Apple Maps India update: ఎప్పటి నుంచో గూగుల్ మ్యాప్స్ గుత్తాధిపత్యంలో ఉన్న నావిగేషన్ మార్కెట్‌కు చెక్ పెట్టేందుకు యాపిల్ సంస్థ ఒక సంచలన అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. ఇప్పటివరకు అమెరికా, యూరప్ వంటి దేశాలకే పరిమితమైన కొన్ని బెస్ట్ నావిగేషన్ ఫీచర్లను ఇప్పుడు అధికారికంగా భారతదేశంలోకి తీసుకొచ్చింది. ఐఫోన్ యూజర్ల కోసం ఆపిల్ మ్యాప్స్ ఒక భారీ అప్‌డేట్‌ను రోల్ అవుట్ చేసింది. దీని ద్వారా ఏకంగా 300కు పైగా ప్రసిద్ధ 3D ల్యాండ్‌మార్క్‌లు, లేటెస్ట్ AR (ఆగ్మెంటెడ్ రియాలిటీ) వాకింగ్ డైరెక్షన్స్ అందుబాటులోకి వచ్చాయి.
ఆపిల్ తీసుకొచ్చిన ఈ లేటెస్ట్ అప్‌డేట్ టెక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో యూజర్లకు అనుభవమయ్యే ప్రధాన ఫీచర్లు..
300+ 3D ల్యాండ్‌మార్క్‌లు: మనదేశంలోని తాజ్ మహల్, ఇండియా గేట్, కుతుబ్ మినార్ వంటి చారిత్రక కట్టడాలతో పాటు ప్రముఖ నగరాల్లోని రియల్ టైమ్ 3D మోడల్స్ ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. కేవలం మ్యాప్స్ చూడటమే కాకుండా.. ఆ బిల్డింగ్‌లు ఎలా ఉన్నాయో త్రిమితీయ రూపంలో తిప్పి చూడొచ్చు.
AR వాకింగ్ డైరెక్షన్స్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ): రద్దీగా ఉండే ..నగరాల్లో ఎటు వెళ్లో అర్థం కానప్పుడు ఈ ఫీచర్ సూపర్‌గా పని చేస్తుంది. మీ ఐఫోన్ కెమెరాను ఆన్ చేస్తే చాలు.. మ్యాప్స్ నేరుగా మీ కెమెరా స్క్రీన్ పైనే యానిమేటెడ్ డైరెక్షన్స్ ,బాణాలను చూపుతాయి. దీనివల్ల దారి తప్పు అవకాశం అసలు ఉండదు.
మెరుగైన ట్రాఫిక్ , రూట్ మ్యాపింగ్: గూగుల్ మ్యాప్స్‌తో సమానంగా లేదా అంతకంటే మెరుగైన క్లారిటీతో రోడ్లు, సందులు, ట్రాఫిక్ అప్‌డేట్‌లను ఇది అందిస్తుంది.
ఈ అప్‌డేట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఐఫోన్ , ఐప్యాడ్ లేదా ఆపిల్ వాచ్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ ఫీచర్లు పూర్తిగా ఫ్రీ. ఆపిల్ తన ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ ద్వారా దీనిని ఆటోమేటిక్‌గా అందిస్తోంది. అయితే, ఈ 3D,AR ఫీచర్లను పూర్తిగా ఆస్వాదించాలంటే.. ఐఫోన్ మోడల్ కాస్త లేటెస్ట్ అయి ఉండాలి (ఉదాహరణకు iOS 17 లేదా తర్వాతి వెర్షన్లు సపోర్ట్ చేసే ఐఫోన్లు). ఐఫోన్ల ధరల విషయానికి వస్తే.. మార్కెట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 16 సిరీస్ ధరలు సుమారు రూ. 70,000 నుంచి రూ. 1,50,000 పైబడి అందుబాటులో ఉన్నాయి.
Also Read: బ్లాక్ ఫ్రైడే సేల్ 2026..ఐఫోన్లు,ఆండ్రాయిడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు,ఎప్పటినుంచంటే?
ఇన్నాళ్లు గూగుల్ మ్యాప్స్ మాత్రమే ఇండియాలో.. నంబర్ వన్ నావిగేషన్ యాప్‌గా చెలామణి అవుతోంది. అయితే ఆపిల్ మ్యాప్స్ తెచ్చిన ఈ విజువల్ రిచ్ 3D వ్యూ , ఏఆర్ నావిగేషన్ వల్ల ఐఫోన్ యూజర్లు ఇకపై గూగుల్ మ్యాప్స్ బదులు ఆపిల్ మ్యాప్స్‌ను ఎక్కువగా వాడే అవకాశం ఉంది. ప్రైవసీ ,సెక్యూరిటీ విషయంలో ఆపిల్ ఇస్తున్న ప్రాధాన్యత దీనికి మరింత ప్లస్ అవుతోంది.
మీరు గనక ఐఫోన్ యూజర్ అయి ఉంటే.. వెంటనే మీ ఆపిల్ మ్యాప్స్‌ను అప్‌డేట్ చేసుకోండి. టెక్నాలజీ పరంగా ఆపిల్ చేసిన ఈ సరి కొత్త అడుగు యూజర్లకు సరికొత్త నావిగేషన్ అనుభూతిని ఇవ్వడం ఖాయం!