Daaku Maharaj Business.. నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) స్వర్గీయ నటులు తారకరామారావు (Sr.NTR) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదట తన తండ్రి దర్శకత్వం వహించి నటించిన చిత్రాలలో యువ నటుడిగా ప్రేక్షకులను అలరించిన బాలకృష్ణ, ఆ తర్వాత హీరోగా మారి సత్తా చాటారు. ఎక్కువగా యాక్షన్ మాస్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలకృష్ణ, మాస్ హీరోగా పేరు దక్కించుకున్నారు. ఎక్కువగా రాయలసీమ ప్రాంతాన్ని బేస్ చేసుకుని ఎన్నో చిత్రాలు చేసిన బాలకృష్ణ, ఇప్పుడు కూడా అలాంటి సినిమాలతోనే ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకపక్క ఫ్యామిలీ ఓరియెంటెడ్ అలాగే మాస్ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలకృష్ణ.
ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్, టీజర్..
ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’ జనవరి 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్, టీజర్ ఆసక్తిని పెంచాయి. దీనికి తోడు “ది రేజ్ ఆఫ్ డాకు” పేరుతో విడుదలైన మొదటి పాట కూడా సినిమాపై అంచనాలు పెంచింది. అలాగే రెండవ పాట “చిన్ని చిన్ని” అంటూ సాగే ఎమోషనల్ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకి, తమన్ సంగీతాన్ని సమకూర్చారు.
“దబిడి దిబిడి” తో విమర్శలు..
ఇదంతా బాగానే ఉన్నా మూడవ పాట “దబిడి దిబిడి” మాత్రం విమర్శలను ఎదుర్కొంటోంది. ఇందులో బాలకృష్ణ ప్రముఖ బ్యూటీ ఊర్వశి డాన్స్ స్పీడ్ కి మ్యాచ్ చేయలేకపోవడం కారణం. అలాగే ఈ పాటను కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్. ఇక బాలకృష్ణ 109వ చిత్రం గా వస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధ శ్రీనాథ్(Shraddha shrinath)హీరోయిన్లుగా నటిస్తుండగా, చాందిని చౌదరి, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈ సినిమా బిజినెస్ లెక్కలు కూడా వైరల్ గా మారడం గమనార్హం.
డాకు మహారాజ్ బిజినెస్ లెక్కలు..
ఇక ఈ సినిమా బిజినెస్ లెక్కల విషయానికే వస్తే నైజాం ఏరియాలో రూ.18 కోట్లకు ఈ సినిమా హక్కులను నిర్మాత పంపిణీదారుడు దిల్ రాజు కొనుగోలు చేశారు. అలాగే ఏపీలో సీడెడ్ మినహా రూ.40 కోట్లకు అమ్ముడు పోయాయి. ఇక సీడెడ్ రూ.16 కోట్లు, ఓవర్సీస్ లో రూ .4కోట్లు మిగతా రాష్ట్రాలలో ఒక కోటి కి ఈ సినిమా హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. భారీ టార్గెట్ తో రంగంలోకి దిగబోతున్నారు. మరొకవైపు ఈ సినిమాకి ఇన్సైడ్ యావరేజ్ టాక్ వినిపిస్తోంది. మరి ఇన్ని అవాంతరాల మధ్య ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.