Train Ticket Hidden Services: భారతదేశ జీవనాడిగా పిలిచే భారతీయ రైల్వే సంస్థ ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణీకులు సేవలను అందిస్తోంది. తక్కువ ఖర్చులో సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అదే సమయంలో రైల్వే టికెట్ పై బోలెడు ఉచిత సదుపాయాలను అందిస్తుస్తోంది. ఈ సేవలన్నింటినీ ప్రయాణీకులు ఉచితంగానే పొందే అవకాశం ఉంది. ఇంతకీ టికెట్ పై లభించే ఉచిత సౌకర్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ తాగునీరు
ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో ఉచితంగా ఫిల్టర్ చేసిన తాగునీటిని పొందవచ్చు. ఇందుకోసం అదనంగా ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.
⦿ టాయిలెట్లు, వాష్ రూమ్ లు
అన్ని రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలోని ప్రతి కోచ్ లో టాయిలెట్లు ఉంటాయి. ప్రయాణీకులు వీటిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
⦿ వైద్య సాయం
ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రథమ చికిత్సకు అవసరమైన అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. అత్యవసర వైద్య సాయాన్ని పొందేందుకు ప్రయాణీకులు రైల్వే అధికారుల సహాయం పొందవచ్చు.
⦿ వైఫై సౌకర్యం
దేశ వ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లలో ఉచిత హై స్పీడ్ వైఫై సౌకర్యం ఉంది. ప్రయాణీకులు తమ రైలు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి, ఇమెయిల్ చెక్ చేసుకోవడానికి లేదంటే కంటెంట్‌ను స్ట్రీమ్ చేయడానికి ఉచితంగా వైఫై పొందే అవకాశం ఉంటుంది.
⦿ భద్రతా సేవలు
ప్రయాణీకుల భద్రత కోసం రైల్వే సంస్థ కీలక చర్యలు తీసుకుంటున్నది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) రైల్వే స్టేషన్లలో, రైళ్లలో భద్రతను అందిస్తాయి. ప్రయాణీకులు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా భద్రతా సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది.
⦿ ఛార్జింగ్ పాయింట్లు
ప్రయాణీకుల డిజిటల్ అవసరాలను తీర్చేందుకు రైల్వే స్టేషన్లతో పాటు రైలు కోచ్ లలో ఉచిత ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులు తమ ప్రయాణ సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించుకునే సాయపడుతాయి.
⦿ వెయిటింగ్ రూములు
రిజర్వేషన్ టికెట్లు ఉన్న ప్రయాణీకులకు రైల్వే స్టేషన్లలో ఉచితంగా వెయిటింగ్ రూములను ఉపయోగించుకోవచ్చు. ఇందుల సీటింగ్ సహా ప్రాథమిక సౌకర్యాలు ఉంటాయి.
⦿ బేబీ ఫీడింగ్ రూములు
కొన్ని రైల్వే స్టేషన్లలో తల్లుల కోసం ప్రత్యేక బేబీ ఫీడింగ్ రూములు ఉంటాయి. ఈ రూమ్ లు పాలిచ్చే తల్లులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తాయి.
⦿ బెడ్ రోల్స్
రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లలో.. AC క్లాస్ లో వెళ్లే ప్రయాణీకులకు దుప్పట్లు, దిండ్లు, బెడ్ షీట్లతో సహా ఉచిత బెడ్ రోల్స్ లభిస్తాయి.
⦿ లగేజ్ ట్రాలీలు
ఎంపిక చేసిన ప్రధాన రైల్వే స్టేషన్లలో, ప్రయాణీకులకు ఉచిత లగేజ్ ట్రాలీలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో లగేజీ ఉన్న వారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.
భారతీయ రైల్వే సంస్థ దేశవ్యాప్తంగా అన్నిప్రాంతాలను అనుసంధానించడంతో పాటు ఈ ఉచిత సేవలను అందించడం ద్వారా ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కలిగిస్తుంది. ఇకపై రైలులో ప్రయాణించినప్పుడు, మీ ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగించేందుకు ఈ సౌకర్యాలను ఉపయోగించుకోండి.