిందంటూ నాగార్జున ప్రకటించారు. ఇక డిసెంబర్ 4న నాగచైతన్య – శోభిత (Naga Chaitanya – Sobhitha Dhulipala) పెళ్లి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరగబోతోంది. ఈ పెళ్లికి అక్కినేని ఫ్యామిలీతో పాటు, శోభిత కుటుంబంలోని సభ్యులు హాజరు కాబోతున్నారు. అతి తక్కువ మంది అతిధుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి జరపాలనుకుంటున్నారు. ఇక ఆ తర్వాత త్వరలోనే అఖిల్ కూడా వైవాహిక బంధం లోకి అడుగు పెట్టబోతున్నాడు. వచ్చే ఏడాది అఖిల్ – జైనాబ్ ల పెళ్లి జరిగే అవకాశం ఉందని ఇప్పటికే నాగర్జున వెల్లడించారు. ఇక తన కుటుంబంలో వరుసగా శుభకార్యాలు జరగడం పట్ల నాగార్జున ఫుల్ ఖుషి గా ఉన్నారు.


ఇక అక్కినేని హీరోల సినిమాల విషయానికొస్తే.. అఖిల్ ‘ఏజెంట్’ తరువాత మరో సినిమాను ప్రకటించలేదు. కానీ నాగ చైతన్య మాత్రం ‘తండేల్’ (Thandel) మూవీతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ తరువాత కార్తీక్ దండు దర్శకత్వంలో మరో సినిమాను లైన్ లో పెట్టాడు చై. అలాగే నాగార్జున (Nagarjuna) కూడా సినిమాలతో పాటు బుల్లితెర షోలతో బిజీబిజీగా ఉన్నారు. ఓవైపు ‘కుబేర’ (Kubera) లాంటి భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తూనే, మరోవైపు బిగ్గెస్ట్ బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 8’కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×