Credit Card: క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. చిరు ఉద్యోగుల నుండి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్నారు. దానికి కారణం బ్యాంకులు అన్నీ భారీగా ఆఫర్లు ప్రకటించడమే. షాపింగ్ కోసం ఫుల్ గా ఆఫర్లు ప్రకటించడం, అంతేకాకుండా డబ్బులు లేనప్పుడు కార్డులు ఉంటే సమస్య ఉండదని క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే ఇచ్చేటప్పుడు అంతా బాగానే ఉన్నా బిల్లు కట్టేటప్పుడు మాత్రం వినియోగదారులు చుక్కలు చూస్తున్నారు. ఆఫర్ల పేరుతో ఇచ్చిన బ్యాంకులు కస్టమర్ల జేబులు ఖాళీ చేస్తున్నాయి.
లేట్ చార్జీలు, మెయింటెనెన్స్ చార్జీల పేరుతో దోచేస్తున్నాయి. ఇక తాజాగా మరోసారి ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఆ బ్యాంకు చార్జీలను భారీగా పెంచింది. ఆన్ టైమ్ లో క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఔట్ స్టాండింగ్ బిల్లు ఎంత ఉందో దానిపై వడ్డీ వేస్తుంది. ఇప్పుడు ఆ వడ్డీని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది వరకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై నెలకు 3.5 శాతం వడ్డీ వేసేవారు. కానీ నవంబర్ 15 నుండి దీనిని 3.75కి పెంచారు.
Also read: బ్లాక్ ఫ్రైడే బంపర్ ఆఫర్లు.. డిస్కౌంట్లు చూస్తే మతిపోవాల్సిందే!
అంటే ఏడాదికి దాదాపు 45 శాతం పెంచేశారు. దీంతో పాటూ ఔట్ స్టాండింగ్ అమౌంట్ పై లేట్ చార్జీలు పెంచారు. ఔట్ స్టాండింగ్ అమౌంట్ మొత్తం రూ.100 కంటే తక్కువ ఉంటే ఎలాంటి చార్జీలు పడవు. కానీ వంద నుండి రూ.500 మధ్య ఉంటే లేట్ చార్జీల కింద రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రూ.500 నుండి రూ.1000 మధ్యన ఉంటే రూ.500 వడ్డీ చెల్లించాలి. ఒకవేళ రూ.1001 నుండి రూ.5000 మధ్యన ఉంటే రూ.600 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా రూ.5001 నుండి రూ.10000 మధ్యన ఉంటే రూ.750 వడ్డీ చెల్లించాలి.
రూ.10,001 నుండి రూ.25,000 మధ్యన లేటు చార్జీలు ఉంటే రూ.900 వడ్డీ పడుతుంది. పాటూ ఇంట్రెస్ట్ ఆన్ అడ్వాన్స్ క్యాష్ ఫీజును కూడా పెంచారు. ఎవరైనా ఏటీఎంకు వెళ్లి అవసరానికి డబ్బులు తీసుకుంటే ఇదివరకు 3.25 శాతం వడ్డీ ఉండేది. ఇప్పుడు దానిని 3.75 శాతానికి పెంచారు. అయితే క్రెడిట్ కార్డులతో నష్టాలతో పాటూ లాభాలు కూడా ఉంటాయి. కాబట్టి కార్డు అవసరం అనుకున్నవారు ఖచ్చితంగా క్రెడిట్ కార్డు తీసుకునేముందు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తరవాతనే తీసుకోవాలి.
వీసా కార్డు, మాస్టర్ కార్డు అని రకాలు కూడా ఉంటాయి. అందులో ఏ కార్డు తీసుకుంటే మంచింది. ఏ కార్డు తీసుకోవడం వల్ల లాభం జరుగుందని తెలుసుకోవాలి. వీటితో పాటూ బ్యాంకులలోనూ వడ్డీలు వేరు వేరుగా ఉంటాయి. కొన్ని బ్యాంకులు మెయింటెనెన్స్ ఫీజును వసూలు చేస్తే మరికొన్ని బ్యాంకులు ఎలాంటి ఫీజు లేకుండా కార్డులను జారీ చేస్తాయి. కాబట్టి క్రెడిట్ కార్డు తీసుకోవాలని అనుకునేవారు ఒకటి రెండు సార్లు ఆలోచించిన తరవాతనే ఏది బెస్ట్ అనేది నిర్ణయించుకోవాలి.