E-Paper
Advertisement

బ్యాంక్ అకౌంట్ సేఫ్‌గా ఉండాలా?ఈ 5 పనులు ఈరోజే చేయండి!

బ్యాంక్ అకౌంట్ సేఫ్‌గా ఉండాలా?ఈ 5 పనులు ఈరోజే చేయండి!
Advertisement

Protect bank data AI era cyber fraud: ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో భాగమైపోయిన తర్వాత పనులు ఈజీ అయ్యాయి. కానీ అదే సమయంలో.. సైబర్ నేరాలు కూడా భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి ..వచ్చిన తర్వాత మోసగాళ్ల పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. మీ బంధువుల గొంతును కాఫీ చేసి డబ్బు అడగడం, అసలు పోలి ఉండే ఫేక్ బ్యాంక్ వెబ్‌ సైట్లను సృష్టించడం వంటి ప్రమాదకరమైన పనులకు పాల్పడుతున్నారు. మీ బ్యాంక్ అకౌంట్లకు, పర్సనల్ డేటాను ఈ సైబర్ ముప్పు నుంచి కాపాడుకోవడానికి మీరు ఈ రోజే పాటించాల్సిన 5 అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

1. బలమైన పాస్‌వర్డ్‌:

చాలా మంది ఇప్పటికీ ‘123456’ లేదా వారి పుట్టిన తేదీలను పాస్‌ వర్డ్‌లుగా వాడుతుంటారు. హ్యాకర్లు.. ఇలాంటి సాధారణ పాస్‌వర్డ్‌లను సెకన్లలో క్రాక్ చేస్తారు. మీ సోషల్ మీడియా, ఈమెయిల్, బ్యాంకింగ్ యాప్‌లకు ఎప్పుడూ పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, నంబర్లు , ప్రత్యేక గుర్తులు కలిగిన బలమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి. అలాగే..అన్ని ముఖ్యమైన అకౌంట్‌లకు ‘టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్’ లేదా బయోమెట్రిక్ లాక్‌ను ఆన్ చేయడం ద్వారా సేఫ్టీ లభిస్తుంది.

2. అపరిచిత లింక్‌లు :

Advertisement

“మీ లాటరీ తగిలింది”, “ఇప్పుడే ఈ లింక్ క్లిక్ చేసి కేవైసీ పూర్తి చేయండి” అంటూ.. వచ్చే ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు అన్నీ.. దాదాపు మోసపూరితమైనవే.ఏఐ ద్వారా సృష్టించిన అచ్చం బ్యాంక్ వెబ్‌సైట్ లాంటి.. ఫేక్ పేజీలకు మిమ్మల్ని మళ్లించి వివరాలు హ్యాక్ చేస్తారు. అధికారిక యాప్‌లు లేదా వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేయండి కానీ..ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని లింక్‌లపై క్లిక్ చేయెద్దు.

3. పబ్లిక్ వైఫై:

రైల్వే స్టేషన్లు, హోటళ్లు, మాల్స్‌లో లభించే ఫ్రీ పబ్లిక్ వైఫైని వాడటం చాలా ప్రమాదకరకం. హ్యాకర్లు ఈ పబ్లిక్ నెట్‌వర్క్‌ల ద్వారా మీ ఫోన్‌ హ్యాక్ చేసి పర్సనల్ ఫోటోలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలను దొంగిలించే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అవ్వకండి. ఒక వేళ వాడాల్సి వస్తే.. నమ్మదగిన ‘వీపీఎన్’సర్వీస్‌ను ఉపయోగించండి.

4. యాప్‌లు:

Advertisement

ఫోన్ తయారీదారులు , బ్యాంకింగ్ యాప్ డెవలపర్లు సెక్యూరిటీ.. లోపాలను సరి చేయడానికి ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌లను విడుదల చేస్తుంటారు. మీ ఫోన్ సాఫ్ట్‌ వేర్ లేదా బ్యాంకింగ్ యాప్‌లను పాత వెర్షన్‌లోనే..ఉంచడం వల్ల హ్యాకర్లకు ఈజీగా చిక్కే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ.. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లతో మీ ఫోన్‌ను అప్‌డేట్ చేసుకోండి.

Also Read: ఫ్లిప్‌కార్ట్ దీపావళి ఆఫర్లు..రూ.30వేల కంటే తక్కువ ధరకే ప్రీమియం ఫోన్‌లు!

5. సెట్టింగ్స్‌ :

సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌లలో మీ పర్సనల్ సమాచారం (ఫోన్ నంబర్, ఈమెయిల్, అడ్రస్) అందరికీ కనిపించేలా ఉంచకండి.సైబర్ నేరగాళ్లు ఈ సమాచారాన్ని సేకరించి మిమ్మల్ని మోసం చేయడానికి.. సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ వాడుతుంటారు. మీ ప్రొఫైల్స్ లాక్ చేసి ఉంచడం, కేవలం ఫ్రెండ్స్‌కు మాత్రమే డేటా కనిపించేలా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవడం మంచిది.

సైబర్ నేరగాళ్లు ఎంత తెలివైన వారైనా, మన అప్రమత్తతే.. మనకు అతిపెద్ద రక్షణ కవచం. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం.. ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ లోని డబ్బును,పర్సనల్ డేటాను కాపాడుకోవచ్చు. ఏదైనా మోసం జరిగితే వెంటనే.. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.

Related News

BSNL చౌకైన ప్లాన్లు.. రోజుకు రూ.5, రూ.6 మాత్రమే.. 330 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీ కాల్స్, డేటా!

రూ. 15,000 లోపే బెస్ట్ మినీ ఫ్రిజ్‌లు.. హాస్టలర్స్, బ్యాచిలర్స్‌కి సూపర్ ఛాయిస్!

యాపిల్ నుంచి మరో సంచలనం.. రూ.80 వేల లోపే శక్తివంతమైన A20 చిప్‌తో కొత్త ఐఫోన్!

చెవులకు క్లిప్‌లా ఫిట్ చేసుకోవచ్చు.. 32 గంటల బ్యాటరీతో రెడ్‌మీ కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్!

ఫ్లిప్‌కార్ట్ దీపావళి ఆఫర్లు..రూ.30వేల కంటే తక్కువ ధరకే ప్రీమియం ఫోన్‌లు!

షాకింగ్.. నవంబర్ 15 నుంచి ఆ ఫోన్ల ధరలు భారీగా పెంపు.. కొత్త ధరలు ఇవే!

శాంసంగ్,ఇతర బ్రాండ్లు మళ్లీ 4G ఫోన్‌లను మార్కెట్‌లోకి ఎందుకు తెస్తున్నాయి?

Big Stories

Advertisement
×