E-Paper
Advertisement

Gadgets Display:- గ్యాడ్జెట్స్ డిస్‌ప్లే విషయంలో యాపిల్ సరికొత్త ఆలోచన..

Gadgets Display:- గ్యాడ్జెట్స్ డిస్‌ప్లే విషయంలో యాపిల్ సరికొత్త ఆలోచన..
Advertisement

Gadgets Display:- మార్కెట్లో ఎన్ని రకాల గ్యాడ్జెట్స్ ఉన్నా.. కొన్ని బ్రాండ్స్ మాత్రం ఎప్పటికప్పుడు పోటీని తట్టుకుంటూ, కస్టమర్లను ఆకట్టుకుంటూ బెస్ట్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంటాయి. ప్రస్తుతం ఉన్న బ్రాండ్స్‌లో అలాంటిది ఏదీ అంటే.. చాలామంది యాపిల్ అనే సమాధానమే చెప్తారు. ఎన్నో స్మార్ట్ ఫోన్స్ ఉన్నా కూడా యాపిల్ రిలీజ్ చేసే అప్డేటెడ్ వర్షన్స్ కోసమే చాలామంది ఎదురుచూస్తుంటారు. అందుకే అలాంటి వారికోసం డిస్‌ప్లే విషయంలో యాపిల్ ఒక నిర్ణయానికి వచ్చింది.

Advertisement

తాజాగా విడుదలయిన యాపిల్ అప్డేటెడ్ వర్షన్ ఫోన్ కొత్త రకమైన డిస్‌ప్లేను అందిస్తుంది అన్నది తెలిసిన విషయమే. అలా కాకుండా యాపిల్ గ్యాడ్జెట్స్ అన్నింటిని మైక్రోఎల్ఈడీ ప్యానెల్స్‌తో అందించాలని యాజమాన్యం నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2025 లోపు ఈ డిస్‌ప్లే యుజర్లకు అందించాలని యాపిల్ టార్గెట్‌గా పెట్టుకుంది. ముందుగా సెకండ్ జెనరేషన్ యాపిల్ వాచ్‌లతో ఈ మైక్రోఎల్ఈడీ ప్యానెల్స్ మార్కెట్లోకి లాంచ్ అవ్వనున్నాయి.

ప్రస్తుతం యాపిల్ గ్యాడ్జెట్స్ అన్నీ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇది మైక్రోఎల్ఈడీ మోడ్‌లోకి మారనుంది. ఇది యాపిల్‌కు కొత్త ఊపునిస్తుందని కస్టమర్లు భావిస్తున్నారు. ముందుగా సెకండ్ జెనరేషన్ యాపిల్ వాచ్‌తో ఈ డిస్‌ప్లే లాంచ్ అయినా కూడా ఐఫోన్స్, ఐప్యాడ్స్ వల్లే ఈ డిస్‌ప్లేకు గుర్తింపు లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 చివరి నుండి 2025 మొదటి వరకు ఓఎల్ఈడీని మైక్రోఎల్ఈడీగా మార్చే పనులు జరుగుతాయని, 2025 వరకు ఎట్టి పరిస్థితుల్లో దీని లాంచ్ జరుగుతుందని యాజమాన్యం చెప్తోంది.

Advertisement

ముందుగా సెకండ్ జెనరేషన్ యాపిల్ వాచ్‌లను మైక్రోఎల్ఈడీ డిస్‌ప్లేతో మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత.. దాని రివ్యూను బట్టి ఐఫోన్స్, ఐప్యాడ్స్‌కు కూడా ఈ డిస్‌ప్లేను అటాచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయం.. ఇతర గ్యాడ్జెట్ల మార్కెట్‌కు నష్టం కలిగించేలా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సామ్‌సంగ్, ఎల్జీ లాంటి కంపెనీలు కచ్చితంగా దీని వల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి అన్ని కంపెనీలను దాటి యాపిల్ మైక్రోఎల్ఈడీ డిస్‌ప్లే కస్టమర్లను ఎంతవరకు ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.

Related News

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

రూ.7,490కే కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్..బడ్జెట్‌ నంబర్ 1 మోడల్

రూ.1,699కే ఫైర్‌బోల్ట్ గ్లిట్జ్ స్మార్ట్‌వాచ్.. లుక్ అదిరిపోయిందిగా!

వావ్ అనిపించే ఫీచర్లతో Pixel Watch 5 Stephen Curry Edition సేల్ షురూ.. ధర ఎంతంటే?

రూ.2400కే ఓవెన్ అంటే.. ఎవరైనా వదులుతారా ?

ఊహించనంత తక్కువ ధరకే.. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ !

ఉచితంగా ఇంగ్లీష్ నేర్చుకునే సువర్ణావకాశం.. Airtel కస్టమర్లకు మాత్రమే ఈ ఛాన్స్!

సాధారణ ఇయర్‌బడ్స్‌కు గుడ్‌బై చెప్పండి.. ట్రెండీ లుక్‌‌తో అదరగొడుతున్న మోడల్

Big Stories

Advertisement
×