E-Paper
Advertisement

కళ్లుచెదిరే ట్రాన్స్‌పరెంట్ లుక్, 48 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీతో JBL Tune Buds 3 లాంచ్.. ధర ఎంతంటే?

కళ్లుచెదిరే ట్రాన్స్‌పరెంట్ లుక్, 48 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీతో JBL Tune Buds 3 లాంచ్.. ధర ఎంతంటే?
Advertisement

JBL Tune Buds 3: టెక్ ప్రియులను ఆకట్టుకోవడానికి ప్రముఖ ఆడియో బ్రాండ్ జేబీఎల్ (JBL) ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. తాజాగా తమ పాపులర్ ‘ట్యూన్ బడ్స్ 3’ (JBL Tune Buds 3) ఇయర్‌ఫోన్స్‌ను సరికొత్త ట్రాన్స్‌లూసెంట్ (పారదర్శక) డిజైన్‌తో చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఇయర్‌బడ్స్, ఛార్జింగ్ కేస్ లోపలి భాగాలు బయటకు కనిపించేలా ఉండటం వీటి ప్రధాన ఆకర్షణ. మంచి సౌండ్ క్వాలిటీతో పాటు స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఇవి బాగా నచ్చుతాయి. డిసెంబర్ నెలలో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

చైనాలోని ప్రముఖ ఈ-కామర్స్ సైట్ JD.comలో ఈ కొత్త ఇయర్‌బడ్స్ లిస్ట్ అయ్యాయి. భారత కరెన్సీ ప్రకారం వీటి ధర రూ.10,100గా ఉంది. డిసెంబర్ 3 నుంచి వీటి విక్రయాలు మొదలుకానున్నాయి. డీప్ బ్లాక్, మూన్ వైట్, జేడ్ (ఆకుపచ్చ) అనే మూడు రంగుల్లో ఇవి లభిస్తాయి. వైట్ వేరియంట్ ఛార్జింగ్ కేస్ మూత నిగనిగలాడే ఫినిషింగ్‌తో ఉంటే.. జేడ్ కలర్ మాత్రం పూర్తిగా పారదర్శకమైన గ్రీన్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. అయితే వీటిని ఇతర దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Advertisement

ఈ లేటెస్ట్ వేరియంట్‌లో ఇయర్‌బడ్స్, ఛార్జింగ్ కేస్ రెండింటికీ పారదర్శకమైన ఔటర్ షెల్ ఇచ్చారు. దీనివల్ల లోపల ఉండే హార్డ్‌వేర్ భాగాలు కొంతవరకు బయటకు కనిపిస్తూ ప్రీమియం లుక్ ఇస్తాయి. ఒక్కో ఇయర్‌బడ్ కేవలం 5.9 గ్రాముల బరువు మాత్రమే ఉండటం వల్ల చెవులకు చాలా తేలికగా అనిపిస్తాయి. ఛార్జింగ్ కేస్ బరువు 40 గ్రాములుగా ఉంది. అంతేకాకుండా దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం వీటికి IP54 రేటింగ్ కూడా ఇచ్చారు.

Also Read: వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. విదేశాల్లోనూ పాత నంబర్‌తోనే ఇంటర్నెట్ వాడొచ్చు, ఎలాగంటే?

Advertisement

మంచి మ్యూజిక్ అనుభూతి కోసం ఇందులో 10mm డైనమిక్ డ్రైవర్లను ఉపయోగించారు. హర్మాన్ (Harman) భాగస్వామ్యంతో ట్యూన్ చేయడం వల్ల ఎలాంటి డిస్టార్షన్ లేకుండా క్లియర్ సౌండ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. యూజర్లు తమ అభిరుచికి తగ్గట్టుగా ఆడియోను మార్చుకోవడానికి ‘పర్సోని-ఫై 3.0’ (Personi-Fi 3.0) ఫీచర్ ఉంది. బయటి శబ్దాలను తగ్గించే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) కోసం నాలుగు మైక్రోఫోన్లు ఇచ్చారు. లేటెస్ట్ బ్లూటూత్ 6.0 సపోర్ట్ ఉండటం దీని మరో ప్రత్యేకత.

బ్యాటరీ విషయంలో ఈ ఇయర్‌బడ్స్ ఏమాత్రం నిరాశపరచవు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల వరకు నాన్‌స్టాప్‌గా పనిచేస్తాయి. ఒకవేళ ANC ఆన్ చేసి వాడితే 10 గంటల బ్యాకప్ వస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపితే ఏకంగా 48 గంటల ప్లేబ్యాక్ టైమ్ లభిస్తుంది. అత్యవసర సమయాల్లో కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 4 గంటల పాటు పాటలు వినొచ్చు. పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది.

Also Read: ఛార్జింగ్ టెన్షన్ ఉండదిక.. జంబో బ్యాటరీతో రాబోతున్న Infinix Smart Power 5G ఫోన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Tags

Related News

వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. విదేశాల్లోనూ పాత నంబర్‌తోనే ఇంటర్నెట్ వాడొచ్చు, ఎలాగంటే?

ఛార్జింగ్ టెన్షన్ ఉండదిక.. జంబో బ్యాటరీతో రాబోతున్న Infinix Smart Power 5G ఫోన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

వాట్సప్ యూజర్లకు CERT-In హై అలర్ట్.. ఈ వెర్షన్లు వాడుతున్నారా? వెంటనే అప్‌డేట్ చేసుకోండిలా!

ఒకటి పవర్‌ఫుల్ ప్రాసెసర్, మరొకటి కెమెరా కింగ్.. 2027లో వైడ్-స్క్రీన్ డిజైన్‌తో ఒప్పో నుంచి 3 కొత్త ఫోన్లు!

మీ ఇంటి గోడే..ఇక 500 ఇంచుల సినిమా థియేటర్!

స్టైలిష్ ఓపెన్-ఇయర్ బడ్స్ లాంచ్..లుక్ మాములుగా లేదు

మీ ల్యాప్‌టాప్ స్క్రీన్ క్లీనింగ్‌లో..ఈ మిస్టేక్ అస్సలు చేయెద్దు!

Big Stories

Advertisement
×