Air Taxi : భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో బెంగళూరుకు చెందిన సరళా ఏవియేషన్.. తన వినూత్న ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీను పరిచయం చేసింది. ఈ టాక్సీ పేరు “శూన్య” (Shunya) గా వెల్లడించింది.
సరళా ఏవియేషన్ తీసుకొచ్చిన ఈ ఎయిర్ ట్యాక్సీ శూన్య ప్రోటోటైప్ స్వల్ప దూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. 250 km/h వేగంతో 20-30 km ప్రయాణాలను తేలికగా ప్రయాణించగలదని తెలిపింది. ఇండియాలో బెస్ట్ ఎయిర్ రవాణా ప్రొవైడర్ గా ఉండాలనే లక్ష్యంతోనే ఎయిర్ టాక్సీను తీసుకొచ్చినట్టు తెలపిన ఈ సంస్థ.. ఈ ట్యాక్సీ 2028లో అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.
Shunya Air Taxi –
శూన్య ప్రోటోటైప్ తక్కువ దూరాలను మాత్రమే ప్రయాణించగలదు.
250 km/h వేగంతో 20-30 km ప్రయాణాలను కవర్ చేయగలదు.
ఆరుగురు ప్రయాణీకులు తేలికగా ప్రయాణించవచ్చు.
గరిష్టంగా 680 కిలోల పేలోడ్‌తో పనిచేస్తుంది.
హై-ఎండ్ టాక్సీ సర్వీసర్ గా పనిచేసే ఛాన్స్
రెండు వైపుల నుండి అందుబాటులో ఉండే రూమి లోడింగ్ ఏరియా
కార్గో కార్యకలాపాలకు ఉపయోగపడే ఎయిర్ ట్యాక్సీ
ALSO READ : ఇచ్చిపడేసిన అమెజాన్.. రూ.10వేలకే రియల్ మీ లేటెస్ట్ మెుబైల్!
అక్టోబర్ 2023లో అడ్రియన్ ష్మిత్, రాకేష్ గాంకర్, శివమ్ చౌహాన్ సరళా ఏవియేషన్ స్థాపించారు. ఫ్లిప్‌కార్ట్ బిన్నీ బన్సల్, జెరోధా నిఖిల్ కామత్ ఇందుకు సపోర్ట్ అందించారు. బెంగళూరు నుంచి సరళ ఏవియేషన్ తన సేవలను ముంబై, ఢిల్లీ, పూణేలలో విస్తారించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య రవాణా అవసరాలను తీర్చడానికి రూపొందించిన ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవను సైతం త్వరలోనే ఈ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేపడుతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇండియా ఫస్ట్ మహిళా పైలట్ సరళా థక్రాల్ పేరు మీద ఈ వెంచర్‌కు పేరు పెట్టినట్లు తెలుస్తుంది. 1936లో కేవలం 21 సంవత్సరాల వయస్సులో సరళ తన పైలట్ లైసెన్స్‌ను సంపాదించి భారతీయ విమానయాన రంగంలో తనదైన ముద్ర వేసింది.
ఇక తాజాగా బ్లూ యారో కంపెనీ తన ఎయిర్ టాక్సీను గ్రేటర్ నోయిడాలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇండియా ఎక్స్ పో మార్ట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. టాక్సీ అధునాతన టెక్నాలజీతో పాటు సౌకర్యంగా ఉండేలా రూపొందించామని వెల్లడించింది. గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీ తక్కువ దూరమే ఉన్నప్పటికీ ట్రాఫిక్ కారణంగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని.. అందుకే త్వరలోనే ఎయిర్ టాక్సీ ను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఒక్కసారి ఛార్జింగ్ తో 400 కిలోమీటర్లు ప్రయాణించే ఛాన్స్ ఉంటుందని.. ఈ విమానంలో తేలికగా ప్రయణించే ఛాన్స్ ఉంటుదని తెలిపింది. ఇక దీనిపై ధరలు సైతం తక్కువగానే ఉంటాయని ప్రకటించింది. ఢిల్లీ నుంచి గ్రేటర్ నోయిడాకు కేవలం రూ.2000 నుంచి రూ.2200 మాత్రమే ఛార్జ్ చేస్తామని.. సుమారు 100 కిలోల బరువును తీసుకువెళ్లగలదని తెలిపింది.
ఇక ఈ ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుందనే చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల్లో నిత్యం ప్రయాణించే ఉద్యోగాలుకు ఉపశమనం లభించినట్లు అవుతుంది.