BigTV English

iPhone : ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే అప్డేట్.. దిగివస్తున్న ఆపిల్ ధరలు 

iPhone : ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే అప్డేట్.. దిగివస్తున్న ఆపిల్ ధరలు 

iPhone : ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లేటెస్ట్ అప్​డేట్ వచ్చేసింది. త్వరలోనే ఐఫోన్​ స్పెషల్ ఎడిషన్​ మార్కెట్లోకి రానుంది. హోమ్‌ బటన్‌ లేకుండా ఈ మొబైల్స్ ను తీసుకొచ్చేందుకు ఆపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా తక్కువ ధరలోనే ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలు సైతం తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.


ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం యాపిల్ రిలీజ్ చేసే ఐఫోన్లకు మార్కెట్లో ఉన్న క్రేజే వేరు. ఈ కంపెనీ లాంఛ్ చేసే ప్రొడెక్ట్స్ కోసం టెక్ ప్రియులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐఫోన్​లో కొత్త సిరీస్, మోడల్స్ రాగేనే ఆర్డర్స్ సైతం అదే స్థాయిలో ఊపందుకుంటాయి. అయితే ఆపిల్ ప్రొడక్ట్స్ ఎంత హాట్ కేక్స్ లా అమ్ముడైపోయినా ధర కాస్త ఎక్కువ అనే మాట వాస్తవమే. అయితే వేలల్లో మెుదలై లక్షల్లో ఉండే ఐఫోన్ ధరలను ప్రస్తుతం తగ్గించి సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావటానికి ఆపిల్ కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. తక్కవ ధరలో ఐఫోన్ ES మోడల్​ను తీసుకొచ్చేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. కాగా వచ్చే ఏడాది ఈ మొబైల్​ను లాంఛ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా టెక్ వర్గాలు తెలుపుతున్నాయి.

యాపిల్‌ లో ఐఫోన్లకే కాదు.. ఎస్‌ఈ మోడల్ మెుబైల్స్ కు సైతం క్రేజ్‌ ఎక్కువగానే ఉంటుంది. కాంపాక్ట్‌ సైజ్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉన్న ఈ ఈ స్పెషల్‌ ఎడిషన్లకు సెపరేట్‌ ఫ్యాన్‌బేస్‌ కూడా ఉంది. తక్కువ ధరలోనే ఫోన్స్ ఐఫోన్ కొనాలి అనుకునే కస్టమర్స్ కోసం ఆపిల్ ఎస్‌ఈ మోడళ్లను తీసుకొస్తూ ఉంటుంది. నిజానికి ఇప్పటి వరకూ ఈ కంపెనీ నుంచి మూడు ఎస్‌ఈ మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. 2016, 2020, 2022లో ఈ ఫోన్స్ ను తీసుకువచ్చినా.. మళ్లీ ఇప్పటివరకూ ఈ మోడల్‌ అందుబాటులోకి రాలేదు.


READ MORE : కిర్రాక్ ఫీచర్స్ తో అదిరిపోయే మెుబైల్ ను లాంఛ్ చేసిన మోటోరోలా

అయితే ప్రస్తుతం కొత్త ఐఫోన్ ఎస్‌ఈ మోడల్‌ను వీ59 అనే కోడ్‌ నేమ్‌తో రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వచ్చే ఏడాది తీసుకురాబోయే ఐప్యాడ్‌ ఎయిర్‌ మోడళ్లతో పాటు ఈ అప్డేటెడ్ ఈఎస్ ను లాంచ్‌ చేయాలని ప్రయత్నాలు మెుదలుపెట్టినట్లు సమాచారం. ఈ ఫోన్స్ లో 5జీని సైతం జోడించటమే కాకుండా పాత మోడల్స్ లో ఉన్న హోమ్‌ బటన్‌ను మార్చేస్తూ ఎడ్జ్‌ టు ఎడ్జ్‌ స్క్రీన్‌ తీసుకురావాలని ఆపిల్ ప్రయత్నాలు చేస్తుందట.

ఐఫోన్‌ 16 సిరీస్‌లో ఉన్నట్లే రాబోయో SE మెుబైల్స్ సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(AI)ను యాడ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక 2022లో వచ్చిన ఎస్‌ఈ మోడల్‌ను ఐఫోన్‌ 8 డిజైన్ లో తీసుకురాగా.. రాబోయో మోడల్ ఐఫోన్‌ 14ను డిజైన్ లో రాబోతుందనే వార్తులు వినిపిస్తున్నాయి.

అయితే వచ్చే ఏడాది రాబోతున్న యాపిల్ ఐప్యాడ్‌ ఎయిర్‌ మోడల్స్ ను జే607, జే637 కోడ్‌ నేమ్స్‌తో రూపొందించనున్నట్లు తెలుస్తుంది. మ్యాజిక్‌ కీబోర్డ్స్ తో పాటూ మ్యాక్‌ కంప్యూటర్‌ లైనప్‌ను సైతం యాపిల్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఆపిల్ నుంచి ఎలాంటి అప్డేట్ రాబోతుందో.

Related News

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Galaxy S24 FE: గెలాక్సీ S24 FE పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయాలా?

Realme P3 5G Launched: రియల్‌ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!

iOS 26 Downgrade: కొత్త iOS 26‌తో ఐఫోన్లలో తీవ్ర సమస్యలు.. పాత iOSకు ఇలా డౌన్‌గ్రేడ్ చేయండి

Google Storage: మీ గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? ఇలా చేస్తే క్షణాల్లో సగం ఖాళీ అవుతుంది!

Flipkart vs Amazon iPhone: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ ఆఫర్లలో ఏది బెస్ట్?

Jio Keypad 5G: స్మార్ట్‌ఫోన్‌లకు షాక్.. జియో కీప్యాడ్ 5జి కొత్త రికార్డు

Big Stories

×