Lokhandwala Junction Renamed as Sridevi Junction: ప్రముఖ సినిమా హీరోయిన్ శ్రీదేవి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆమె అంతలా పాపులర్ అయ్యింది. దాదాపుగా అన్ని భాషల్లో ఆమె నటించింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆమె అభిమానులు దేశవ్యాప్తంగా ఉంటారు. తెలుగులో కూడా చాలా ఎన్నో సినిమాల్లోనే నటించింది. అతిలోక సుందరి అంటూ ఈమెను తెలుగు ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారు. తన అద్భుతమైన ప్రదర్శనతో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తరువాత బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను వివాహం చేసుకుని ముంబైలో సెటిల్ అయ్యింది.
అనుకోకుండా ఆమె 2018లో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే, అభిమానులు, ప్రేక్షకులు ఆమె సినిమాలు చూసినప్పడుల్లా ఆమెను ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. తాజాగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ శ్రీదేవి గౌరవార్థం.. మంబైలోని ఓ చౌరస్తాకు ఆమె పేరు పెట్టారంటా. ముంబైలోని లోఖండ్ వాలా కాంప్లెక్స్ ని శ్రీదేవి కపూర్ చౌక్ గా పేరు మార్చారంటా. అయితే, శ్రీదేవి గతంలో ఈ రోడ్డులోనే నివసించేందంటా. ఆమె అంతిమ యాత్ర కూడా ఆ రోడ్డు గుండానే జరిగిందని, ఆమె జ్ఞాపకార్థంగా ఆ జంక్షన్ కు శ్రీదేవి కపూర్ చౌక్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు, సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మొగిలయ్యకు సాయం చేసిన బుల్లితెర నటి
కాగా, చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన శ్రీదేవి తెలుగు, తమిళం, హిందీ, మళయాళం మరియు కన్నడ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అగ్నిపరీక్ష, నా తమ్ముడు, శ్రీమంతుడు, బడి పంతులు, బాలభారతం, అనురాగాలు, వేటగాడు, ఆటగాడు, ఘరానా దొంగ, ఆకలి రాజ్యం, ప్రేమాభిషకం, అందగాడు, ముద్దుల మొగడు, వజ్రాయుధం, జయం మనదే, జగదేక వీరుడు అతిలోక సుందరి, క్షణం క్షణం తోపాటు మరికొన్ని సినిమాల్లో ఆమె నటించింది.