E-Paper
Advertisement

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? మీ కళ్లను కాపాడే యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే లాప్‌టాప్స్!

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? మీ కళ్లను కాపాడే యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే లాప్‌టాప్స్!
Advertisement

Best anti glare laptops 2026: ఈ రోజుల్లో ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ క్లాసులు, కోడింగ్ లేదా గేమింగ్.. ఏదైనా సరే గంటల తరబడి లాప్‌టాప్ స్క్రీన్‌ల వైపు చూడక తప్పట్లేదు. దీని వల్ల కళ్ళు అలసిపోవడం, తలనొప్పి, కంటి నుంచి నీరు కారడం లాంటి ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయాయి. ఈ సమస్యకు బెస్ట్ సొల్యూషన్ ‘యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే’ లాప్‌టాప్స్. ఇవి స్క్రీన్ రిఫ్లెక్షన్స్‌ను తగ్గించి కంటికి హాయినిస్తాయి. మీ కళ్లను సేఫ్‌గా ఉంచే 5 బెస్ట్ యాంటీ-గ్లేర్ లాప్‌టాప్స్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

కళ్లను కాపాడే.. టాప్ 5 యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే లాప్‌టాప్స్:

ఈ బిజీ లైఫ్‌లో మన కళ్లకు అస్సలు రెస్ట్ దొరకట్లేదు కదూ? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక స్క్రీన్ చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా లాప్‌టాప్స్ ముందు గంటల తరబడి కూర్చునే ఐటీ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ పడే కంటి బాధలు అన్నీ ఇన్నీ కావు. హెల్త్ అండ్ వెల్‌నెస్ టెక్నాలజీకి యూజర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే.. మీ కళ్లపై ప్రెజర్ పడకుండా చూసుకునే ఐదు బెస్ట్ యాంటీ-గ్లేర్ లాప్‌టాప్స్ లిస్ట్ మీకోసం.

Advertisement

1. Lenovo ThinkPad X1 Carbon :
బిజినెస్ క్లాస్ లాప్‌టాప్స్‌లో లెనోవో థింక్‌పాడ్ ఎప్పుడూ టాపే! దీనిలో వచ్చే యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే కళ్లకు అస్సలు స్ట్రెయిన్ ఇవ్వదు.

స్పెషాలిటీ: దీనిలో TÜV Rheinland Eyesafe సర్టిఫికేషన్ ఉంది. ఇది స్క్రీన్ నుంచి వచ్చే హానికరమైన బ్లూ లైట్‌ను తగ్గిస్తుంది.

Advertisement

ఎవరికి బెస్ట్?: లాంగ్ అవర్స్ కోడింగ్ చేసే డెవలపర్స్, రైటర్స్ అండ్ ఆఫీస్ గోయర్స్ కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

2. HP Spectre x360 14 (Eyesafe 2.0):
లుక్స్ లోనే కాదు, కళ్లను కాపాడటంలో కూడా హెచ్‌పి స్పెక్ట్రా అదరగొడుతుంది. ఇది 2-ఇన్-1 ల్యాప్‌టాప్ కావడంతో వాడుక చాలా ఈజీ.

స్పెషాలిటీ: దీనిలో Eyesafe Certified 2.0 టెక్నాలజీతో కూడిన యాంటీ-రిఫ్లెక్టివ్ స్క్రీన్ ఉంటుంది. అంతే కాకుండా ఇది కలర్ అక్యూరసీని దెబ్బతీయకుండా కంటికి ప్రొటెక్షన్ ఇస్తుంది.

ఎవరికి బెస్ట్?: క్రియేటివ్ డిజైనర్స్, ఎడిటర్స్, స్టైలిష్ లుక్ అండ్ ఐ-కేర్ రెండు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి.

3. ASUS Zenbook 14 OLED (Anti-Glare/Low Blue Light):

OLED స్క్రీన్స్ అంటేనే కలర్స్ అదిరిపోతాయి. కానీ.. అస్సస్ కేవలం కలర్స్ పైనే కాదు ఐ-సేఫ్టీ పైన కూడా ఫోకస్ పెట్టింది.

స్పెషాలిటీ: ఈ ల్యాప్‌టాప్‌లో హార్డ్‌వేర్ లెవెల్ బ్లూ లైట్ రిడక్షన్ ఉంటుంది. ఇది సాఫ్ట్‌వేర్ ఫిల్టర్స్ లాగా స్క్రీన్‌ను ఎల్లోయిష్‌గా మార్చకుండా.. కళ్లను కాపాడుతుంది. దీని యాంటీ-గ్లేర్ ఫినిషింగ్ రిఫ్లెక్షన్స్‌ని బాగా తగ్గిస్తుంది.

ఎవరికి బెస్ట్?: ఎక్కువ సేపు మూవీస్ చూసేవారికి, ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్‌కి ఇది బెస్ట్.

4. Acer Swift 16 AI:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఫీచర్స్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్ మీ కంటి ఆరోగ్యాన్ని కూడా స్మార్ట్‌గా చూసుకుంటుంది.

స్పెషాలిటీ: దీనిలో Acer VisionCare 4.0 , BlueLightShield Pro ఫీచర్స్ ఉన్నాయి. రూమ్ లో ఉన్న లైటింగ్‌ను బట్టి ఇది స్క్రీన్ బ్రైట్‌నెస్‌ని, కలర్ టెంపరేచర్‌ని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది.

ఎవరికి బెస్ట్?: లేటెస్ట్ ఏఐ ఫీచర్స్ వాడుతూ, హెల్త్ కి ప్రయారిటీ ఇచ్చే మోడ్రన్ యూజర్స్ కోసం ఫర్ఫెక్ట్.

5. Dell Latitude 16:
డెల్ బ్రాండ్ నుంచి వచ్చే నమ్మకమైన ల్యాప్‌టాప్ ఇది. వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉండే వారికి ఇది బెస్ట్ కంపానియన్.

స్పెషాలిటీ: దీని ComfortView Plus ఫీచర్ ఎల్లప్పుడూ ఆన్ లో ఉండే లో-బ్లూ-లైట్ టెక్నాలజీ. దీని మేట్ ఫినిష్ స్క్రీన్ ఎండలో లేదా ఎక్కువ లైటింగ్ ఉన్న రూమ్స్ లో కూడా స్క్రీన్ క్లియర్ గా కనిపించేలా చేస్తుంది.

ఎవరికి బెస్ట్?: కార్పొరేట్ ఎంప్లాయ్స్, మేనేజర్స్ కి ఇది బెస్ట్.

Also Read: అమ్మాయిల కోసమే స్పెషల్ వాచ్! నెక్స్ట్ లెవెల్ లుక్‌తో.. Noise Diva 2 లాంచ్!

ప్రో టిప్ : యాంటీ-గ్లేర్ ల్యాప్‌టాప్ వాడుతున్నప్పటికీ, ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూసే 20-20-20 రూల్ ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు.

ల్యాప్‌టాప్ పర్ఫార్మెన్స్ ఎంత ముఖ్యమో.. మన కళ్ల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కాబట్టి, నెక్స్ట్ టైమ్ ల్యాప్‌టాప్ కొనేటప్పుడు కేవలం ర్యామ్, ప్రాసెసర్ మాత్రమే కాదు.. యాంటీ-గ్లేర్, బ్లూ-లైట్ ఫిల్టర్ ఫీచర్స్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి.

Related News

బ్లాక్‌బస్టర్ డీల్.. Samsung Galaxy S26 Ultraపై ఎగిరి గంతేసే భారీ డిస్కౌంట్.. వెంటనే కొనేయండి!

కొత్త Smart TV కొంటున్నారా? షాప్‌కు వెళ్లేముందు ఈ 3 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!

రూ.7,000 లోపే కెమెరా ఉన్న హెడ్‌ఫోన్స్.. లైవ్ ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ కూడా!

Google Pixel 11 Pro Fold ధర లీక్.. పాత మోడల్‌పై ఏకంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్!

యాపిల్ షాకింగ్ నిర్ణయం.. భారీగా పడిపోయిన iPhone Air.. అసలు కారణం ఇదేనా?

ఆ బ్రాండ్స్ నుంచి కేక పుట్టించే ఫీచర్లతో కొత్త ఫోన్లు.. జులై 15 నుంచి సేల్స్ షురూ!

మిలిటరీ గ్రేడ్ మన్నిక, సూపర్ AI ఫీచర్లు.. తక్కువ ధరలోనే వివో నుంచి నయా 5G స్మార్ట్‌ఫోన్!

Big Stories

Advertisement
×