Best hair dryer: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో తలస్నానం చేశాక గంటల తరబడి జుట్టు ఆరబెట్టుకోవడం అంటే.. ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది చెప్పండి? అందుకే ఒక మంచి హెయిర్ డ్రైయర్ ఉండటం ఇప్పుడు అత్యవసరమైపోయింది. అయితే.. మార్కెట్లోకి వెళితే వందల కొద్దీ మోడల్స్ కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో ఏది పడితే అది కొంటే జుట్టు రాలిపోవడం లేదా డ్యామేజ్ కావడం ఖాయం. అందుకే హెయిర్ డ్రయర్ విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం.ఇంతకీ మీ జుట్టుకు పర్‌ఫె క్ట్‌గా సరి పోయే హెయిర్ డ్రైయర్‌ను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
అందరికీ ఒకే రకమైన జుట్టు ఉండదు. కాబట్టి మీ హెయిర్ టైప్‌ను బట్టి డ్రైయర్‌ను ఎంచుకోవాలి. పల్చని లేదా సున్నితమైన జుట్టు.. ఉన్న వారు తక్కువ హీట్ సెట్టింగ్స్ ఉన్న డ్రైయర్‌లను ఎంచుకోవాలి. ఇలాంటి వారికి సిరామిక్ లేదా టూర్మలైన్ టెక్నాలజీ ఉన్నవి బెస్ట్ ఆప్షన్.ఈ రకం జుట్టు త్వరగా ఆరదు కాబట్టి, ఎక్కువ వాటేజ్ (Wattage – 2000W పైగా) ఉన్న పవర్ ఫుల్ మోటార్ డ్రైయర్లు అవసరం.
మీ జుట్టు కర్లీగా ఉంటే, బాక్స్‌తో పాటు ‘డిఫ్యూజర్’అటాచ్‌మెంట్ వచ్చే హెయిర్ డ్రైయర్‌ను కొనడం బెస్ట్.
అయోనిక్ డ్రైయర్స్ : జుట్టు త్వరగా ఆరిపోయేలా చేయడంతో పాటు జుట్టును సిల్కీగా మారుస్తాయి. ప్రస్తుతం ఇవి మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
సిరామిక్/ఇన్ఫ్రారెడ్ డ్రైయర్స్: ఇవి జుట్టుకు సమానంగా ..వేడిని అందించి, వేడి కారణంగా జుట్టు దెబ్బ తినకుండా రక్షిస్తాయి.
మల్టిపుల్ హీట్ & స్పీడ్ సెట్టింగ్స్: వేడి,గాలి వేగాన్ని మన అవసరానికి తగ్గట్టు మార్చుకునే ఆప్షన్ ఉండాలి. ముఖ్యంగా ‘కూల్ షాట్ బటన్ ఉంటే.. జుట్టు స్టైలింగ్ తర్వాత సెట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది.
తేలికైన డిజైన్: డ్రైయర్ బరువు తక్కువగా ఉంటే చేతులు నొప్పి పెట్టకుండా సౌకర్యంగా ఉంటుంది.
Also Read: బ్లాక్ ఫ్రైడే సేల్ 2026..ఐఫోన్లు,ఆండ్రాయిడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు,ఎప్పటినుంచంటే?
ఇండియన్ మార్కెట్లో ఫిలిప్స్ (Philips), డైసన్ (Dyson), హావల్స్ (Havells), ఐకాల్ (Ikonic), రెమింగ్టన్ (Remington) వంటి బ్రాండ్లు టాప్‌లో ఉన్నాయి.
బడ్జెట్ రేంజ్ (రూ.1,000-రూ.2,000): ఫిలిప్స్ లేదా హావల్స్ బ్రాండ్లకు చెందిన బేసిక్ మోడల్స్ సాధారణ రోజువారీ వాడకానికి చాలా బాగుంటాయి.
మిడ్ రేంజ్ (రూ.2,000-రూ.5,000): అయోనిక్ టెక్నాలజీ, బ్లో-డ్రైయింగ్ అటాచ్‌మెంట్లతో కూడిన మంచి ఫీచర్ల డ్రైయర్స్ ఈ ధరలో లభిస్తాయి.
ప్రీమియం రేంజ్ (రూ.10,000 నుంచి రూ.30,000+): డైసన్ సూపర్ సోనిక్ వంటి ప్రీమియం బ్రాండ్లు జుట్టుకు అసలు డ్యామేజ్ కాకుండా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని అందిస్తాయి.
హెయిర్ డ్రైయర్ కొనేట ప్పుడు కేవలం తక్కువ ధరను మాత్రమే కాకుండా..మీ జుట్టు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచు కొని క్వాలిటీ ప్రొడక్ట్‌ను ఎంచుకోవడం ముఖ్యం. సేల్స్ సమయంలో ..బ్రాండెడ్ డ్రైయర్లపై మంచి డిస్కౌంట్లు కూడా లభిస్తాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోండి!