3GB Daily Data Plans: ఈ రోజుల్లో డేటా వినియోగం ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూపీఐ పేమెంట్స్, ఆన్ లైన్ బ్యాకింగ్, సోషల్ మీడియా, ఓటీటీ వినోదం ఇలా ఏ పని జరగాలన్నా మెుబైల్ లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. అయితే రోజుకు 2GB డేటా వచ్చేలా రీఛార్జ్ చేసుకుంటున్నప్పటికీ అది సగం రోజుకే అయిపోతోందన్న అభిప్రాయాలు చాలా మంది మెుబైల్ యూజర్లలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వీఐ నెట్ వర్క్ లలో తక్కువ ధరలో ప్రతీ రోజూ 3GB డేటాను అందించే అద్భుతమైన ప్లాన్స్ ను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే కస్టమర్లకు ప్రతీ రోజూ 3GB డేటా లభిస్తుంది. అలాగే అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే.. అదనంగా మరో 3GB డేటాను బోనస్ గా లభించనుంది.
ఈ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిటిడీతో జియో తీసుకొచ్చింది. ఇది కూడా యూజర్లకు ప్రతీ రోజూ 3GB డేటాను అందిస్తుంది అలాగే అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. ఇది కాకుండా అదనపు ప్రయోజనాల కింద అపరిమిత 5G డేటా, జియో టీవీ, జియో క్లౌడ్, 3 నెలల ఫ్రీ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్, 18 నెలల పాటు ఉచిత జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు.
ఈ ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ 70 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఇందులోనూ ప్రతీ రోజూ 3GB డేటా యూజర్ కు లభిస్తుంది. అలాగే అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు యథావిధిగా పొందొచ్చు. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు.
వొడాఫోన్ ఐడియా ఈ ప్లాన్ ను 56 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ కింద యూజర్ కు ప్రతీ రోజూ 3GB డేటా రానుంది. అంటే ప్లాన్ పూర్తయ్యే సరికి 168 GBని యూజర్లు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ లో అపరిత 5G డేటా, వీఐ మూవీస్ అండ్ టీవీ యాక్సెస్, అర్ధరాత్రి ఫ్రీ డేటా, వీకెండ్ డేటా రోల్ ఓవర్, డేటా డిలైట్ వంటి బోలెడన్ని బెనిఫిట్స్ కస్టమర్లకు లభించనున్నాయి.
Also Read: హార్డ్ vs సాఫ్ట్.. ఖరీదైన స్మార్ట్ ఫోన్‌కు.. ఏ కవర్ శ్రీరామరక్ష?
ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ను 56 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ కింద రోజూ 3GB డేటా, అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అదనపు ప్రయోజనాల కింద అమెజాన్ ప్రైమ్, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లే, అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్ పొందొచ్చు.
Also Read: షావోమి అధునాతన ‘FX Mini LED’ టీవీలు.. ఆశ్చర్యపరిచే ఫీచర్లు.. భారీ స్క్రీన్‌పై విజువల్స్ పండగ!