YCP vs TDP: తొడకొట్టండి.. మెడ కూడ కొట్టండి.. అలాగే జడలు పట్టుకోండి కానీ ఆ పథకాలు ఏవి? వాటి గురించి మాట్లాడకుండ, ఎన్ని సార్లు తొడగొట్టినా తొడలు నొప్పి తీస్తాయని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండ కాలయాపన చేస్తుందని, వైసీపీ విమర్శల జోరు పెంచింది. రోజూ ఎవరో ఒకరు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, కూటమి లక్ష్యంగా విమర్శలు సాగిస్తున్నారు. శుక్రవారం మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ సీరియస్ కామెంట్స్ చేశారు.
వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. సంక్షేమాన్ని కేలెండర్ మాదిరిగా అందించి దేశానికే వైయస్ జగన్ ఆదర్శంగా నిలిచారన్నారు. జగన్ చేసిన అభివృద్దిపై కూటమి అసత్యాలు ప్రచారం చేసిందని తెలిపారు. రాష్ట్రం అప్పులపాలైంది, శ్రీలంక అయింది, సోమాలియా అయిపోయిందని పదే పదే అబద్ధాలు చెప్పారని తెలిపారు. సంక్షేమం కోసం గత పాలకుడు అప్పు చేస్తే తప్పన్నారు. ఇవాళ సంక్షేమం ఇవ్వకుండానే అప్పులు చేయడం తప్పు కాదా అంటూ మాజీ మంత్రి ప్రశ్నించారు. నారా చంద్రబాబు నాయుడు మాటలన్నీ అంతా మోసమని, పాలన కూడ మోసమని విమర్శలు గుప్పించారు.
నారా చంద్రబాబు నాయుడు మాటలకు భావాలే వేరని, సత్యమేవ జయతే అని చెప్పుకుంటామని, కానీ ఈ ఎన్నికల్లో అబద్ధాన్ని గెలిపించి ప్రజలు ఓడిపోయారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండ, ప్రజలు తమను ఐదేళ్ల పాటు ఏమీ చేయలేరన్న అతి విశ్వాసంతో విర్రవీగుతున్న అధికార కూటమిని వైసీపీ ప్రశ్నించడం ఖాయమన్నారు. అచ్చెంనాయుడు తొడగొట్టినా.. మెడకొట్టినా..
జడపట్టినా.. పథకాలు అమలు చేయాలి కదా అంటూ నేరుగా అచ్చెంనాయుడును ఉద్దేశించి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అనడానికి ప్రజలే సాక్ష్యమన్నారు.
Also Read: YS Jagan @ 11: జగన్ ను వదలని 11 సెగ.. మరీ ఇంత ప్రచారమా!
అయితే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం పథకం 2.o, రహదారుల అభివృద్ది, మెగా డీఎస్సీ, ఇంటర్ విద్యార్థులకు మద్యాహ్న భోజనం, రైతన్నలకు పెట్టుబడి సాయం, అలయాలకు సాయం, ఇతరత్ర అంశాలను మరిచారా అంటూ టీడీపీ నేతలు రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. వైసీపీ పాలన అంతా అవినీతిమయంగా సాగిందని, అందుకే ప్రజలు తగిన బుద్ది చెప్పినట్లు టీడీపీ విమర్శిస్తోంది.