Malavika Mohanan: ఈరోజుల్లో టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయ్యింది. కానీ దానిని మంచికి ఉపయోగించే వారికంటే చెడుకు ఉపయోగించేవారే ఎక్కువ అవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ అందరిపై పడుతుంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ టెక్నాలజీ, ఏఐ వల్ల ఎక్కువగా బాధితులు అవుతున్నారు. ఎప్పటికప్పుడు హీరోయిన్ల ఫేక్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అందులో ఏది నిజమైన ఫోటో, ఏది ఫేక్ ఫోటో అని కనిపెట్టడం కూడా ప్రేక్షకులకు కష్టమవుతోంది. తాజాగా హాట్ బ్యూటీ మాళవికా మోహనన్ కూడా ఈ ఫేక్ ఫోటో ట్రాప్‌లో బాధితురాలిగా మారింది. అందుకే ఈ విషయంపై స్వయంగా మాళవికానే క్లారిటీ ఇచ్చేసింది.
సోషల్ మీడియాతో హైప్
మలయాళ కుటుంబంలో పుట్టి పెరిగిన మాళవికా మోహనన్ ముందుగా మలయాళ సినిమాలతోనే తన కెరీర్‌ను ప్రారంభించింది. తన కెరీర్‌ను ప్రారంభించి దాదాపు 12 ఏళ్లు అవుతున్నా కూడా మాళవికా కెరీర్‌లో ఇంకా గుర్తుండిపోయే సినిమా పడలేదు. ధనుష్, విక్రమ్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో నటించినా కూడా తనకు బ్రేక్ రాలేదు. అయినా కూడా మాళవికా మోహనన్‌కు విపరీతమైన పాపులారిటీ ఉంది. దానికి కారణం తన సోషల్ మీడియా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ అప్లోడ్ చేస్తూ యూత్‌ను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన మరో హాట్ ఫోటోషూట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దానిపై మాళవికా స్పందించింది.
షేర్ చేయకండి ప్లీజ్
బెడ్‌పై బుక్ చదువుతూ ఉన్న మాళవికా మోహనన్ హాట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ఈ బ్యూటీ మరీ అందంగా ఉందంటూ ఫ్యాన్స్ దీనిని తెగ షేర్ చేశారు. కానీ ఫైనల్‌గా ఈ ఫోటో తనది కాదని, ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది మాళవికా. వీటికి షేర్ చేయడం ఆపేయమని ట్విటర్‌లో ఒక తమిళ పేజ్‌కు రిక్వెస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో తనది కాదని అందరికీ స్పష్టమయ్యింది. కానీ మాళవికాకు మామూలుగా ఇలాంటి ఫోటోషూట్స్ అలవాటే కాబట్టి ఇందులో ఉంది తనే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మొత్తానికి తను క్లారిటీ ఇచ్చిన తర్వాత టెక్నాలజీ, ఏఐ వల్ల మరొక హీరోయిన్ బాధితురాలిగా మారిందని తెలుసుకున్నారు.
Also Read: ‘జాట్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. అందరికి అదే తేదీ కావాలి.!
తెలుగులో డెబ్యూ
మాళవికా మోహనన్ (Malavika Mohanan) సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తను ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. మాళవికా మోహనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. తన డబ్బింగ్ సినిమాలను కూడా చాలామంది చూశారు. కానీ తను మాత్రం నేరుగా తెలుగులో ఎప్పుడూ నటించలేదు. అలాంటిది ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాతో తనకు తెలుగులో డెబ్యూ చేసే అవకాశం లభించింది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకుంది. దీంతో పాటు కార్తీ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ 2’లో కూడా మాళవికానే హీరోయిన్‌గా నటిస్తోంది.