BigTV English

Autoimmune Diseases:- ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అలాంటి ఆరోగ్య సమస్యలు..

Autoimmune Diseases:- ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అలాంటి ఆరోగ్య సమస్యలు..


Autoimmune Diseases:- రోజుకొక కొత్త సమస్య మెడికల్ రంగంలో బయపడుతూ ప్రజలను కలవరపెడుతోంది. కొన్ని వ్యాధులు అయితే బయటపడకుండానే మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ప్రస్తుతం క్యాన్సర్ లాంటి వ్యాధులను అదుపు చేయాలని శాస్త్రవేత్తలు ఎంతగా ప్రయత్నించినా వారి ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అవ్వడం లేదు. దీంతో పాటు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందిని ఎఫెక్ట్ చేస్తున్న ఆరోగ్య సమస్యల గురించి కూడా శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

ఆటోఇమ్యూన్ వ్యాధులు.. ఇవి మనిషి శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ బలహీనపడినప్పుడు అది సెల్స్‌పై తీవ్ర ప్రభావం చూపించి.. పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటివరకు ఈ వ్యాధులకు అసలు కారణలేమిటో పూర్తిస్థాయిలో శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. అయితే చుట్టూ వాతావరణ, సీజనల్ వ్యాధులు, ప్రాంతాలలో తేడాలు.. ఇలాంటివి ఆటోఇమ్యూన్ వ్యాధులకు దారితీస్తాయని వారి తాజా పరిశోధనల్లో తేలింది. ఇన్ఫెక్షన్స్‌ను ఎదిరించలేని విధంగా ఇమ్యూన్ సిస్టమ్ బలహీనప్పుడు ఈ వ్యాధులు వస్తాయని వారు తెలిపారు.


ఆటోఇమ్యూన్ వ్యాధులు దాదాపు 80 రకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందులో కీళ్లనొప్పులు, టైప్ 1 డయాబెటీస్ లాంటివి కూడా ఉంటాయి. గత కొన్ని దశాబ్దాలుగా టైప్ 1 డయాబెటీస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ వస్తున్నాయని వారు గమనించారు. అయితే మొత్తంగా ఆటోఇమ్యూన్ వ్యాధులకు గురవుతున్నవారి సంఖ్య పెరుగుతుందా లేదా కేవలం టైప్ 1 డయోబెటీస్ కేసులు మాత్రమే పెరుగుతున్నాయా అన్నది తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.

ఇప్పటికీ ఆటోఇమ్యూన్ వ్యాధులకు కారణమవుతున్న కచ్చితమైన కారణాలు తెలియలేదు. కొన్నిసార్లు జెనటిక్ లోపాల వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వ్యాధులు ఎన్నో రకాలుగా ఉండడం వల్ల అన్నింటిని కలిపి పరిశోధించడం కష్టంగా మారిందని వారు బయటపెట్టారు. ఇప్పటికీ ఆటోఇమ్యూన్ వ్యాధుల గురించి వారికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని, త్వరలోనే వాటికి సమాధానం కనిపెడతామని చెప్తున్నారు. అంతే కాకుండా ఆటోఇమ్యూన్ వ్యాధులకు దూరంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవడం మంచిదని సూచించారు.

Tags

Related News

Talking In Sleep: నిద్రలో మాట్లాడ్డం ఓ లోపమా? షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు!

Vivo Y400 5G vs Vivo V60 5G: కొత్తగా లాంచ్ అయిన రెండు వివో ఫోన్లు.. విన్నర్ ఎవరంటే?

Pills Under Tongue: మాత్రను మింగకుండా.. నాలుక కింద పెట్టుకోవాలా? అలా చేస్తే ఏమవుతుందంటే?

Tecno Phantom V Fold 2 5G: సూపర్ ఆఫర్ గురూ.. 12GB ర్యామ్ గల ఫోల్డెబుల్ ఫోన్‌పై రూ.47000 డిస్కౌంట్..

Apple MacBook: కేవలం రూ.52000కే ఆపిల్ ల్యాప్ టాప్.. కొత్త మ్యాక్‌బుక్ త్వరలోనే లాంచ్

Moon Dust Bricks: చంద్రుడిపై ఇల్లు కట్టేందుకు ఇటుకలు సిద్ధం.. ‘మూన్ డస్ట్ బ్రిక్స్’ మెషిన్ సిద్ధం చేసిన చైనా సైంటిస్ట్

Big Stories

×