Apple home camera – Health Ipods : టెక్ దిగ్గజం యాపిల్ త్వరలోనే అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త గ్యాడ్జెట్స్ ను తీసుకురావటానికి సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ గ్యాడ్జెట్స్ షిప్మెంట్ కోసం తన పాత భాగస్వామ్య సంస్థ Goertekతో మళ్లీ వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ త్వరలోనే స్మార్ట్ హోమ్ కెమెరాను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. దీంతో పాటు AirPodsలో హెల్త్ ఫీచర్స్ ను తీసుకొచ్చేందుకు సైతం ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ స్మార్ట్ హోమ్ కెమెరా కోసమే ఆపిల్ కంపెనీ గోర్టెక్ తో భాగస్వామ్యం కలిగి ఉండనున్నట్లు తెలుస్తుంది. యాపిల్ – గోర్టెక్ కంపెనీలు గతంలో కలిసి పని చేసినప్పటికీ కొన్ని కారణాలతో విడిపోవాల్సి వచ్చింది. దీంతో Goertek అధిక స్థాయిలో యాపిల్ ఆర్డర్స్ ను సైతం కోల్పోయింది. అయితే ప్రస్తుతం ఈ రెండింటి మధ్య బంధం మళ్లీ బలపడినట్లు కనిపిస్తుంది. వీటి ఆధ్వర్యంలోనే త్వరలోనే ఈ కొత్త గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది.
Apple Smart Home Camera (యాపిల్ స్మార్ట్ హోమ్ కెమెరా) – యాపిల్ తీసుకొస్తున్న ఈ స్మార్ట్ హోమ్ కెమెరా అత్యాధునిక ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ తో పాటు సిరి ఇంటిగ్రేషన్ తో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ఐపి కెమెరా 2026 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Apple Health Feature AirPods (యాపిల్ హెల్త్ ట్రేకర్ ఐపాడ్స్)- యాపిల్ హెల్త్ ట్రేకర్ ఫీచర్స్ తో తీసుకొస్తున్న ఈ ఎయిర్ పాడ్స్ 2026లో మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. యాపిల్ కంపెనీ ఐఫోన్ 16 సిరీస్ తో పాటు తీసుకొచ్చిన స్మార్ట్ వాచ్ లో హెల్త్ ఫీచర్స్ ను జోడించిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ వాచెస్ లాంఛ్ అయ్యాక హాట్ కేక్స్ లా అమ్ముడయిపోయాయి. కొత్త స్పోర్ట్ లూప్‌తో ఈ స్మార్ట్ వాచ్‌లో వర్కౌట్ యాప్ తో పాటు వర్కౌట్‌ల కోసం అధునాతన మెట్రిక్స్ సైతం యాపిల్ జోడించింది. ఇందులో రన్నింగ్ స్ట్రైడ్ లెంగ్త్, గ్రౌండ్ కాంటాక్ట్ టైమ్, హార్ట్ రేట్ జోన్స్, రన్నింగ్ పవర్, ఎలివేషన్స్ ఉన్నాయి.
Goertekతో భాగస్వామ్యం – యాపిల్ తన వార్షిక షిప్మెంట్ దాదాపు పది మిలియన్ల వరకు ఉంటుందని భావిస్తుంది. దీంతో గతంలో యాపిల్ కు ప్రత్యేక సరఫరాదారుడిగా ఉన్న గోర్టెక్ తో మరోసారి భాగస్వామ్యాన్ని కలిగి ఉండనుంది. యాపిల్ కంపెనీ వచ్చే ఏడాది ఐఫోన్ 17 సిరీస్ తో పాటు ఐఫోన్ ఎస్ఈ మెుబైల్స్ ను తీసుకురానుంది. వీటితో పాటు లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ను సైతం తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఇక మార్కెట్ అంచనాల ప్రకారం.. 2023లో 48 మిలియన్ యూనిట్లు ఉన్న యాపిల్ గ్యాడ్జెట్స్ సరఫరా 2026 నాటికి 68 మిలియన్లకు వృద్ధి చెందే అవకాశం ఉందని ఆ సంస్థ భాగస్వాములు అంచనా వేస్తున్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్ ను మరింత విసృతం చేసే పనిలో పడిన యాపిల్ తన పాత భాగస్వామి Goertekను రంగంలోకి దింపనుంది.
ALSO READ : రూ.53వేల స్మార్ట్ ఫోన్ – రూ.20వేలకే.. కళ్లు చెదిరే బంపర్ ఆఫర్!