BigTV English
Advertisement

Artificial Rains : కృత్రిమ వర్షాలు సక్సెస్.. గంటకు రూ.5 లక్షలు ఖర్చు..

Artificial Rains : కృత్రిమ వర్షాలు సక్సెస్.. గంటకు రూ.5 లక్షలు ఖర్చు..
Artificial Rains


Artificial Rains(cloud seeding) : కృత్రిమంగా తయారు చేసే వస్తువులకు, నేచురల్‌గా ఏర్పడుతున్న వస్తువులకు ఈరోజుల్లో పెద్దగా తేడా ఉండడం లేదు. పైగా అసలు ఇలాంటివి కృత్రిమంగా తయారు చేయవచ్చా అని ఆశ్చర్యపోయే విధంగా అందరినీ తమ పరిశోధనలతో ఆశ్చర్యపరుస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా మబ్బులను, దాని వల్ల వస్తున్న వర్షాన్ని కూడా సక్సెస్‌ఫుల్‌గా కృత్రిమంగా తయారు చేసి చూపిచ్చారు. ఈ ప్రయోగం ఇండియాలోకి కూడా వచ్చేసింది.

భూగ్రహం అనేది రోజురోజుకీ వేడిగా మారుతుంది అన్నది తెలిసిన విషయమే. అందుకే ఈ వేడిని తగ్గించడం కోసం, వాతావరణ మార్పులను అదుపులోకి తీసుకురావడం కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మామూలుగా వర్షం పడితే భూమి కాస్త చల్లబడుతుంది. ఒకవేళ చాలారోజుల పాటు వర్షం పడకుండా ఉంటే.. నేల భరించలేనంత వేడిగా మారుతుంది. ఇలా ఆలోచించి క్లౌట్ సీడింగ్ అనే కృత్రిమ పద్ధతిని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ముందుగా క్లౌట్ సీడింగ్ అనేది దుబాయ్, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రయోగించి చూశారు. ఇప్పుడు ఈ ప్రయోగాలు ఇండియా వరకు వచ్చేశాయి.


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్‌పూర్ (ఐఐటీ కే) పరిశోధకులు తాజాగా క్లౌడ్ సీడింగ్‌పై సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగాలు చేపట్టారు. క్యాంపస్‌లోనే ఒక ప్రాంతంలో ఈ ప్రయోగాలు చేసి చూశారు. 5000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఎగరేసి క్లౌడ్ సీడింగ్ ద్వారా భారీ వర్షాన్ని కురిపించగలిగారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు వర్షాలు లేక కరువులో మునిగిపోయి ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో ఇలాంటి కృత్రిమ వర్షాలు కురిపించి ప్రజలకు సాయం చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే ఐఐటీ చేసే ప్రయోగాలకు అండగా నిలుస్తోంది.

క్లౌడ్ సీడింగ్‌లో సిల్వర్ అయోడైడ్, డ్రై ఐస్, టేబుల్ సాల్ట్.. లాంటి కెమికల్ ఏజెంట్స్‌ను కలిపి మబ్బులను బరువెక్కేలా చేసి వర్షాలు కురిపిస్తారు శాస్త్రవేత్తలు. క్లౌడ్ సీడింగ్ ప్రయోగాలు ఈమధ్యే ప్రారంభం అయ్యాయి కాబట్టి దీనికి అయ్యే కాస్ట్ కాస్త ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఒక గంట కృత్రిమ వర్షం కురిపించడం కోసం దాదాపు రూ.2 నుండి 5 లక్షలు ఖర్చు అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముందుగా అభివృద్ది చెందిన దేశాల్లో ఈ ప్రయోగాలు చేయడం కోసం ప్రభుత్వాలు అనుమతించలేదు. ఎందుకంటే కృత్రిమంగా వర్షాలు కురిపించడం వల్ల వాతావరణానికి హాని కలుగుతుందని వారు భావించారు. కానీ కృత్రిమ వర్షాల వల్ల వాతావరణానికి ఎలాంటి హాని ఉండదని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు.

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×