BigTV English

Pig Butchering Scam : వామ్మో.. బెంబేలెత్తిస్తున్న కొత్త స్కామ్! స్నేహితులే శత్రువులు.. నమ్మకమే ఆయుధంగా నేరాలు

Pig Butchering Scam : వామ్మో.. బెంబేలెత్తిస్తున్న కొత్త స్కామ్! స్నేహితులే శత్రువులు.. నమ్మకమే ఆయుధంగా నేరాలు

Pig Butchering Scam : గృహిణులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, పేదలను లక్ష్యంగా చేసుకుని ఓ స్కామ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌ లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ స్కామ్‌గా దీన్ని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇటువంటి సైబర్‌ మోసాలు భారీ స్థాయిలో పెరిగాయని తాజాగా కేంద్ర హోం శాఖ ఓ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్​ ద్వారా ప్రజలు భారీ స్థాయిలో నష్టపోతున్నారని వెల్లడించింది. ఈ సైబర్ మోసాల కోసం సైబర్‌ నేరగాళ్లు సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​ను అత్యధికంగా వినియోగించుకుంటున్నారని పేర్కొంది.


పిగ్‌ బుచరింగ్‌ స్కామ్‌ అంటే ఏమిటి? –

ఈ పిగ్ బుచరింగ్ స్కామ్​లో సైబర్‌ నేరగాళ్లు, తేలికగా మోసపోయే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, వారితో లాంగ్ టెర్మ్​ రిలేషన్​షిప్​ను మెయిన్​టెయిన్ చేస్తుంటారు. వాట్సాప్​, ఫేస్​బుక్​, డేటింగ్ సైట్స్​, మెసేజింగ్ యాప్స్​ , ఈమెయిల్స్​ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్ ద్వారా​ వారితో ఎమోషనల్​గా, అలానే ఫైనాన్షియల్​గా బంధాన్ని ఏర్పరచుకుంటారు. అలా ఫ్రెండ్లీ స్ట్రేంజర్స్​గా, రొమాంటిక్ పార్ట్నర్స్​గా, ఫైనాన్షియల్​ అడ్వైసర్స్​గా పర్సనల్​ కనెక్షన్​ ఏర్పరచుకుంటారు.​ ముఖ్యంగా వారితో ఈ సైబర్ నేరగాళ్లు విశ్వాసం కలిగించేలా మాట్లాడుతుంటారు.


ఈ క్రమంలోనే స్టాక్స్​, క్రిప్టో కరెన్సీలో లేదా మరో లాభదాయకమైన పథకం అంటూ ఫేక్​ ఇన్​వెస్ట్​మెంట్​లో పెట్టుబడి పెట్టేలా ఒప్పించి చివరకు ఆ మొత్తాన్ని తస్కరించడం ఈ సైబర్ నేరగాళ్ల లక్ష్యం. ముందుగా జీరో రిస్క్​ అంటూ, వినియోగదారుల నుంచి చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించి, వారికి ఎక్కువ లాభం వచ్చేలా నమ్మబలికిస్తారు. దీనిని నమ్మిన వినియోగదారులు, డబ్బుకు ఆశపడి, ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడతారు. దీనిని అదునుగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు, సమయం చూసి ఆ మొత్తాన్ని దోచేస్తారు. దీనినే పిగ్‌ బుచరింగ్‌ లేదా ఇన్​వెస్ట్​మెంట్​ స్కామ్​ అని అంటారు.

ALSO READ : రూ.6999కే మోటో కొత్త మెుబైల్.. కిర్రాక్ ఫీచర్స్ తో జనవరి 7న లాంఛ్

పందులను చంపే ముందు, కసాయి వాడు వాటికి మంచి ఆహారం ఎలా అయితే అందిస్తాడో, ఇన్​వెస్ట్​మెంట్​ స్కామర్స్​ కూడా అలానే వినియోగదారులకు వల వేస్తారు. అందుకే ఈ పిగ్​ బుచరింగ్​ అనే పదం బాగా వెలుగులోకి వచ్చింది. 2016లో తొలిసారిగా చైనాలో ఇలాంటి స్కామ్​లు మొదలైనట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి మోసాలు భారీగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా, భారత్‌లో సైబర్‌ నేరగాళ్లు వాట్సప్‌ను ఉపయోగించి భారీ స్థాయిలో ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లు నివేదికలు తెలిపాయి. రుణాలను కూడా ఇస్తామంటూ ఫేస్‌బుక్‌ వంటి ప్లాట్​ఫామ్స్​ ద్వారా లింకులను వ్యాప్తి చేస్తున్నారని వెల్లడించాయి.

ఎలా జాగ్రత్తగా ఉండాలంటే? –

కాబట్టి ఇటువంటి పిగ్​ బుచరింగ్ స్కామ్స్​ నుంచి అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో స్ట్రేంజర్స్​తో కనెక్షన్స్​ మెయిన్​టెయిన్​ చేయకపోవడమే ఉత్తమం. ఒకవేళ వారితో పర్సనల్ కనెక్షన్స్ ఉంటే, వాటి నుంచి బయట పడటమే మంచిది. వారితో కనెక్షన్ మెయిన్​టెయిన్ చేసినా, గుడ్డిగా నమ్మకూడదు. వారు చెప్పిన విషయాల్లో ఇన్వెస్ట్​మెంట్​లు చేయకూడదు. ఏ కొంచెం అనుమానంగా అనిపించినా ఫిర్యాదు చేయడం మంచిది.

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×