Gambhir On IND VS PAK: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (IND VS PAK) మధ్య జరిగే మ్యాచ్ లపై గౌతమ్ గంభీర్ (Gambhir) సంచలన వ్యాఖ్యలు చేశాడు. పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ వెధవలతో మ్యాచ్ లు అవసరమా? అంటూ ఫైర్ అయ్యాడు. ఈ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్ద తప్పు చేస్తుందని గౌతమ్ గంభీర్ సీరియస్ అయినట్టు ఓ పోస్ట్ వైరల్ గా మారింది. పహల్గామ్ సంఘటన నేపథ్యంలో 26 మంది భారతీయులు చనిపోయారని.. దీనికి కారణమైన పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదన్నాడు. కేవలం టీఆర్పీ, డబ్బుల కోసం మాత్రమే ఈ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారని అటు ఐసీసీపై కూడా మండిపడ్డాడు. ఈ పరిస్థితి మారాలని డిమాండ్ చేశాడు. దీంతో గంభీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిడియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యవహరిస్తున్న తీరుపై గౌతమ్ గంభీర్ బహిరంగంగా విమర్శలు చేసినట్టు ఓ పోస్టు వైరల్ గా మారింది. పహల్గామ్ సంఘటనలో 26 మంది భారతీయులు మృతి చెందారని.. అయినప్పటికీ టీఆర్పీ, ప్రకటనలు, డబ్బు కోసం పాకిస్తాన్ తో మ్యాచులు నిర్వహిస్తున్నారని ఫైర్ అయ్యాడు. ఈ ఆలోచన ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆగ్రహించాడు. దేశ సరిహద్దులో ప్రాణాలు అర్పించే సైనికుల కంటే పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లు ఎక్కువ కాదని ఘాటుగా విమర్శలు చేశాడు. ఈ విషయంలో గతంలో తాను బీసీసీఐ పద్ధతిని వ్యతిరేకించానని, ఇప్పటికీ అదే చెబుతున్నట్టు వెల్లడించాడు.