Indian Train Horns: రైలు వస్తున్నప్పుడు సాధారణంగా కూత వేస్తుంది. రైలు పట్టాల మీద ఎవరైనా ఉన్నా? రైల్వే గేట్ల దగ్గర పక్కకు జరగాలి అనే ఉద్దేశంతో లోకో పైలెట్ హారన్ కొడతారు. రైల్వే స్టేషన్ లోకి అడుగు పెట్టే సమయంలో ప్రయాణీకులను అలర్ట్ చేసేందుకు కూడా హారన్ ఇస్తాడు. మనం రైలు కూత గురించి సరిగ్గా పట్టించుకోం. కానీ, చాలా రకాలుగా ఉంటాయి. ఆయా సందర్భాన్ని బట్టి రైలు కూత పెడుతుంది. ఇంతకీ రైలు కూతల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? వాటి వెనుకున్న కథ ఏంటిది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రైలు ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్యస్థానికి చేరుకోవాలంటే, రైల్వే లోని అన్ని వ్యవస్ధలు సక్రమంగా కోఆర్డినేషన్ తో పని చేయాలి. రైలు నడిపే లోకో పైలెట్ నుంచి మొదలుకొని రైల్వే గార్డుల వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలి. రైళ్లకు సంబంధించిన విషయాలను లోకో పైలెట్లు, స్టేషన్ సిబ్బందితో వైర్ లెస్ సెట్ల ద్వారా పంచుకుంటారు. అన్ని విషయాలను పంచుకోవడం సాధ్యం కాదు. అందుకే హారన్ ద్వారా తాము చెప్పాలనుకున్న విషయాన్ని రైల్వే సిబ్బందికి తెలియజేస్తారు. ఒక్కో రైలు కూత ఒక్కో విషయాన్ని సూచిస్తుంది.
రైలు కూతల్లో రకాలు
రైలు కూతల్లో రకాలు
⦿ ఒక చిన్న కూత: రైలు ఒకేసారి చిన్న హారన్ కొడితే రైలును శుభ్రం చేసేందుకు యార్డుకు తీసుకెళ్తున్నట్లు అర్థం.
⦿ రెండు చిన్న కూతలు: రైలును ముందుకు నడిపేందుకు గార్డును సిగ్నల్ కోసం రిక్వెస్ట్ చేసేందుకు చిన్నగా రెండుసార్లు హారన్ కొడతారు.
⦿ మూడు చిన్న కూతలు: ఈ హారన్ ను చాలా అరుదుగా వాడుతారు. రైలు ఇంజిన్ కంట్రోల్ తప్పినప్పుడు వెంటనే వ్యాక్యుమ్ బ్రేక్ వేయాలని గార్డుకు పంపించే సూచనగా మూడుసార్లు చిన్నగా హారన్ కొడతారు.
⦿నాలుగు చిన్న కూతలు: రైలులో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి, ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేనప్పుడు ఈ రకమైన హారన్ కొండతారు.
⦿ఒక పెద్ద కూత, ఒక చిన్న కూత: ఇంజిన్ ను స్టార్ట్ చేయడానికి ముందు బ్రేక్ పైప్ లైన్ సిస్టమ్ రెడీగా ఉందని గార్డుకు చెప్పేందుకు ఒక పెద్ద కూత, ఒక చిన్న కూత పెట్టిస్తారు.
⦿ రెండు పెద్ద కూతలు, రెండు చిన్న కూతలు: ఇంజిన్ ను కంట్రోల్ లోకి తీసుకోవాలని గార్డుకు చెప్పేందుకు రెండు పెద్ద హారన్లు, రెండు చిన్న హారన్లు కొడతారు.
⦿ఆగకుండా కూతవేయడం: రైలు స్టేషన్ లో ఆగకుండా వేగంగా ముందుకు వెళ్తుందని ప్రయాణీకులకు చెప్పేందుకు ఇలాంటి హారన్ వేస్తారు.
⦿ రెండు సార్లు ఆగి ఆగి కూతలు: రైల్వే క్రాసింగ్ మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు రెండు సార్లు ఆగి ఆగి హారన్ కొడతారు.
⦿ రెండు లాంగ్ హారన్స్: రైలు ట్రాక్ మారుతోందని చెప్పేందుకు రెండు సార్లు లాంగ్ హార్న్ కొడతారు.
⦿ రెండు చిన్న కూతలు, ఒక పెద్ద కూత: ప్రయాణీకులలో ఎవరైనా చైన్ లాగినా లేదంటే గార్డ్ వాక్యూమ్ బ్రేక్ వేసినా రెండు చిన్న, ఒక పెద్ద హారన్ మోగిస్తారు.
⦿ ఆరుసార్లు, చిన్నకూతలు: రైలు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆరు సార్లు చిన్నగా హారన్ కొడతారు.
Read Also: తత్కాల్ బుకింగ్ టైమ్ లో IRCTC పోర్టల్ హ్యాంగ్, కావాలనే చేస్తున్నారా?