BigTV English

Boat : అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి..

Boat : అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి..


Boat : నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తుండగా పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరొకరు గల్లంతయ్యారు.

పడవ జలాశయంలోకి వెళ్లిన సమయంలో మొత్తం 12 మంది పర్యాటకులున్నారు. ఒక్కసారిగా నీరు లోపలికి రావడంతో పడవ బోల్తా పడిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. 11 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.


ఆశాబీ అనే మహిళ ఒడ్డుకు చేరిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురిని బనగానపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నూర్జహాన్‌ అనే మహిళ మృతిచెందారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఏడాదిలోపు వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన యువతిని షాజీదాగా గుర్తించారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×