Flipkart Diwali offers: దీపావళి పండగ వేళ కొత్త గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలని చూస్తున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ‘దీపావళి సేల్’ మీకు చక్కటి అవకాశం. మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన వివిధ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్‌లపై.. కంపెనీలు ఊహించని రీతిలో ధరలను తగ్గించాయి. రూ.30,000 కంటే తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, అద్భుతమైన కెమెరా,పవర్ ఫుల్ బ్యాటరీ కలిగిన టాప్ 5 స్మార్ట్ ఫోన్‌లు ఈ సేల్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆ ఫోన్‌లు ఏంటో.. వాటి ధరలు, ఆఫర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రీమియం డిజైన్ , డిఫరెంట్ లుక్ కోరుకునే.. వారి ఫేవరెట్ ఛాయిస్.. నథింగ్ ఫోన్. గ్లైఫ్ ఇంటర్‌ఫేస్, క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో.. వచ్చే ఈ ఫోన్ అసలు ధర మార్కెట్లో దాదాపు రూ.25,000 నుంచి రూ. 8,000 మధ్య ఉండగా, ఫ్లిప్ కార్ట్ దీపావళి సేల్‌లో.. ఇది మరింత తగ్గింపుతో రూ.21,999 నుంచి రూ.23,990 ధరలలో లభిస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌తో ఇది సూపర్ ఫాస్ట్‌గా పని చేస్తుంది.
గేమింగ్ లవర్స్‌కు, హెవీ యూజర్లకు పోకో ఎక్స్6 ప్రో ఒక అద్భుతమైన ఆప్షన్. డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్‌తో..కూడిన ఈ ఫోన్ లాగ్ లేని పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది. దీని అసలు..ధర రూ.30,000 పైమాటే ఉండగా.. ఫ్లిప్ కార్ట్ సేల్ ప్రత్యేక ఆఫర్ల కింద ఇది సుమారు రూ.24,999 కే అందుబాటులో ఉంది. దీని అమోలెడ్ డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్ దీని ప్రత్యేకతలు.
స్లిమ్ డిజైన్, కర్వ్డ్ డిస్ ప్లే, అద్భుత మైన కెమెరా అనుభవాన్ని కోరుకునే..వారికి మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ పర్ఫెక్ట్ ఛాయిస్.సోనీ ఎల్వైటిఐఏ కెమెరా సెన్సార్‌తో.. ఫొటోలు అద్భుతంగా వస్తాయి. ఈ ఫోన్ ధర ఫ్లిప్ కార్ట్ సేల్‌లో.. రూ. 22,999 నుంచి రూ.24,999 మధ్య ట్రెండ్ అవుతోంది. బ్యాంక్ ఆఫర్లను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
వన్ ప్లస్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా.. చెప్పాల్సిన పని లేదు. తక్కువ బడ్జెట్‌లో..వన్‌ప్లస్ ఫీల్ పొందాలనుకునే వారికి.. నార్డ్ సీఈ 4 చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న.. ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.24,999 శ్రేణిలో లభిస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ దీనిలో స్పెషల్ అట్రాక్షన్.
రియల్ మీ నుంచి వచ్చిన ఈ ప్రీమియం.. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్‌ప్లే, స్టైలిష్ లుక్‌తో వస్తుంది. సుమారు రూ.27,000 నుంచి రూ. 29,999 ధరల శ్రేణిలో.. లభించే ఈ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది.
Also Read: కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్‌పై..ఏకంగా 50 శాతం డిస్కౌంట్!
బ్యాంక్ డిస్కౌంట్లు: ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను (ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ వంటివి) ఉపయోగించి కొంటే.. ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్: మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం.. ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందొచ్చు. కంపెనీలు పాత ఫోన్ కండిషన్‌ను బట్టి.. మంచి ఎక్స్ఛేంజ్ వాల్యూను అందిస్తున్నాయి.
నో-కాస్ట్ ఈఎంఐ: ఒకే సారి డబ్బు చెల్లించలేని.. వారు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని ఈజీగా నెల వారీ కిస్తీలపై ఫోన్‌ను ఇంటికి తెచ్చుకోవచ్చు.
దీపావళి పండగ వేళ సరి కొత్త స్మార్ట్ ఫోన్‌ను కొనాలని భావిస్తున్న వారికి ఫ్లిప్‌కార్ట్ సేల్ మంచి అవకాశాన్ని ఇస్తోంది. రూ.30వేలలోపు బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్‌లపై ఉన్న ఆఫర్లు తక్కువ కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి వెంటనే మీ డీల్‌ను బుక్ చేసుకోండి!