E-Paper
Advertisement

చెవులకు క్లిప్‌లా ఫిట్ చేసుకోవచ్చు.. 32 గంటల బ్యాటరీతో రెడ్‌మీ కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్!

చెవులకు క్లిప్‌లా ఫిట్ చేసుకోవచ్చు.. 32 గంటల బ్యాటరీతో రెడ్‌మీ కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్!
Advertisement

Redmi Clip Neo: చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ షావోమీ.. నుంచి సరికొత్త Redmi Clip Neo ఓపెన్ ఇయర్ ఇయర్‌బడ్స్‌ విడుదల అయ్యాయి. Redmi K100 స్మార్ట్‌ఫోన్‌తో పాటు వీటిని చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది. చెవులకు క్లిప్‌లా అమర్చుకునే డిజైన్‌తో వచ్చిన ఈ ఇయర్‌బడ్స్‌లో మంచి సౌండ్ క్వాలిటీతో పాటు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అందించే ఫీచర్లు ఉన్నాయి. 12mm డ్రైవర్లు, ఏఐ నాయిస్ రిడక్షన్, ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసే సదుపాయం వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

ధర, కలర్ ఆప్షన్లు:

Redmi Clip Neo ఇయర్‌బడ్స్ ధర చైనాలో 399 యువాన్లుగా ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.5,300. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. CryingCenter బ్రాండ్‌తో కలిసి రూపొందించిన లిమిటెడ్ ఎడిషన్ గిఫ్ట్ బాక్స్ ధర 449 యువాన్లు. అంటే.. సుమారు రూ.6,000. ఇందులో బ్లాక్ ఇయర్‌బడ్స్‌తో పాటు ప్రత్యేక క్యారీ పౌచ్, స్టిక్కర్లు, ప్రత్యేక ప్యాకేజింగ్ ఇస్తారు. భారత్‌లో వీటి విడుదల వివరాలు ఇంకా వెల్లడించలేదు.

Advertisement

Also Read: షాకింగ్.. నవంబర్ 15 నుంచి ఆ ఫోన్ల ధరలు భారీగా పెంపు.. కొత్త ధరలు ఇవే!

సౌండ్ క్వాలిటీ, కాల్ ఫీచర్లు:

ఈ ఇయర్‌బడ్స్‌లో 12mm డ్యూయల్ మాగ్నెటిక్ డ్రైవర్లను ఉపయోగించారు. సాధారణ సింగిల్ మాగ్నెటిక్ డ్రైవర్లతో పోలిస్తే.. 40 శాతం ఎక్కువ సౌండ్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది. సౌండ్‌లో డిస్టార్షన్ తగ్గించేందుకు డైమండ్ లాంటి కార్బన్ కోటింగ్ ఇచ్చారు. బాస్ మెరుగ్గా ఉండేందుకు ప్రత్యేక ఫీచర్‌తో పాటు 4 ఈక్యూలైజర్ మోడ్‌లు ఉన్నాయి. నచ్చినట్లు సౌండ్ మార్చుకునేందుకు 10-బ్యాండ్ ఈక్యూలైజర్ కూడా అందించారు. రెండు మైక్రోఫోన్ల సాయంతో ఏఐ నాయిస్ రిడక్షన్ పనిచేస్తుంది. దీంతో కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ స్పష్టంగా వినిపించే అవకాశం ఉంటుంది.

బ్యాటరీ, కనెక్టివిటీ:

Advertisement

ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఇయర్‌బడ్స్ ఏడు గంటల వరకు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 32 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. బ్లూటూత్ 5.4, SBC, AAC సపోర్ట్ ఉన్నాయి. 10 మీటర్ల పరిధిలో కనెక్టివిటీ పనిచేస్తుంది. రెండు డివైజ్‌లకు ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు. కేసులో USB టైప్-C ఛార్జింగ్ సదుపాయం ఉంది.

డిజైన్, ఇతర ఫీచర్లు:

ప్రతి ఇయర్‌బడ్ బరువు 5.3 గ్రాములు మాత్రమే. ఫ్లెక్సిబుల్ టైటానియం వైర్‌పై సాఫ్ట్ సిలికాన్ కవర్ ఇచ్చారు. 25,000 సార్లు వంచి పరీక్షించినట్లు కంపెనీ చెబుతోంది. ఇయర్‌బడ్ తీసేస్తే మ్యూజిక్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. కస్టమ్ బటన్ కంట్రోల్స్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉన్నాయి. షావోమీ హైపర్‌ఓఎస్‌తో స్మార్ట్ హోమ్ పరికరాలను నియంత్రించవచ్చు. అలాగే ఇయర్‌బడ్స్ ఎక్కడ ఉన్నాయో మ్యాప్, సౌండ్ అలర్ట్‌లతో గుర్తించే ఫీచర్ కూడా అందించారు.

Also Read: రూ.30,000 లోపు బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లు.. 2026లో టాప్-5 మోడల్స్ ఇవే!

Tags

Related News

స్పీకర్ నుంచి స్మార్ట్‌వాచ్ వరకు అన్నీ ఆఫర్లో.. రూ.3,000 లోపు బెస్ట్ దీపావళి గిఫ్ట్స్ మీ కోసం!

40 గంటల బ్యాటరీ బ్యాకప్.. ఫ్రీ గానా సబ్‌స్క్రిప్షన్‌తో Noise Buds R1 Gaana Edition లాంచ్!

జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ. 123కే అపరిమిత కాల్స్, డేటా, సినిమాలు.. మిస్ అవ్వకండి!

వావ్.. ఏకంగా 7 ఐఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు, యాపిల్ లవర్స్‌కు పండగ లాంటి ఆఫర్!

బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్‌వాచ్..నాయిస్ నుంచి కొత్త మోడల్ లాంచ్

మేడ్ ఇన్ ఇండియా మొబైల్స్ ఈజ్ బ్యాక్.. కార్బన్ నుంచి రాబోతున్న ఆ రెండు ఫోన్లు ఇవే!

ప్రీమియం లుక్,పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్.. మోటోబుక్ 60 ధర ఎంతంటే?

గ్రూప్ చాటింగ్ ఇకపై సూపర్ ఈజీ.. వాట్సప్ తెచ్చిన ఆ 4 కొత్త ఫీచర్ల గురించి తెలుసా?

Big Stories

Advertisement
×