Jio Annual Recharge: వార్షిక రీఛార్జ్ ప్లాన్ల వైపు మెుగ్గు చూపుతున్న వారి సంఖ్య ఈ రోజుల్లో క్రమంగా పెరుగుతోంది. టెలికాం సంస్థలు ప్లాన్ల ధరలు సడెన్ గా ఎప్పుడు పెంచుతాయే అర్థం కానీ నేపథ్యంలో మెుబైల్ యూజర్లు వార్షిక ప్లాన్ల దిశగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జియో యూజర్ల కోసం ఓ అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. రూ.3599 ధరకు లభిస్తున్న ఈ ప్లాన్ లో యూజర్లు కోరుకునే అన్ని రకాల బెనిఫిట్స్ లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ప్లాన్ ను 365 రోజుల వ్యాలిడిటీతో జియో తీసుకొచ్చింది. దీని కింద ప్రతీరోజూ యూజర్లకు 2.5GB డేటా లభించనుంది. ఈ లెక్కన మొత్తం 365 రోజులకు కలిపి సుమారు 912.5GB డేటా యూజర్లు వాడుకోవచ్చు. ఒకవేళ 5G మెుబైల్ ఉండి.. జియో 5G నెట్ వర్క్ పరిధిలో ఉంటే రోజూవారి డేటాతో సంబంధం లేకుండా అపరిమిత 5Gని పొందొచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు.
జియో యానివర్సరీ ఆఫర్ కింద ఈ ప్లాన్ లో మరింత డేటాను ఆఫర్ చేస్తున్నారు. రూ.3,599 ప్లాన్ పై అదనంగా 120GB ఇంటర్నెట్ డేటాను జియో ఫ్రీగా అందిస్తోంది. అయితే ఈ బెనిఫిట్ ను 12 వోచర్స్ రూపంలో ఇస్తున్నారు. ప్రతి వోచర్ ద్వారా 10GB ఎక్స్‌ట్రా డేటా చొప్పున.. వినియోగదారులు ప్రతి నెలా అదనంగా 10GB డేటాను పొందవచ్చు.
ఈ ప్లాన్ వార్షిక ప్లాన్ లో జియో హాట్ స్టార్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ను సైతం అందిస్తున్నారు. అంతేకాకుండా జియోటీవీ ప్రో ప్యాక్ ను సైతం ఉచితంగా ఇస్తోంది. దీని ద్వారా వెయ్యికి పైగా లైవ్ టెలివిజన్ ఛానెల్స్‌ను వీక్షించవచ్చు. నిజానికి దీని నెలవారీ విలువ రూ.55 కాగా ఈ ప్లాన్‌లో ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే జియో తన కస్టమర్లు అందిస్తోంది. అటు జియో ఏఐ క్లౌడ్ ద్వారా 50GB ఉచిత ఆన్‌లైన్ స్టోరేజ్ యూజర్లకు లభించనుంది.
Also Read: భూమిని కుళ్లుకునేలా చేస్తున్న గ్రహం.. చుట్టూ ఏకంగా 285 చందమామలు.. అక్కడంతా వెన్నెల మయం!
ఈ వార్షిక ప్లాన్‌లో ‘కాన్వా ప్రో లైట్’ సేవలు సైతం యూజర్లు ఉచితంగా పొందవచ్చు. 12 నెలల సబ్ స్క్రిప్షన్ ను జియో అందిస్తోంది. దీని మార్కెట్ విలువ సుమారు రూ.1,590గా ఉంది. ఇవే కాకుండా జియో యానివర్సరీ ఆఫర్ కింద ప్రత్యేక డిస్కౌంట్లను సైతం జియో అందిస్తోంది. ఈజ్‌మైట్రిప్ (EaseMyTrip) లో విమాన టికెట్ల బుకింగ్‌లపై రూ.2,200 వరకు తగ్గింపు పొందొచ్చు. అజియో (AJIO) యాప్ లో రూ.1,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై రూ.200 డిస్కౌంట్ పొందొచ్చు. డిస్ట్రిక్ట్ (District)లో కనీసం రూ.750 విలువైన రెండు సినిమా టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు రూ.150 ఫ్లాట్ రాయితీ ఇస్తున్నారు.
Also Read: పండుగ ఆఫర్లు లేవు.. హంగూ ఆర్భాటం ఉండదు.. అయినా సామాన్యుల అడ్డాగా డీమార్ట్ ఎలా మారింది?