ఒక్కసారి ఊహించుకోండి. భూమి నుంచి మనం ఒక మెసేజ్ పంపిస్తే.. అది అవతలి వ్యక్తికి చేరడానికి ఒక రోజు పడుతుంది.. అవతలి నుంచి సమాధానం రావడానికి మరో రోజు పడుతుంది. అంటే ఒక మెసేజ్ పంపి, రిప్లై కోసం రెండు రోజులు ఎదురుచూడాలి. మనం చెప్పుకుంటున్నది ఏదో మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తికి పంపే మెసేజ్ గురించి కాదు.. ఏకంగా అంతరిక్షంలో ప్రయాణిస్తున్న ఒక చిన్న స్పేస్‌క్రాఫ్ట్‌కు పంపే మెసేజ్ గురించి. దాని పేరు వాయేజర్ 1. దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణిస్తున్న ఈ స్పేస్ షిప్.. ఇప్పుడు మానవ చరిత్రలోనే ఎవరూ చేరుకోని ఒక అద్భుతమైన మైలురాయిని అందుకుంది. అదే.. వన్ లైట్ డే. అసలు ఒక లైట్ డే అంటే ఏమిటి? భూమి నుంచి వాయేజర్ ఎంత దూరంలో ఉంది? ఇన్నేళ్లుగా అది అంతరిక్షంలో ఏం చేస్తోంది? అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ విషయం.. తనతో పాటు అది మోసుకెళ్తున్న బంగారు సందేశంలో ఏముంది?
1977 సెప్టెంబర్ 5. అమెరికాలోని కేప్ కెనావెరల్ నుంచి నాసా ఒక స్పేస్ షిప్‌ను అంతరిక్షంలోకి పంపించింది. దాని పేరే వాయేజర్ 1. దాని డెస్టినేషన్ ఏదో ఒక గ్రహం కాదు.. సోలార్ సిస్టమ్‌లోని సుదూర గ్రహాల రహస్యాలను ఛేదించడం దాని టార్గెట్. ముఖ్యంగా గురుడు, శని గ్రహాలను దగ్గరగా పరిశీలించడం. వాటి ఉపగ్రహాలు, వలయాలు, అయస్కాంత క్షేత్రాల గురించి ఇన్ఫోను గ్యాదర్ చేయడం. 1979లో గురుడు.. 1980లో శని గ్రహాలను దాటుకుంటూ వెళ్లిన వాయేజర్ 1, మనకు అంతకుముందు తెలియని ఎన్నో అంతరిక్ష రహస్యాలను పరిచయం చేసింది. అయితే అసలు అద్భుతం అక్కడి నుంచే మొదలైంది.
గ్రహాల పరిశోధన పూర్తయిన తర్వాత కూడా వాయేజర్ 1 తన జర్నీని ఆపలేదు. సూర్యుడి ప్రభావం ఉండే ప్రాంతాన్ని దాటి, నక్షత్రాల మధ్య ఉండే అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 2012 ఆగస్టులో హీలియోపాజ్ అనే బార్డర్‌ను దాటి ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది. ఈ ఘనత సాధించిన తొలి స్పేస్ షిప్‌గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇదేదో ఇంటర్‌స్టెల్లార్ లాంటి ఫిక్షనల్ మూవీ కాదు. పక్కా రియాలిటీ.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. భూమి నుంచి వాయేజర్ 1 దూరం అక్షరాలా 25.9 బిలియన్ కిలోమీటర్లు. అంటే దాదాపు 2,590 కోట్ల కిలోమీటర్లు. ఈ దూరాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక విషయం తెలుసుకోవాలి. కాంతి వేగం సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్లు. అంటే ఒక్క సెకనులోనే భూమి చుట్టూ ఏడున్నర సార్లు తిరిగేంత స్పీడ్‌తో దూసుకెళుతుంది లైట్. అలాంటి కాంతి నాన్‌స్టాప్‌గా 24 గంటల పాటు ప్రయాణిస్తే చేరుకునే దూరాన్నే వన్ లైట్ డే అంటారు. అంటే ఇది కాలాన్ని సూచించే పదం కాదు.. దూరాన్ని కొలిచే ప్రమాణం.
వాయేజర్ 1 నవంబర్ 18న ఈ వన్ లైట్ డేను చేరుకుంది. దీంతో భూమి నుంచి వన్ లైట్ డే దూరం ప్రయాణించిన తొలి స్పేస్ షిప్‌గా చరిత్ర సృష్టించింది. వాయేజర్ 1 గంటకు సుమారు 61 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అయినా ఈ దూరాన్ని చేరుకోవడానికి దానికి దాదాపు 49 ఏళ్లు పట్టింది. ఇక భూమి నుంచి పంపే రేడియో సిగ్నల్ అక్కడికి చేరడానికి 24 గంటలు పడుతుంది. అక్కడి నుంచి సమాధానం తిరిగి భూమికి రావడానికి మరో 24 గంటలు. అంటే మనిషి పంపిన మెసేజ్‌కు సమాధానం రావాలంటే దాదాపు 48 గంటలు ఎదురుచూడాల్సిందే.
సరే భూమిని దాటింది.. గురు, శని గ్రహాలను దాటింది.. ఏకంగా మన సోలార్ సిస్టమ్‌ను కూడా దాటేసింది. మరి వాయేజర్ 1 తన జర్నీని ఇంకెంత కాలం కొనసాగిస్తుంది? అనే క్వశ్చన్ మీకు రావొచ్చు. ప్రస్తుతానికి అది ఉర్సా మైనర్ అనే నక్షత్ర మండలం దిశగా ప్రయాణిస్తోంది. నిజానికి గ్లీసే 445 అనే నక్షత్రం వైపు వెళ్తున్నప్పటికీ దాన్ని చేరుకోదు. దాదాపు 40 వేల సంవత్సరాల తర్వాత ఆ నక్షత్రానికి సుమారు 1.7 కాంతి సంవత్సరాల దూరం నుంచి దాటిపోతుందని నాసా అంచనా.
కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది కదా. దీనిని డీ కోడ్ చేద్దాం. వాయేజర్ 1 ప్రస్తుతం గ్లీసే 445 అనే నక్షత్రం ఉన్న డైరెక్షన్‌లో ట్రావెల్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ నక్షత్రం భూమి నుంచి 17 కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో ఉంది. వాయేజర్ 1 మరో 40 వేల సంవత్సరాల తర్వాత దాని దగ్గరగా వెళ్తుంది. అప్పుడు కూడా ఆ నక్షత్రానికి సుమారు 1.7 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు అది ఇదే స్థాయిలో పని చేస్తుందా? లేదా? అనేది డౌటే కదా.
ఈ స్పేస్ షిప్‌లో మరో రికార్డ్ కూడా ఉంది. 12 అంగుళాల బంగారు పూత పూసిన రాగి డిస్క్‌ను వాయేజర్ 1తో పాటు పంపించారు. ఎప్పుడైనా విశ్వంలో మనలానే ఎవరైనా స్పేస్‌షిప్‌ను పంపి.. వారు వాయేజర్ వన్‌ను గుర్తిస్తే.. భూమి గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. అందులో 55 భాషల్లో మెసేజ్‌లు ఉంటాయి. మ్యూజిక్, మన వాతావరణంలో ప్రకృతి చేసే సౌండ్స్, మనుషులు, జంతువులు, భూమిపై జీవన విధానాన్ని వివరించే ఫోటోలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. భూమి అనే గ్రహం నుంచి విశ్వానికి మనిషి పంపిన ఒక ఇంట్రడక్షన్ లెటర్ అది.
Also Read: భూమిని కుళ్లుకునేలా చేస్తున్న గ్రహం.. చుట్టూ ఏకంగా 285 చందమామలు.. అక్కడంతా వెన్నెల మయం!
మీకు ఇంకో విషయం తెలుసా.. 1977లోనే వాయేజర్ 2 అనే మరో స్పేస్ షిప్ కూడా తన జర్నీని స్టార్ట్ చేసింది. ప్రస్తుతం అది కూడా ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లోనే ఉంది. అయితే వాయేజర్ 1 కంటే వెనక ఉంది. అది వన్ లైట్ డే దూరాన్ని చేరుకోవడానికి 2035 వరకు సమయం పట్టవచ్చనేది నాసా అంచనా. 1977లో భూమి నుంచి బయలుదేరిన ఒక చిన్న స్పేస్ షిప్.. దాదాపు 50 ఏళ్ల తర్వాత కూడా మనిషికి అంతరిక్ష రహస్యాలను పంపిస్తూనే ఉంది. మనిషి పంపిన మెసేజ్‌ను తనలో దాచుకుని.. భూమికి దూరంగా, నక్షత్రాల మధ్య ఒంటరిగా ప్రయాణిస్తోంది. దాని గమ్యం ఏంటో మనకు తెలియదు. ఎప్పటివరకు ప్రయాణిస్తుందో కూడా తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం.. వాయేజర్ 1 అనేది మనిషి మేధస్సుకు ఒక సింబాలిక్.