E-Paper
Advertisement

Airtel జాక్‌పాట్ ప్లాన్.. రూ.598కే నెట్ ఫ్లిక్స్, అపరిమిత 5G.. జీ5, హాట్ స్టార్ సైతం ఉచితం!

Airtel జాక్‌పాట్ ప్లాన్.. రూ.598కే నెట్ ఫ్లిక్స్, అపరిమిత 5G.. జీ5, హాట్ స్టార్ సైతం ఉచితం!
Advertisement

Airtel Recharge Plan: ఈ రోజుల్లో ఫ్రీ కాల్స్ కోసం మాత్రమే రీఛార్జ్ చేసుకునేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కాల్స్ తో పాటు అధిక డేటా, ఫ్రీ ఓటీటీ సబ్ స్క్రిప్షన్లకు స్మార్ట్ ఫోన్ యూజర్లు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిని గమనించిన టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్.. తమ యూజర్ల కోసం పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. రూ.598కే లభించే ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు దిమ్మతిరిగే బెనిఫిట్స్ అందనున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.

రూ.598 ప్లాన్ ప్రత్యేకతలు..

ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీనిద్వారా యూజర్లకు ప్రతీ రోజూ 2GB డేటా లభించనుంది. అంటే ప్లాన్ గడువు పూర్తయ్యే సరికి 56GB డేటాను యూజర్లు వినియోగించుకోవచ్చు. వీటికి తోడు దేశంలోని ఏ నెట్ వర్క్ కు అయిన అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకునే వెసులుబాటు ఎయిర్ టెల్ కల్పించింది.

ఉచితంగా నెట్ ఫ్లిక్స్

Advertisement

రూ.598 రీఛార్జ్ ప్లాన్లలో ఫ్రీ ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు హైలెట్ గా నిలుస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ (Netflix Basic), జియో హాట్ స్టార్, జీ5 ఓటీటీలకు ఉచితంగా యాక్సెస్ లభించనుంది. అలాగే 28 రోజుల పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం (Airtel Xstream Premium) సేవలను సైతం ఎయిర్ టెల్ అందిస్తోంది. రోజూ సినిమాలు, వెబ్ సిరీస్ లు, లైవ్ టీవీ షోలు చూసేవారికి ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎయిర్ టెల్ వర్గాలు చెబుతున్నాయి.

ఏడాదిపాటు అడోబ్ సేవలు

ఈ రూ. 598 రీఛార్జ్‌తో 12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం (Adobe Express Premium) సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభించనుంది. దీని విలువ సుమారు రూ.4000 వరకూ ఉంటుందని ఎయిర్ టెల్ వర్గాలు చెబుతున్నాయి. దీని సహాయంతో సోషల్ మీడియా పోస్టులు, ప్రమోషనల్ బ్యానర్లు, పోస్టర్లు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చని సూచిస్తున్నాయి.

Advertisement

Also Read: భూమిని కుళ్లుకునేలా చేస్తున్న గ్రహం.. చుట్టూ ఏకంగా 285 చందమామలు.. అక్కడంతా వెన్నెల మయం!

అన్‌లిమిటెడ్ 5G డేటా

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లో అపరిమిత 5G డేటాను ఎయిర్ టెల్ ఆఫర్ చేస్తోంది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధిస్తాయని ఎయిర్ టెల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆఫర్ ఉపయోగించుకోవడానికి యూజర్ల దగ్గర 5G స్మార్ట్‌ఫోన్ ఉండటంతో పాటు ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉండాలి. అయితే ప్లాన్ లోని 2GB డేటాకు అదనంగా ఈ 5G అన్ లిమిటెడ్ డేటా లభించనుండటం విశేషం.

Also Read: జియోలో పండగలాంటి ప్లాన్.. ఏడాది పాటు డైలీ 2.5GB డేటా.. కాల్స్, హాట్‌స్టార్, కాన్వా ప్రో ఫ్రీ!

Tags

Related News

జియోలో పండగలాంటి ప్లాన్.. ఏడాది పాటు డైలీ 2.5GB డేటా.. కాల్స్, హాట్‌స్టార్, కాన్వా ప్రో ఫ్రీ!

భూమిని కుళ్లుకునేలా చేస్తున్న గ్రహం.. చుట్టూ ఏకంగా 285 చందమామలు.. అక్కడంతా వెన్నెల మయం!

చాట్‌జిపిటి ప్లస్ ఏడాది పాటు ఫ్రీ..వారికి ఓపెన్‌ఏఐ బంపర్ ఆఫర్!

బ్లాక్ ఫ్రైడే సేల్ 2026..ఐఫోన్లు,ఆండ్రాయిడ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు,ఎప్పటినుంచంటే?

పవర్‌ఫుల్ పార్టీ స్పీకర్ వచ్చేసింది! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

మీ కిచెన్‌కి ఏ మిక్సర్ గ్రైండర్ బెటర్? 500W, 750W లేదా 1000Wలలో ఏది కొనాలి!

సాదాసీదా సౌండ్‌కి గుడ్‌బై చెప్పండి..ఈ హెడ్‌ఫోన్స్‌తో మ్యూజిక్ ఫీల్ నెక్స్ట్ లెవెల్ అంతే!

Big Stories

Advertisement
×