E-Paper
Advertisement

వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. విదేశాల్లోనూ పాత నంబర్‌తోనే ఇంటర్నెట్ వాడొచ్చు, ఎలాగంటే?

వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. విదేశాల్లోనూ పాత నంబర్‌తోనే ఇంటర్నెట్ వాడొచ్చు, ఎలాగంటే?
Advertisement

International Travel eSIM: విదేశాల్లో అడుగుపెట్టగానే ఇంటర్నెట్ కోసం ఎయిర్‌పోర్ట్‌లో కొత్త సిమ్ కొనాలా, లేక ఖరీదైన రోమింగ్ ప్యాక్ వేయించుకోవాలా అనే గందరగోళం ఇక అక్కర్లేదు. ప్రయాణికులకు ఈ తిప్పలు తప్పించేందుకు వాట్సప్ ఒక కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇకపై మీరు వెళ్లే దేశానికి సంబంధించిన డేటా eSIMను నేరుగా వాట్సప్ యాప్‌లోనే కొని, ఫోన్‌లో యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఫ్లైట్ దిగిన వెంటనే ఇంటర్నెట్ వాడటం చాలా సులభం కానుంది.

వాట్సప్‌లోనే eSIM కొనుగోలు:

ప్రయాణికులు విదేశాలకు వెళ్లినప్పుడు తమ ప్రయాణ వివరాలను, బోర్డింగ్ పాస్‌లను కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి వాట్సప్‌నే ఎక్కువగా వాడుతుంటారు. అలాంటిది విమానం దిగగానే డేటా లేకపోతే ఇబ్బందే కదా. అందుకే కేవలం కొన్ని ట్యాప్‌లతో యాప్‌లోనే డేటా eSIM కొనుక్కునేలా వాట్సప్ ఈ కొత్త ఆప్షన్‌ను రూపొందిస్తోంది.

జియో, వెరిజోన్ భాగస్వామ్యం:

Advertisement

ఈ కొత్త సేవలను ప్రయాణికులకు చేరువ చేయడానికి వాట్సప్ ఇప్పటికే ప్రపంచంలోని దిగ్గజ టెలికాం సంస్థలతో జతకట్టింది. ముఖ్యంగా మన దేశం నుంచి రిలయన్స్ జియోతో పాటు, విదేశాలకు చెందిన వెరిజోన్, స్మార్ట్ ఆక్సియాటా, స్మార్ట్ కమ్యూనికేషన్స్ వంటి నెట్‌వర్క్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు వాట్సాప్ హెడ్ కునాల్ షా వెల్లడించారు. అయితే, ఈ డేటా ప్లాన్ల ధరలు ఎంత ఉంటాయి, ఏయే దేశాల్లో ముందుగా అందుబాటులోకి వస్తాయనే వివరాలను సంస్థ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Advertisement

Also Read: ఛార్జింగ్ టెన్షన్ ఉండదిక.. జంబో బ్యాటరీతో రాబోతున్న Infinix Smart Power 5G ఫోన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

పాత నంబర్‌తోనే వాట్సప్:

సాధారణంగా కొత్త సిమ్ వేసుకుంటే వాట్సప్ నంబర్ మారిపోతుందనే భయం ఉంటుంది. కానీ ఈ ట్రావెల్ eSIM ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత కూడా, మీరు మీ పాత ఫోన్ నంబర్‌తోనే వాట్సప్‌ను యథావిధిగా వాడుకోవచ్చు. నంబర్ మార్చుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు.

త్వరలోనే అందుబాటులోకి కొత్త ఫీచర్:

ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌కు సంబంధించిన సంకేతాలు ఇప్పటికే కనిపించాయి. గమ్యస్థానాన్ని బట్టి రీజనల్, గ్లోబల్ ప్లాన్లతో పాటు అన్‌లిమిటెడ్ డేటా ఆప్షన్లు కూడా ఇందులో ఉండనున్నాయి. త్వరలోనే ఎంపిక చేసిన దేశాల్లో ఈ సేవలను ప్రారంభించనున్నట్లు వాట్సప్ హెడ్ కునాల్ షా తెలిపారు. అయితే ప్లాన్ల ధరల వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు.

Also Read:

Tags

Related News

ఛార్జింగ్ టెన్షన్ ఉండదిక.. జంబో బ్యాటరీతో రాబోతున్న Infinix Smart Power 5G ఫోన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

వాట్సప్ యూజర్లకు CERT-In హై అలర్ట్.. ఈ వెర్షన్లు వాడుతున్నారా? వెంటనే అప్‌డేట్ చేసుకోండిలా!

ఒకటి పవర్‌ఫుల్ ప్రాసెసర్, మరొకటి కెమెరా కింగ్.. 2027లో వైడ్-స్క్రీన్ డిజైన్‌తో ఒప్పో నుంచి 3 కొత్త ఫోన్లు!

మీ ఇంటి గోడే..ఇక 500 ఇంచుల సినిమా థియేటర్!

స్టైలిష్ ఓపెన్-ఇయర్ బడ్స్ లాంచ్..లుక్ మాములుగా లేదు

మీ ల్యాప్‌టాప్ స్క్రీన్ క్లీనింగ్‌లో..ఈ మిస్టేక్ అస్సలు చేయెద్దు!

సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొంటున్నారా? బ్యాటరీ చెక్ చేయకుండా డీల్ ఓకే చేయకండి!

Big Stories

Advertisement
×