Flipkart Google Pixel 8a Mobile Offers : హై ఎండ్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా మీ జేబులో డబ్బులను ఎక్కువగా ఖర్చు పెట్టుకుండానే? అతి తక్కువ ధరకే. అయితే రూ.53 వేల ధరతో మార్కెట్లోకి దిగిన స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఏకంగా రూ.20 వేలకే అందుబాటులోకి వచ్చింది. కాబట్టి మీరు ఈ ఫోన్‌ను దక్కించుకోవడానికి ఇదే సరైన సమయం.
ఆ స్మార్ట్ ఫోన్ ఏంటంటే? – టెక్ ప్రియులు ఆసక్తిగా కొనుగోలు చేసే స్మార్ట్ ఫోన్లలో గూగుల్ పిక్సెల్ 8ఏ ఒకటి. ఎందుకంటే ఈ ఫోన్ మంచి రివ్యూస్‌ను అందుకుంది. ఇది గూగుల్ టెన్సార్ జీ3 ప్రాసెసర్‌తో నడుస్తుంది. పిక్సెల్ 8, పిక్సెల్ 8ప్రో తరహాలోనే జెమిని, బెస్ట్ టేక్, ఆడియో మ్యాజిక్ ఎరేజర్ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోనే రూ.20 వేలకు అందుబాటులోకి వచ్చింది.
ఎక్కడ కొనుగోలు చేయాలంటే? – ప్రముఖ ఇ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ అతి తక్కువ ధరలకే, డిస్కౌంట్ ప్రైజ్‌లకు గ్యాడ్జెట్స్‌ను అందిస్తుంటుంది. అలా ఇప్పుడు ఈ Google Pixel 8aపై కూడా అదిరే డిస్కౌంట్ ప్రైజ్‌తో అందిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్, ఎక్సేంజ్ ఆఫర్‌ను కూడా ఇస్తోంది.
ఎలా కొనుగోలు చేయాలంటే? – ఈ Google Pixel 8a భారత మార్కెట్లో లాంఛ్ అయినప్పుడు దీని ధర రూ.52,999. అయితే ఫ్లిప్ కార్ట్ దీనిని రూ.43,999కి అందుబాటులో ఉంచింది. అదే దీన్ని ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.2 వేల డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇదే సమయంలో మీ పాత ఫోన్‌ను ఎక్సేంజ్ చేస్తే రూ.21,799 వరకు ఇస్తోంది. కాబట్టి మీరు దీంతో ఈ పిక్సల్ 8aను రూ.20,200కే కొనుగోలు చేయొచ్చు అన్న మాట.
Google Pixel 8a ఫీచర్స్ ఇవే – ఏఐ ఆధారిత ఫొటో వీడియో ఎడిటింగ్ టూల్స్ ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి. వీడియోలు రికార్డ్ చేసేటప్పుడు అనవసర శబ్దాలను తొలగించేలా ఆడియో మ్యాజిక్ ఎరేజర్ కూడా ఉంది. ఇంకా బెస్ట్ టేక్, మ్యాజిక్ ఎరెజర్, నైట్ సైట్, ఫొటో అన్‌బ్లర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 8x వరకు జూమ్ కూడా చేయొచ్చు. ఇంకా సర్కిల్ టు సెర్స్, ఏఐ పవర్డ్ పిక్సల్ కాల్ అసిస్ట్ ఫీచర్స్, ఆడియో, ఎమోజీతో పాటు ఇంకా చాలానే ఫీచర్సను గూగుల్ అందించింది.
120Hz రీఫ్రెష్ రేటు, 2,000nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.1 అంగుళాల తెరను ఈ స్మార్ట్ ఫోన్లో పొందు పర్చారు. గూగుల్ టెన్సార్ జీ3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
ఫొటోల కోసం డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వెనక భాగంలో 64 MP ప్రధాన లెన్స్‌తో పాటు 13 MP అల్ట్రావైడ్ లెన్స్‌ను అమర్చారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13 MP కెమెరాను ఇచ్చారు.
ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కూడా ఇచ్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,404mAh బ్యాటరీని అందించారు. 8జీబీ ర్యామ్‌తో పాటు 128జీబీ/256జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఏడేళ్ల పాటు ఓఎస్, సెక్యూరిటీ, ఫీచర్ డ్రాప్ అప్‌డేట్లు ఇచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ALSO READ : గూగుల్ లో ఈ 6 పదాలు టైప్ చేస్తే.. ప్రమాదంలో పడినట్టే!