Offer on Bluetooth Speakers in Amazon Mega Electronic Days Sale 2024: చాలా మంది అదిరిపోయే క్వాలిటీతో మంచి సౌండింగ్‌ను అందించే బెస్ట్ బ్లూటూత్ స్పీకర్‌లను కొనుక్కోవాలని అనుకుంటారు. బయట సమావేశాల్లో, ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్నప్పుడు కానీ, ఇంటి చుట్టు పక్కలా పనులు చేస్తున్నప్పుడు మంచి సాంగ్‌లతో హుషారుగా పనిచేయాలని ఇష్టపడతారు. అందులోనూ వైర్‌లెస్, పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌లు అంటే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
ఎందుకంటే దాన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లొచ్చు. అందువల్లనే దీన్ని కొనేందుకు ఇష్టపడుతుంటారు. కానీ వాటి ధరలు కూడా రూ.2000 లకు పైగా ఉండటంతో తమ ప్లాన్‌ను మార్చుకుంటుంటారు. అందువల్ల ఎప్పట్నుంచో దీన్ని కొనుక్కోవాలనే కోరికతో ఉన్నవారు ఇప్పుడు అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్ జరుగుతోంది. అందులో బ్లూటూత్ స్పీకర్లపై అదిరిపోయే ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
BoAt Stone 135 Portable Wireless Speaker
boAt Stone 135 స్పీకర్ దాని 5W RMS అవుట్‌పుట్‌తో అదిరిపోయే ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఫంక్షనాలిటీతో, రెండు స్టోన్ 135 స్పీకర్‌లను యాంప్లిఫైడ్ సౌండ్ కోసం లింక్ చేయబడింది. ఈ స్పీకర్ బ్యాటరీ లైఫ్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 80 శాతం వాల్యూమ్‌తో 11 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. మన్నిక కోసం రూపొందించబడింది అని కంపెనీ చెబుతోంది. ఇది IPX4 రేటింగ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా వాటర్ స్ప్లాష్‌లకు నిరోధకతను కలిగిస్తుంది. వివిధ వాతావరణాలకు అనుకూలంగా ఉంటుంది. అదనంగా, స్టోన్ 135 బ్లూటూత్, FM మోడ్, TF కార్డ్‌తో సహా బహుముఖ కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంది. దీని ధర అమెజాన్‌లో రూ.999గా ఉంది.
Also Read: రూ. 1000లోపు టాప్ 5 బ్లూటూత్ స్వీకర్లు.. ధర తక్కువ సౌండ్ ఎక్కువ
Zebronics ZEB-COUNTY 3W Wireless Bluetooth Portable Speaker
Zebronics ZEB-COUNTY అనేది బ్లూటూత్, USB, మైక్రో SD, AUXతో సహా అనేక కనెక్టివిటీ ఎంపికలను అందించే బహుముఖ పోర్టబుల్ స్పీకర్. ఇది అనుకూలమైన కాల్ ఫంక్షన్, ఇంటిగ్రేటెడ్ FM రేడియోను కలిగి ఉంటుంది. ఈ స్పీకర్ ఇంపెడెన్స్ 120Hz నుండి 15kHz వరకు ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన పరిధితో 4Ω వద్ద రేట్ చేయబడింది. దీనికి 2.5 గంటల ఛార్జింగ్ సమయం అవసరం. ఈ ఛార్జింగ్‌తో సుమారు 10 గంటల ప్లేబ్యాక్‌ని అందిస్తుంది. ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది. FM కనెక్టివిటీ కోసం, స్పీకర్‌ను FM మోడ్‌కి మార్చాలి. మైక్రో USB కేబుల్‌ని దాని పోర్ట్‌కి కనెక్ట్ చేయాలి. అమెజాన్‌లో దీని ధర రూ.497గా ఉంది.
Portronics SoundDrum1 10W TWS Portable Bluetooth 5.3Speaker
పోర్ట్‌రోనిక్స్ సౌండ్‌డ్రమ్ 1 అనేది 10W పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్. ఇది దాని శక్తివంతమైన బాస్ సౌండ్ అవుట్‌పుట్‌కు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది ఏ సమావేశాల్లోనైనా ఆడియో అనుభవాన్ని మెరుగుపరచడానికి అనువైన ఎంపిక. ఇది ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) టెక్నాలజీకి ఉదాహరణగా ఉంది. వినియోగదారులు అద్భుతమైన అనుభూతిని పొందేందుకు స్టీరియో సౌండ్ కోసం ఏకకాలంలో రెండు స్పీకర్‌లను జత చేయడానికి అనుమతిస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ. 888గా ఉంది. మంచి బేస్ సౌండ్‌ను ఇష్టపడేవారికి ఇదొక చక్కటి ఎంపికగా చెప్పొచ్చు.