Mini Refrigerators: ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ అనేది ప్రతీ ఇంటికి అతి ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. అయితే హాస్టల్లో ఉండే వారికి, బ్యాచిలర్స్ కి, అద్దె ఇంట్లో జీవించే ఉద్యోగులకు పెద్ద డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనేంత అవసరం, స్థోమత ఉండకపోవచ్చు. అటువంటి వారకోసం మినీ కాంపాక్ట్ ఫ్రిడ్జ్ లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కొద్ది మెుత్తంలో పండ్లు, నీరు, స్నాక్స్ స్టోర్ చేసుకోవడానికి ఈ బుల్లి ఫ్రిడ్జ్ లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ నేపథ్యంలో సింగిల్స్ కోసం రూ.15,000 లోపు బడ్జెట్ లో లభిస్తున్న అత్యుత్తమ బ్రాండెండ్ కాంపాక్ట్ ఫ్రిడ్జ్ లు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఈ జాబితాలో అత్యంత తక్కువ ధరకు లభించే ఫ్రిజ్ ‘షార్ప్ 50L’. దీని ధర సుమారు రూ. 8,990. దీని లోపల గట్టి గ్లాస్ షెల్ఫ్‌లు ఉండటం వల్ల బరువైన బాటిళ్లు, గిన్నెలు, స్నాక్స్ ఎలాంటి భయం లేకుండా భద్రపరుచుకోవచ్చు. మరోవైపు దీనిని క్లీనింగ్ చేసేందుకు వీలుగా డోర్ గ్యాస్కెట్ ను సైతం అమర్చారు. ఈ ఫ్రిజ్‌కు 2-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది.
రూ. 9,000 ధరలో లభించే ‘హయ్యర్ 50L’ మినీ బార్ ఫ్రిజ్ క్రేజీ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఐస్ క్యూబ్స్, ఫ్రోజెన్ స్నాక్స్ కోసం ఇందులో చిన్నపాటి ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో ఉంది. రాత్రి వేళల్లో వస్తువులను స్పష్టంగా చూడటానికి ఎల్‌ఈడీ లైట్, సేఫ్టీ కోసం లాక్ సదుపాయాన్ని దీనికి ఇచ్చారు. ఇది 2-స్టార్ రేటింగ్ కలిగి ఉంది.
యూజర్ల నుంటి టాప్ రేటింగ్ తో ఈ ఫ్రిడ్జ్ దూసుకుపోతోంది. దీని ధర రూ. 9,250 కాగా.. గదిలోని స్థలానికి తగ్గట్లుగా దీని డోర్ ను ఇరువైపులా ఓపెన్ చేసేలా మార్చుకోవచ్చు. ప్లగ్ తీయకుండానే ఆఫ్ చేసేలా టెంపరేచర్ డయల్ దీనికి అందించారు. తక్కువ శబ్దం రావడం వల్ల బెడ్ రూమ్స్ సైతం ఈ ఫ్రిడ్జ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది.
3-స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగిన ఏకైక మినీ ఫ్రిజ్ ఇది. ఈ ‘ఎల్‌జీ 43L’ ధర రూ. 10,890. రోజంతా ఆన్‌లో ఉంచినా కరెంట్ బిల్లు తక్కువగానే వస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫ్రిజ్‌పై ఏడాది, కంప్రెసర్‌పై ఏకంగా 10 సంవత్సరాల వారంటీని కంపెనీ ఇస్తోంది. ఇది సింగిల్ లేదా కపుల్స్ కు బాగా సరిపోతుంది.
ఇద్దరు లేదా ముగ్గురు సభ్యుల కుటుంబానికి ‘వర్ల్‌పూల్ 184L’ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. దీని ధర రూ. 14,990. వెజిటబుల్ క్రిస్పర్, బాటిల్ స్టోరేజ్, 3 స్టార్ రేటింగ్ వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది. పవర్ కట్స్ సమయంలో హోమ్ ఇన్వర్టర్‌కు కనెక్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది.