Jobs in Indian Oil Corporation: టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలున్న అభ్యర్థులకి ఇది గుడ్ న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగలకు ఇదే సువర్ణవకాశం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులను ఢర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 456
ఇందులో మూడు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ పోస్టులు వెకన్సీ ఉన్నాయి.
ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు 129, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు 148, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల 179 వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు టెన్త్ క్లాస్ లేదా ఐటీఐ పాసై ఉంటే సరిపోతుంది. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు డిప్లొమా ఇంజినీరింగ్ పాసై ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
వయస్సు: 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జనవరి 24
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 13
అఫీషియల్ వెబ్ సైట్: https://iocl.com/
నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
Also Read: Realme Mobiles : ఇచ్చిపడేసిన అమెజాన్.. రూ.10వేలకే రియల్ మీ లేటెస్ట్ మెుబైల్!
అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.