BigTV English

Israel Hits Hezbollah Targets in Syria: హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి.. వీడియో రిలీజ్

Israel Hits Hezbollah Targets in Syria: హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడి.. వీడియో రిలీజ్

Israel Hits Hezbollah Targets in Syria: గాజాలో హమాస్ పై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్న నేపథ్యంలో.. గాజాకు మద్దతుగా హెజ్ బొల్లా తిరిగి ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. అయితే దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దళాలు కూడా దాడులు మిలిటెంట్ గ్రూప్ అయిన హెజ్ బొల్లాపై దాడులు చేస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ దళాలు మరోసారి ఆ మిలిటెంట్ గ్రూప్ పై విరుచుకుపడ్డాయి.


ఇజ్రాయెల్ దళాలు బుధవారం మరోసారి సిరియాపై విరుచుకుపడ్డాయి. సిరియా కేంద్రంగా పనిచేస్తున్న లెబనాన్ కు చెందిన హెజ్ బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసినట్లు ప్రకటించాయి.

ఈ దాడుల్లో కీలక సైనిక స్థావరాలు, మౌలికవసతులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దళాలు చేసిన ఈ దాడికి సంబంధించిన ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్టర్ వేదికగా విడుదల చేసింది.


సిరియాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు ఆ దేశామే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. హెజ్ బొల్లా కార్యకలాపాలు సిరియా భూభాగం నుంచి తమిరికొట్టాలని పరోక్షంగా ఇజ్రాయెల్ హెచ్చరించింది. హెజ్ బొల్లా బలోపేతం ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది.

Also Read: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. బంధీలను వెంటనే విడుదల చేయాలి.. యూఎన్ లో భారత్ డిమాండ్

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని హెజ్ బొల్లా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్ సైన్యంపై హెజ్ బొల్లా గ్రూప్ దాడులకు తెగబడింది. దీంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆ మిలిటెంట్ గ్రూప్ దాడులు చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ సైన్యం బుధవారం హెజ్ బొల్లా స్థావరాలపై జరిపిన దాడుల్లో ఈ సంస్థ ప్రధాన విభాగమైన రాడ్వాన్ ఫోర్సెస్ కమాండర్ అలీ అహ్మద్ హుస్సేన్ మృతి చెందినట్లు ప్రకటించింది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×