HP student laptops: కాలేజీ లైఫ్ అంటేనే ఉదయం ఆన్‌లైన్ క్లాసులు, మధ్యాహ్నం ల్యాబ్ వర్క్, సాయంత్రం ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లతో.. ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ హడావిడిలో లాగ్ అవ్వకుండా, బ్యాటరీ ఇబ్బంది లేకుండా.. సపోర్ట్ చేసే ల్యాప్‌టాప్ ఉంటే.. చదువు ఇంకా స్పీడ్‌గా సాగుతుంది. స్టూడెంట్స్ అవసరాలకు .. తగ్గట్టుగా హెచ్‌పీ బ్రాండ్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్స్ నుంచి హై-పవర్ ప్రాజెక్ట్ మెషీన్‌ల వరకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. మీ బడ్జెట్, కోర్సు అవసరాలకు సరి పోయే టాప్ 5 హెచ్పీ ల్యాప్‌టాప్‌ల ఫీచర్లు, లేటెస్ట్ ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.
కాలేజీలో చేరిన కొత్తలో లేదా ఫైనల్ ఇయర్ ప్రాజెక్టులు చేసే టైమ్‌లో మంచి ల్యాప్‌టాప్ చాలా ముఖ్యం. కొందరికి కేవలం క్లాసులు వినడానికి, నోట్స్ రాసుకోవడానికి సింపుల్ ల్యాప్‌టాప్ సరి పోతుంది. మరికొందరికి కోడింగ్, 3D డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ లేదా భారీ డేటా ప్రాజెక్టుల కోసం ఎక్కువ RAM, మంచి గ్రాఫిక్స్ అవసరం అవుతాయి. స్టూడెంట్స్ కోసం ప్రస్తుతం మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ ఉన్న 5 ల్యాప్‌టాప్‌లను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీ బడ్జెట్ తక్కువగా ఉండి, రోజువారీ ఆన్‌లైన్ క్లాసులు, బ్రౌజింగ్, డాక్యుమెంట్స్, స్ప్రెడ్‌షీట్స్ కోసం ల్యాప్ టాప్ కావాలనుకుంటే ఈ మోడల్ మంచి ఆప్షన్. ఇందులో ..బెస్ట్ ప్రాసెసర్, 8GB DDR4 RAM, 512GB SSD స్టోరేజ్ ఉంటాయి. పెద్ద స్క్రీన్‌తో పాటు న్యూమరిక్ కీప్యాడ్ ఉండటం వల్ల అకౌంట్స్ లేదా డేటా ఎంట్రీ వర్క్ చేసే వారికి ఈజీగా ఉంటుంది. వైఫై 6 కనెక్టివిటీతో క్లాసుల సమయంలో నెట్‌వర్క్ కనెక్షన్ కూడా స్మూత్‌గా ఉంటుంది. బేసిక్ కాలేజీ పనులకు ఇది సింపుల్ ఛాయిస్.
ధర: సుమారు రూ.44,880 నుంచి రూ.49,990 వరకు
రెగ్యులర్ ఆన్‌లైన్ లెక్చర్స్, ప్రెజెంటేషన్లు, అసైన్‌మెంట్ల కోసం ఇంటెల్ ప్రాసెసర్ వైపు మొగ్గు చూపే వారికి ఈ మోడల్ చాలా బాగుంటుంది. ఇందులోని ప్రాసెసర్, 8GB DDR4 ర్యామ్, 512GB ఎస్ఎస్డీ, 15.6-ఇంచుల ఫుల్ హెచ్డీ యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే ఇస్తున్నారు. ముఖ్యంగా 1080p వెబ్‌క్యామ్ ఉండటం వల్ల వీడియో కాల్స్, ఆన్‌లైన్ మీటింగ్స్‌లో పిక్చర్ క్వాలిటీ క్లియర్‌గా కనిపిస్తుంది. విండోస్ 11 హోమ్‌తో పాటు ఎమ్ఎస్ ఆఫస్ హోమ్ 2024 సపోర్ట్ ఉండటం స్టూడెంట్స్‌కి అదనపు ప్లస్ పాయింట్.
ధర: సుమారు రూ.55,990
ఒకే సారి పది బ్రౌజర్ ట్యాబ్స్, కోడింగ్ టూల్స్, ప్రెజెంటేషన్ ఫైల్స్ ఓపెన్ చేసి పనిచేసే స్టూడెంట్స్‌కి ర్యామ్ చాలా కీలకం. ఈ మోడల్‌లో ఇంటెల్ కోర్ 5 120U ప్రాసెసర్‌తో పాటు ఏకంగా 24GB ర్యామ్, 512GB ఎస్ఎస్డీ ఇస్తున్నారు. నైట్ టైమ్ రూమ్‌లో లేదా డిమ్ లైట్‌లో టైప్ చేయడానికి బ్యాక్‌లిట్ కీబోర్డ్ చాలా హెల్ప్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫుల్ హెచ్డీ వెబ్‌క్యామ్, డ్యూయల్ స్పీకర్లతో కాలేజీ ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు త్వరగా పూర్తి చేయడానికి ఇది మంచి ఆల్‌రౌండర్‌లా నిలుస్తుంది.
ధర: సుమారు రూ.74,990