Baidu AI models: ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో గట్టి పోటీ నెలకొంది. మార్కెట్లోకి రోజుకో మోడల్ రిలీజ్ అవుతుంది. దీంతో ఆయా కంపెనీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది. ఇటీవల చైనాకు చెందిన మనుస్ మార్కెట్లోకి రాగా, తాజాగా చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ బైడు (Baidu) రెండు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లను విడుదల చేసింది.
ఏఐ రేసులో
ఈ కొత్త మోడళ్లలో ఒకటి ERNIE 4.5 కాగా, రెండోది ERNIE X1. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ప్రసిద్ధి చెందిన చాట్‌జిపిటి (ChatGPT) ని సవాల్ చేస్తాయని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఈ రెండు మోడళ్లతో బైడు ఏఐ రేసులో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
AI మార్కెట్‌లో తీవ్ర పోటీ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా AI విప్లవం కొనసాగుతోంది. ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్‌లోని ఓపెన్‌ఏఐ (OpenAI) ద్వారా విడుదలైన GPT-4 AI మోడల్, చైనాలోని AI స్టార్టప్ డీప్‌సీక్ (DeepSeek) సహా పలు ఏఐలు మార్కెట్లో ఎక్కువ యూజర్ బేస్ కల్గి ఉన్నాయి. బైడు విడుదల చేసిన కొత్త AI మోడళ్లు గ్లోబల్ AI మార్కెట్‌లో కొత్త ఒరవడిని సృష్టించనున్నాయని కంపెనీ ప్రతి నిధులు తెలిపారు. అయితే బైడు తాజా మోడళ్ల లక్ష్యం – తక్కువ ఖర్చుతో అధిక పనితీరును అందించడమన్నారు.
వలం సగం ధరకు
ERNIE X1 మోడల్ డీప్‌సీక్ R1తో సమానమైన పనితీరును కేవలం సగం ధరకు అందిస్తుందని బైడు పేర్కొంది. ఇది అత్యంత శక్తివంతమైన మోడల్ అని చెబుతున్నారు. ఇది ప్రణాళికా సామర్థ్యాలు, తీవ్ర అవగాహన, తాత్వికత వంటి లక్షణాలను కల్గి ఉంటుందని, స్వయం ప్రతిపత్తిగా సమస్యలకు సమాధానాలు ఇస్తుందన్నారు.
Read Also: Wireless Earbuds: బ్రాండెడ్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌పై 77% డిస్కౌంట్
ఆడియో వంటి
ERNIE 4.5 మల్టీమోడల్ సామర్థ్యాన్ని కల్గి ఉందని ప్రకటించారు. ఇది టెక్స్ట్, వీడియో, ఇమేజ్‌లు, ఆడియో వంటి వివిధ రకాల డేటాను ఒకే సమయంలో ప్రాసెస్ చేయగలదు. భాషా వినియోగంలో అత్యంత సహజత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది కేవలం వాక్య నిర్మాణాన్ని మాత్రమే కాకుండా, భావాలను కూడా పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం కల్గి ఉందన్నారు. నెట్‌వర్క్ మీమ్స్, వ్యంగ్య కార్టూన్‌లు, ఇతర కంటెంట్‌ను సులభంగా అర్థం చేసుకోగలదన్నారు.
బైడు పోటీదారులు ఎవరు?
AI మార్కెట్‌లో ప్రస్తుతం ప్రధాన పోటీదారులు:
OpenAI (ChatGPT) – GPT-4 ద్వారా ఎక్కువ మంది వినియోగిస్తున్నారు
DeepSeek – ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఈ చైనా ఆధారిత స్టార్టప్, తక్కువ సమయంలోనే శక్తివంతమైన మోడళ్లను అందిస్తోంది
Google (Gemini) – Google తన మల్టీమోడల్ AI వ్యవస్థ ద్వారా పోటీ పడుతోంది
Meta (LLaMA) – Meta తన లాంగ్వేజ్ మోడళ్లతో AI రేసులో ఉంది
తాజా మోడళ్ల ద్వారా
AI మార్కెట్‌లో బైడు తీసుకున్న కొత్త నిర్ణయం, తక్కువ ధరలో అధిక పనితీరు కలిగిన మోడళ్లను అందించడం. ఇది చైనాలోని ఇతర కంపెనీలను, అంతర్జాతీయ మార్కెట్‌ను ప్రభావితం చేయగలదు. ఈ క్రమంలో బైడు తాజా మోడళ్ల ద్వారా గణనీయమైన పురోగతిని సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు.