Apple TV+ : యాపిల్ టీవీ ప్లస్ గురించి చాలా మంది ఓటీటీ ప్రియులకు తెలిసే ఉంటుంది. ఓటీటీ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో బెస్ట్ ఒరిజినల్ షోస్‌తో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు యాపిల్ ఓటీటీ యూజర్స్ కోసం ఓ కొత్త ఎగ్జైటింగ్ న్యూస్‌తో ముందుకొచ్చింది. ఇకపై యాపిల్ టీపీ ప్లస్ సిరీస్ వినియోగించని వాళ్లు కూడా దీనిని ఉపయోగించేలా నిర్ణయం తీసుకుంది. ఈ వీకెండ్లో ఫ్రీ యాపిల్ టీపీ ప్లస్ యాక్సెస్‌ను యూజర్స్‌కు అందించనుంది.
ప్రముఖ స్మార్ట్ గ్యాడ్జెట్ తయారీ సంస్థ యాపిల్.. ఓటీటీ యూజర్స్ కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. యాపిల్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకుండా, సబ్స్క్రిప్షన్ ఫీజ్ లేకుండా ఉచితంగా స్ట్రీమింగ్ వెసులుబాటును కల్పించింది. దీంతో ఓటీటీ వ్యూయర్స్ అందరూ.. గేమింగ్ కంసోల్స్తో పాటు యాపిల్ డివైసెస్, స్మార్ట్ టీవీస్ పాటు ఏ డివైస్‌లోనైనా యాపిల్ ప్లస్ షోస్ ను ఫ్రీగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా టాప్ టైర్ మార్కెట్ కలిగిన దేశాలతో పాటు 100కుపైగా దేశాల్లోని యూజర్స్‌కు ఈ ఫ్రీ ఆఫర్‌ను మాల్టిపుల్ డివైసెస్‌లో అందుబాటులో ఉంచింది.
అలానే కొత్త యాపిల్ డివైస్ కొనుగోలు చేసిన యాజర్స్‌కు యాపిల్ టీవీ ప్లస్ స్టాండర్డ్ మూడు నెలల ఫ్రీ ట్రయల్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఇంకా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని ఆసక్తిగా ఉన్నవారి కోసం ఏడు రోజుల ఫ్రీ ట్రయల్ కూడా ఇస్తోంది.
ఇతర OTTలతో పోటీ పడుతున్న Apple TV+ –
Apple TV Plus నెమ్మదిగా ప్రతీ ఇంటినీ చేరే ప్రయత్నం చేస్తుంది. ఇక తాజా గణాంకాల ప్రకారం, Apple TV Plusకి దాదాపు 25 మిలియన్ల చెల్లింపు చందాదారులు ఉన్నారు. మరోవైపు, నెట్‌ఫ్లిక్స్ కు ప్రపంచవ్యాప్తంగా 282.7 మిలియన్ల చెల్లింపు చందాదారులు ఉండగా.. ఒక్క భారత్ లోనే దాదాపు 12 మిలియన్లను పైగా చందాదారులు ఉన్నారు. ఇక భారత్ లో Apple TV సబ్‌స్క్రిప్షన్ ధర దాదాపు తక్కువగానే ఉండటంతో ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందిస్తున్న సబ్స్క్రిప్షన్ ప్లాన్ కంటే తక్కువగా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. దీంతో Apple TV+ యూజర్స్ ను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ప్లాన్ ధరలతో పాటు ప్లాట్ఫామ్ అందించే అపరిమిత కంటెంట్ సైతం యూజర్స్ ను ఎక్కువగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో యాపిల్ టీవీ సరికొత్త ప్రయోగంతో ముందుకు రానున్నట్టే తెలుస్తోంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా తన హవా కొనసాగించాలని ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఈ టెక్ దిగ్గజం ఇప్పటికే అధునాతన ఫీచర్స్ తో లేటెస్ట్ గాడ్జెట్స్ ను సైతం అందుబాటులోకి తీసుకువచ్చేస్తుంది. ఈ ఏడాది యాపిల్ కొత్త మొబైల్ సిరీస్ తో పాటు మరిన్ని గ్యాడ్జెట్స్ ను అందుబాటులోకి తెచ్చేస్తుంది. వీటితో పాటు యాపిల్ టీవీస్ లో ఉచిత యాక్సిస్ ను సైతం తీసుకొస్తుంది. ఏది ఏమైనా యాపిల్ తన హవా మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తుందనే చెప్పవచ్చు.
ALSO READ : వామ్మో.. బెంబేలెత్తిస్తున్న కొత్త స్కామ్! స్నేహితులే శత్రువులు.. నమ్మకమే ఆయుధంగా నేరాలు