Intinti Ramayanam Meenaakshi : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటివరకు ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను పలకరించాయి.. ఇటీవల కాలంలో వచ్చిన సీరియల్స్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటూ మంచి రేటింగ్ ని నమోదు చేసుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ లో నటిస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా తమ నటనకి 100శాతం న్యాయం చేస్తూ వస్తున్నారు. అయితే రీసెంట్గా కొత్త క్యారెక్టర్ ఇందులో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఆ క్యారెక్టర్ పేరు మీనాక్షి అయితే ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆతృత కనబరుస్తున్నారు. మరి ఒక్కరోజు రెమ్యూనరేషన్ఎంత తీసుకుంటుంది అన్నది మనం ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం లో కమల్ కి జోడిగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మీనాక్షి అసలు పేరు తులసి కృష్ణ.. ఈయన గురించి గతంలో ఎన్నో సార్లు చెప్పుకున్నాము. ఈ తులసి కృష్ణ ఇప్పటికే పలు సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. గతంలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.. ఆ సీరియల్ లో రోహిణి పాత్రలో నటించిన తులసి కృష్ణ కొన్ని అనివార్య కారణాల వల్ల సీరియల్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ సీరియల్ లో నటిస్తున్నందుకు మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది.. ఒక్క రోజుకు గాను దాదాపు 35 వేలకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటూ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ముద్దుగుమ్మల్లో ఏమి కూడా చేరిపోయింది. గతంలో ఈమె చేసిన సీరియల్స్ కంటే ఈ సీరియల్ కి ఎక్కువగానే తీసుకుంటుంది అని టాక్ వినిపిస్తుంది..
ఇంటింటి రామాయణం సీరియల్ స్టోరీ విషయానికొస్తే ప్రస్తుతం పల్లవికి విడాకులు ఇవ్వాలని కమల్ ఫిక్స్ అవుతాడు. అయితే పల్లవి ఎలాగైనా సరే కమలిని మళ్ళీ సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. చూస్తుంటే కమల్ విడాకులు ఇచ్చి మీనాక్షి తో ప్రేమలో పడేలా కనిపిస్తున్నాడు. అయితే త్వరలోనే కమల్ మీనాక్షి ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్తారని స్టోరీ అర్థమవుతుంది.. ఒకవేళ ఇదే కనుక జరిగితే పల్లవి సీరియల్ నుంచి తప్పుకునేలా ఉంది అని టాక్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి పల్లవి ఈ సీరియల్ నుంచి తప్పుకుంటే కొత్తగా మరొక విలన్ ఎవరు ఎంట్రీ ఇస్తారన్న ఆలోచన కూడా ప్రేక్షకుల్లో వినిపిస్తుంది. ఏది ఏమైనా కూడా పల్లవి క్యారెక్టర్ కనిపించకపోతే సీరియల్ లో ట్విస్టులు ఏమీ ఉండవని అభిమానులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. మరి నెక్స్ట్ స్టోరీ లో ఎలాంటి ట్విస్టులు డైరెక్టర్ ఇస్తాడు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.