AI health advice risks: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే. ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్లే ఓపిక లేక, చాలా మంది క్షణాల్లో ఆన్సర్ ఇచ్చే ఏఏఐని శ్రయిస్తున్నారు. “నాకు తలనొప్పిగా ఉంది, ఏ మందు వేసుకోవాలి?”, “ఈ లక్షణాలు ఉంటే ఏ రోగం వచ్చినట్లు?” అంటూ ఏఐని డాక్టర్‌లా భావించి ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. కానీ, డాక్టర్ ని సంప్రదించకుండా కేవలం ఏఐ చెప్పే నివారణ మార్గాలను గుడ్డిగా ఫాలో అయితే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న డాటాను, ఆర్టికల్స్‌ను విశ్లేషించి సమాధానం ఇస్తుంది తప్ప, మనిషి శరీరాన్ని స్వయంగా ..పరీక్షించలేదు. ప్రతి మనిషి శారీరక తత్వం , జన్యుపరమైన అంశాలు, గత అనారోగ్య చరిత్ర వేర్వేరుగా ఉంటాయి. ఏఐకి ఈ అంశాల గురించి ఎలాంటి అవగాహన ఉండదు. ఉదాహరణకు, ఒకే రకమైన కడుపు నొప్పికి ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు కారణాలు ఉండొచ్చు. ఏఐ మాత్రం అందరికీ ఒకే రకమైన సాధారణ సమాధానాన్ని ఇస్తుంది. దీని వల్ల తప్పు మందులు వాడే ప్రమాదం ఉంది.
వ్యాధి ముదిరిపోవడం: సాధారణ లక్షణమే కదా అని ఏఐ చెప్పిన చిన్న చిట్కాలు లేదా ఓవర్-ది-కౌంటర్ మందులు వాడితే.. లోపల ఉన్న అసలు వ్యాధి ముదిరిపోయి ప్రాణాపాయానికి దారి తీస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రభావాలు): డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏఐ సూచించిన డోసేజ్ లేదా మందుల వల్ల కిడ్నీలు, లివర్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది.
భయానక అంచనాలు : చిన్న ఆరోగ్య సమస్యను కూడా ఏఐ కొన్నిసార్లు పెద్ద ప్రాణాంతక వ్యాధిగా చూపించొచ్చు. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన విపరీతంగా పెరిగిపోతాయి.
జనరల్ అవగాహన: ఆరోగ్యానికి సంబంధించిన.. సాధారణ ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు, నిద్ర వేళలు, లేదా విటమిన్ల సమాచారం తెలుసుకోవడానికి ఏఐని వాడొచ్చు.
డయాగ్నోసిస్: ఒకవేళ మీకు అనారోగ్య లక్షణాలు ఉంటే.. వాటి గురించి ఇంటర్నెట్‌లో లేదా ఏఐని అడిగి నిర్ధారణకు రాకండి. వెంటనే.. సర్టిఫైడ్ డాక్టర్‌ను సంప్రదించి, ఆయన పర్యవేక్షణలో తగిన పరీక్షలు చేయించుకోండి.
Also Read:బ్లాక్ ఫ్రైడే సేల్ 2026..ఐఫోన్లు,ఆండ్రాయిడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు,ఎప్పటినుంచంటే?
రియాలిటీ చెక్:
కొందరు ఆసుపత్రి ఫీజులు భరించలేక లేదా సమయం లేక ఏఐని ఆశ్రయిస్తుంటారు. అయితే..చిన్న అనారోగ్యానికి ఏఐని నమ్మి ఇంట్లోనే.. ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే, వ్యాధి తీవ్రమై ఆ తర్వాత పెద్ద ఆసుపత్రులలో.. లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఉదాహరణకు, ఒక సాధారణ జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్ ఫీజు రూ. 500 నుంచి రూ. 1,500 వరకు ఉంటుంది. ఈ చిన్న మొత్తాన్ని ఆదా చేసుకోవాలని చూసి, ఏఐ సలహాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. టెక్నాలజీ మన సౌలభ్యం కోసమే కానీ, మన ప్రాణాలతో చెలగాటలాడేందుకు కాదు. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఏఐని నమ్మకుండా.. అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్స పొందడమే మంచిది.